- Home
- Business
- వారెవ్వా వారెన్ బఫెట్ ... ట్రంప్ టారిఫ్స్ దెబ్బకు తడబడని ఒకేఒక్కడు, సక్సెస్ సీక్రెట్ అదే
వారెవ్వా వారెన్ బఫెట్ ... ట్రంప్ టారిఫ్స్ దెబ్బకు తడబడని ఒకేఒక్కడు, సక్సెస్ సీక్రెట్ అదే
వారెస్ బఫెట్...అనుభవం ముందు ఏదీ పనికిరాదని నిరూపిస్తున్నాడు. ట్రంప్ దెబ్బకు యావత్ ప్రపంచ మార్కెట్లు అతలాకుతలం అవుతుంటే బఫెట్ మాత్రం నిశ్చింతంగా ఉన్నారు. ఇంకా ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాతే అతడి సంపద చాలా పెరిగింది. ట్రంప్ కు అత్యంత సన్నిహితుడు, ప్రపంచ కుభేరుడు ఎలాన్ మస్క్ కు సాధ్యం కానిది బఫెట్ కు ఎలా సాధ్యమయ్యింది? అతడి సక్సెస్ సీక్రెట్ ఏమిటి?
- FB
- TW
- Linkdin
Follow Us
)
Warren Buffett
Warren Buffett : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యావత్ ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాడు. అతడు రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో ఎవరికీ అంతుచిక్కడంలేదు. మొదట అమెరికాలోని అక్రమ వలసదారులపై పడ్డ ట్రంప్ ఇప్పుడు సొంత దేశానికే చెందిన వ్యాపారవేత్తలపై పడ్డాయి. ప్రత్యక్షంగా అమెరికన్ వ్యాపారులను టార్గెట్ చేయకున్నా ట్రంప్ తీసుకునే నిర్ణయాలు వారి ఆదాయానికి గండి కొడుతున్నాయి.
అమెరికా ప్రపంచ దేశాలపై సుంకాలను భారీగా పెంచిన విషయం తెలిసిందే. దీంతో ఆ దేశాలే కాదు అమెరికా కూడా ఎఫెక్ట్ అవుతోంది... స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్నాయి... ప్రముఖ కంపనీల షేర్లు పేకమేడల్లా కుప్పకూలిపోతున్నాయి. ఇలా ట్రంప్ ప్రతీకారసుంకాలు అమెరికాకు ఆదాయం తెచ్చిపెడతాయో లేదో తెలీదుగానీ ఆ దేశానికి భారీగా ఆదాయం అందించే కంపనీలు మాత్రం నష్టపోతున్నాయి. దీంతో ప్రపంచ కుబేరులు ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్ వంటివారి సంపద భారీగా తగ్గింది.
ఇలా ట్రంప్ టారీఫ్స్ దెబ్బకి ప్రపంచ కుబేరులంతా విలవిల్లాడిపోతుంటే ఒకే ఒక్కడు మాత్రం నిశ్చింతగా ఉన్నాడు. అతడిపై ట్రంప్ నిర్ణయాలు ఎఫెక్ట్ ఏమాత్రం పడటంలేదు... అందరి సంపద కరిగిపోతుంటే ఇతడి సంపద మాత్రం పెరుగుతోంది. ఇలా మార్కెట్స్ సంక్షోభ సమయంలోనూ భారీగా కాసులు కళ్లజూస్తున్న ఆ వ్యాపారవేత్త ఇంకెవరో కాదు... అమెరికన్ బిలియనీర్, బెర్క్ షైర్ హాత్వే ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ సీఈఓ వారెన్ బఫెట్.
Warren Buffett
ఈ నాలుగు నెలల్లోనే రూ.1.10 కోట్లు సంపాదించిన బఫెట్ :
అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ట్రంప్ బాధ్యతలు చేపట్టి నాలుగు నెలలు అవుతోంది. 2025 జనవరిలో ట్రంప్ బాధ్యతలు చేపట్టింది మొదలు అమెరికాలోనే కాదు ప్రపంచ దేశాల్లో ఆందోళన మొదలయ్యింది. ఇలా ఈ నాలుగు నెలల్లో ట్రంప్ సర్కార్ తీసుకున్న నిర్ణయాలు మార్కెట్ పై తీవ్ర ప్రభావం చూపాయి. ట్రంప్ బాధ్యతలు చేపట్టాక 5 లక్షల కోట్ల డాలర్లను అమెరికా స్టాక్ మార్కెట్ లోని కంపనీలు నష్టపోయాయి. అంటే ఇండియన్ కరెన్సీలో సుమారు రూ.688 లక్షల కోట్లు నష్టమన్నమాట. కరోనా సంక్షోభం తర్వాత ఇదే అతిపెద్ద నష్టం.
కానీ ఇదే నాలుగు నెలల్లో అంటే ట్రంప్ అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టాక దిగ్గజ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ సంపద భారీగా పెరిగింది. ట్రంప్ నిర్ణయాల ఎఫెక్ట్ అతడిపై ఏమాత్రం పడలేదు. ఆయన సంపద ఈ ఏడాదిలో ఇప్పటివరకు 12.7 బిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ.1.10 లక్షల కోట్లు పెరిగింది. మిగతా వ్యాపారులంతా లక్షల కోట్లు నష్టపోతుంటే బఫెట్ ఒక్కరికే లాభాలు ఎలా వస్తున్నాయి? ఆయన సక్సెస్ సీక్రెట్ ఏమిటో తెలుసా?... ముందుచూపు. తన అనుభవంతో భవిష్యత్ ను అంచనా వేసి ముందుజాగ్రత్త పడటమే బఫెట్ ను ఇప్పుడు నిశ్చింతగా ఉండేలా చేసింది.
Warren Buffett
బఫెట్ సక్సెస్ సీక్రెట్ ఇదే :
కేవలం గత గురు, శుక్రవారం రెండ్రోజుల్లో అమెరికా స్టాక్ మార్కెట్స్ భారీగా పతనం అయ్యాయి. కేవలం శుక్రవారం ఒక్కరోజే 329 బిలియన్ డాలర్లు ఆవిరయ్యాయి. ప్రపంచ కుభేరుడు ఎలాన్ మస్క్ సంపద 130 బిలియన్ డాలర్లు, జెఫ్ బెజోస్ సంపద 45.2 బిలియన్ డాలర్లు తగ్గింది. ఇలా ప్రంపంచంలోనే టాప్ ధనవంతుల ఆదాయం తగ్గింది... ఒక్క వారెన్ బఫెట్ ది తప్ప.
స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులపై భాగా అనుభవం కలిగిన బఫెట్ ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నారు. అమెరికాలో పరిణామాలు ఎలా మారుతున్నాయో గమనించిన బఫెట్ భవిష్యత్ లో స్టాక్ మార్కెట్స్ పై ఈ ప్రభావం ఎలా ఉంటుందో ముందుగానే పనిగట్టాడు. అమెరికన్ స్టాక్ మార్కెట్ పతనం అవుతుందని ఊహించిన బఫెట్ ఆ దేశ కంపనీల్లోని తన వాటాను విక్రయించాడు. జపాన్ కంపనీల పరిస్థితి బాగుంటుందని గ్రహించి అందులో పెట్టుబడులు పెట్టారు.
వారెన్ బఫెట్ సీఈవో గా ఉన్న బెర్క్ షైర్ హాత్ వే సంస్థ యాపిల్, బ్యాంక్ ఆఫ్ అమెరికాలో వాటాను తగ్గించుకుంది... ఇదే సమయంలో మిత్సుయ్, మిత్సుబిషి, సుమిటోమో, ఇటోచు, మారుబెని వంటి జపాన్ కంపనీల్లో పెట్టుబడులు పెట్టింది. అయితే బఫెట్ ఊహించిందే నిజమయ్యింది.... అమెరికా సంస్థల షేర్లు పేకమేడల్లా కుప్పకూలగా జపాన్ కంపనీలు షేర్లు పెరిగాయి. దీంతో యావత్ ప్రపంచ మార్కెట్లు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నవేళ, కుభేరుల సంపద ఐస్ ముక్కలా కరుగుతున్నవేళ బఫెట్ సంపద మాత్రం పెరుగుతోంది.