Petrol Price Hike : పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు... కేవలం వారికి మాత్రమే
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పడిపోతున్నా భారతదేశంలో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ డ్యూటీని లీటరుకు రూ.2 పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆర్థిక మాంద్యం భయాలు, ట్రంప్ యొక్క టారిఫ్ యుద్ధం దీనికి కారణం. ఇది ఆర్థిక మార్కెట్లలో, చమురు ఆధారిత రంగాలలో ఆందోళనలను పెంచుతోంది.

Petrol Price
Petrol Price : ఆయిల్ కంపనీలకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకం లీటర్ కు 2 రూపాయలు పెంచింది. అయితే ఈ పెరిగిన ఎక్సైజ్ డ్యూటీని ఆయిల్ సరఫరా కంపనీలే భరిస్తాయని ... ప్రజలపై ఎలాంటి భారం ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అంటే పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు యధావిధిగా కొనసాగనున్నాయి.
అయితే ప్రస్తుతం ట్రంప్ ప్రభుత్వం ప్రపంచ దేశాలపై విధిస్తున్న సుంకాల కారణంగా అంతర్జాతీయ మార్కెట్ లో చమురు ధరలు తగ్గాయి. ఇది ఆర్థిక మాంద్యం భయాలను రేకెత్తించింది. బ్రెంట్ ముడి చమురు 3.5% పైగా పడిపోయి బ్యారెల్‌కు $63.30 వద్ద స్థిరపడింది. అయితే వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) $59.79కి పడిపోయింది - గత వారం భారీగా $10 పతనాన్ని కొనసాగించింది.
ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా నోటిఫికేషన్ ప్రకారం పెట్రోల్, డీజిల్ ధరల మార్పు ఏప్రిల్ 8, 2025 నుండి అమలులోకి వస్తుంది. అలాగే పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ పెట్రోల్ డీజిల్ ధరలపై క్లారిటీ ఇచ్చింది. "ఎక్సైజ్ డ్యూటీ రేట్లలో పెంపుదల తరువాత పెట్రోల్ మరియు డీజిల్ రిటైల్ ధరలలో ఎటువంటి పెరుగుదల ఉండదని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తెలియజేశాయి" అని ప్రకటించారు.
Petrol Price
అమెరికా, చైనా టారీఫ్స్ వార్ ఎఫెక్ట్ :
ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనా మధ్య వాణిజ్యపరమైన యుద్ధ వాతావరణం నెలకొంది., దీంతో ప్రపంచంలో ఆర్థిక మాంద్యం వస్తుందనే భయంతో ముడి చమురు ధరలు భారీగా పడిపోయాయి. దీని ప్రభావం ఆర్థిక మార్కెట్లపై పడింది... చమురు ఆధారిత స్టాక్స్ భారీగా నష్టపోయాయి.
ఇవాళ సోమవారం అంటే ఏప్రిల్ 7న ప్రధాన భారతీయ చమురు సంస్థల షేర్లు భారీగా పతనమయ్యాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ 4.6%, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC) 4.4%,
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) 6.1% షేర్లు పడిపోయాయి. ఈ కంపెనీలు చముర అన్వేషణ, ఉత్పత్తిలో ఎక్కువగా పాల్గొంటాయి. ముడి చమురు ధరలు పడిపోవడం వల్ల ఆయిల్ కంపనీల ఆదాయం, లాభాల మార్జిన్లు తగ్గిపోతాయి.
చమురు మార్కెటింగ్ కంపెనీలకు (OMCలు) కూడా నష్టం వాటిల్లింది. BPCL 0.21% పెరిగింది. అయితే IOC మరియు HPCL వరుసగా 2.38% మరియు 2.04% తగ్గాయి. విమానయానం, పెయింట్ మరియు టైర్ స్టాక్‌లు కూడా పడిపోయాయి. ఈ నష్టాల కారణంగా BSE సెన్సెక్స్ 4.37% పడిపోయి మధ్యాహ్నం 72,069.94 వద్ద ఉంది. ఇది పెట్టుబడిదారుల ఆందోళనను తెలియజేస్తుంది.