- Home
- Technology
- Tech News
- Poco C71: రూ. 6 వేలలో ఇలాంటి ఫీచర్లు ఎంటి భయ్యా.. తడి చేతులతో కూడా ఆపరేట్ చేయొచ్చు.
Poco C71: రూ. 6 వేలలో ఇలాంటి ఫీచర్లు ఎంటి భయ్యా.. తడి చేతులతో కూడా ఆపరేట్ చేయొచ్చు.
మార్కెట్లో రోజుకో కొత్త ఫోన్ సందడి చేస్తోంది. మారిన టెక్నాలజీకి అనుగుణంగా కొంగొత్త ఫీచర్లతో కూడిన స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి అందుబాటులోకి వస్తున్నాయి. ముఖ్యంగా బడ్జెట్ మార్కెట్‌ను టార్గెట్ చేసుకొని కొత్త ఫోన్‌లను తీసుకొస్తున్నారు. తాజాగా ఇలాంటి ఓ బడ్జెట్ ఫోన్ మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది. పోకో సీ71 పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
- FB
- TW
- Linkdin
Follow Us
)
POCO C71
బడ్జెట్‌లో ధరలో అధునాతన ఫీచర్లతో కూడిన ఫోన్‌లను తీసుకొస్తోంది ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ పోకో. ఈ క్రమంలోనే తాజాగా భారత మార్కెట్లోకి పోకో సీ71 పేరుతో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. కేవలం రూ. 6500కే ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది. ఇప్పటికే అధికారికంగా లాంచ్ కాగా ఈ ఫోన్ అమ్మకాలు ఏప్రిల్ 8వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌తో పాటు అన్ని రిటైల్ స్టోర్స్‌లో ఈ ఫోన్ లభించనుంది.
ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ. 8999కాగా లాంచింగ్ ఆఫర్‌లో భాగంగా 27 శాతం డిస్కౌంట్‌తో రూ. 6499కే లభిస్తోంది. ఇక ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా 5 శాతం డిస్కౌంట్ లభించనుంది. ఈ లెక్కన ఈ ఫోన్‌ను రూ. 6 వేలకే సొంతం చేసుకోవచ్చన్నమాట. ధర తక్కువ అని ఫీచర్ల విషయంలో రాజీ పడాల్సి వస్తుందని అనుకునేరు. తక్కువ ధరలో కూడా అదిరిపోయే ఫీచర్లను ఇందులో అందించారు.
Poco C71
ఫీచర్ల విషయానికొస్తే పోకో సీ71 స్మార్ట్ ఫోన్‌లో 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్‌ను అందించనున్నారు. ఈ ఫోన్లో 6.88 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ ప్లస్ స్క్రీన్‌ను అందించనున్నారు. ఈ స్క్రీన్ 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. వాటర్ డ్రాప్ నాచ్‌తో తీసుకొచ్చారు. తడి చేతులతో కూడా ఆపరేట్ చేసుకునేందుకు వీలుగా ఈ ఫోన్‌లో స్క్రీన్ వెట్ టచ్ ఫీచర్‌ను అందించారు. ఈ ఫోన్ యూనిసోనిక్ T7250 SoC చిప్‌సెట్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇక ఈ ఫోన్‌లో మెమోరీని ఎస్డీ కార్డు సహాయంతో 2 టీబీ వరకు విస్తరించుకోవచ్చు.
Poco smartphone
TUVలో బ్లూ లైట్, ఫ్లికర్-ఫ్రీ, సర్కాడియన్ సర్టిఫికేషన్లతో తీసుకొచ్చిన ఈ ఫోన్ స్క్రీన్ కంటిపై ఎలాంటి ప్రభావం పడకుండా చూసుకుంటుంది. ఈ స్మార్ట్ ఫోన్‌ను డెసర్ట్ గోల్డ్, కూల్ బ్లూ, పవర్ బ్లాక్ వంటి కలర్స్‌లో తీసుకొచ్చారు. బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 15 వాట్స్‌ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 500 ఎమ్‌ఏహెచ్ కెపాసిటీ బ్యాటరీని అందించారు. ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌కు సపోర్ట్ చేసే ఈ ఫోన్‌లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించారు.
Poco smartphone
కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 32 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు. ఇక ఈ ఫోన్‌లో 3.5mm హెడ్‌ఫోన్ జాక్, IP52 రేటింగ్‌ను ఇచ్చారు. ఏప్రిల్ 8వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్ కార్ట్‌లో సేల్ ప్రారంభం కానుంది.