MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Apple iPhone : లారీలు, ట్రక్కుల్లో కాదు... విమానాల్లో యాపిల్ ఐపోన్స్ లోడింగ్, ఎందుకో తెలుసా?

Apple iPhone : లారీలు, ట్రక్కుల్లో కాదు... విమానాల్లో యాపిల్ ఐపోన్స్ లోడింగ్, ఎందుకో తెలుసా?

వస్తువులను ఎక్కువగా లారీలు, ట్రక్కుల్లో రవాణా చేయడం చూస్తుంటాం... అంతర్జాతీయ స్థాయిలో అయితే షిప్పుల్లో రవాణా చేస్తారు. ఇలా రోడ్డు, జల రవాణా వల్ల ఖర్చులు తగ్గి తక్కువ ధరకే ఆ వస్తువులు మార్కెట్లో లభిస్తాయి. కానీ ప్రస్తుతం యాపిల్ ఐపోన్స్ ను విమానాల్లో రవాణా చేస్తున్నారు. యాపిల్ వస్తువుల ధరలు పెరగకుండా ఉండేందుకే ఇలా ఆకాశంలో రవాణా చేస్తున్నారట. విమానాల్లో యాపిల్ వస్తువుల రవాణాకు కారణమేంటో తెలుసా? 

2 Min read
Author : Arun Kumar P
| Updated : Apr 07 2025, 04:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Apple iPhone

Apple iPhone

Apple iPhone : పొట్టోన్ని పొడుగోడు కొడితే.... పొడుగోన్ని పోచమ్మ కొట్టిందట... ఈ సామెత తాజాగా అమెరికన్ కంపనీ యాపిల్ చర్యలకు సరిగ్గా సరిపోతుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇతర దేశాలపై భారీగా సుంకాలు విధిస్తుంటే... ఓ అమెరికన్ కంపనీ మాత్రం ట్రంప్ కే దెబ్బేస్తోంది. అమెరికా విధించిన భారీ సుంకాలనుండి తప్పించుకునేందుకు ఆ దేశానికే చెందిన దిగ్గజ కంపనీ యాపిల్ భారీ ప్లాన్ ను అమలుచేసింది. సొంత దేశం అమెరికాకే దిమ్మతిరిగేలా కౌంటర్ ఇస్తోంది యాపిల్. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
Apple Products

Apple Products

అసలు యాపిల్ ఏం చేసింది?   

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై భారీగా దిగుమతి సుంకాలు విధించిన విషయం తెలిసిందే. అత్యధికంగా చైనాపై 52%, తైవాన్ పై 32% టారీఫ్స్ విధించారు... ఇండియాపై కూడా 26% టారీప్స్ విధించారు. అంటే ఇలా వివిధ దేశాలనుండి దిగుమతి అయ్యే వస్తువులపై పెంచిన సుంకాలను వసూలు చేయనుంది అమెరికా. ఇలా తమ దేశంపై ఏదేశం ఏ స్థాయిలో సుంకాలు విధిస్తుందో అదేస్థాయిలో టారీఫ్స్ విధిస్తున్నారు ట్రంప్. ఈ ప్రతికార సుంకాలు అంతర్జాతీయ మార్కెట్ పై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. 

అయితే ట్రంప్ సర్కార్ విధించిన దిగుమతి సుంకాలు విదేశీ కంపనీలకే కాదు అమెరికన్ కంపనీలకు వర్తిస్తాయి. విదేశాల్లో తయారయ్యే సొంతదేశం కంపనీ వస్తువులపై కూడా సుంకాలు కట్టాలి. ఇది ప్రముఖ మొబైల్ ఫోన్స్ ఐఫోన్ తయారీ సంస్థ యాపిల్ పై తీవ్ర ప్రభావం చూపనుంది. యాపిల్ కంపనీ భారత్ తో పాటు చైనాలో తయారీ ప్లాంట్స్ కలిగివుంది... కాబట్టి ఇక్కడినుండి అమెరికాకు తరలించే ఐఫోన్లు వాటి విడిభాగాలపై భారీగా పన్నులు చెల్లించాల్సి ఉంటుంది.  

అధిక పన్నుల నుండి తప్పించుకునేందుకు యాపిల్ సంస్థ సొంత దేశాన్నే బోల్తా కొట్టించింది. అమెరికా విధించిన సుంకాలు ఏప్రిల్ 9 నుండి అమల్లోకి రానున్నాయి. ఆలోపే భారత్, చైనాలో తయారైన యాపిల్ ఉత్పత్తులను అమెరికాకు తరలిస్తోంది సదరు సంస్థ. ఇప్పటికే ఐదు విమానాలు ఐఫోన్లతో పాటు వివిధ యాపిల్ ఉత్పత్తులను అమెరికాకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భారత్ నుండి 3, చైనా నుండి 2 విమానాలు యాపిల్ వస్తువులతో తరలివెళ్లాయి. 

33
Apple iPhones

Apple iPhones

యాపిల్ ఐఫోన్స్ ధరలు పెరుగుతాయా?  

అమెరికాలో ట్రంప్ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలు విదేశీ కంపనీలపైనే కాదు యాపిల్ వంటి స్వదేశీ కంపనీలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. సుంకాల పెంపు నిర్ణయంతో యాపిల్ ఐఫోన్లతో పాటు ఇతర ఉత్పత్తుల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పట్లో ధరలపెంపు ఉండదని యాపిల్ సంస్థ చెబుతోంది.  

ప్రస్తుతం ధరల పెరుగుదలను నివారించడానికే యాపిల్ సంస్థ విదేశాల్లోని యూనిట్స్ లో తయారయ్యే వస్తువులను స్వదేశానికి చేరవేస్తోంది. దిగుమతి సుంకాలు అమలయ్యే లోపు వీలైనన్ని ఎక్కువ ప్రోడక్ట్స్ అమెరికాకు తరలించేందుకు ప్రత్యేక విమానాలను ఉపయోగిస్తోంది. ఇలా యాపిల్ లోడ్స్ భారత్, చైనా నుండి గాల్లో ఎగురుతున్నాయి. ఇలా తరలిస్తున్న ప్రోడక్ట్స్ ను నిల్వ చేయడానికి గిడ్డంగులను ఉపయోగిస్తున్నారు. 

ఏప్రిల్ 9వ తేదీకి ముందు షిప్ చేయబడిన ఉత్పత్తులకు పాత పన్ను వర్తిస్తాయి... కాబట్టి ప్రస్తుతానికి కొత్త పన్నుల నుండి తప్పించుకోవచ్చని యాపిల్ కంపెనీ భావిస్తోంది. కానీ ఇకపై విదేశాల్లో తయారయ్యే యాపిల్ ఉత్పత్తులపై భారీ సుంకాలు పడనున్నాయి. కాబట్టి ఇప్పుడు కాకున్నా తర్వాతైనా యాపిల్ ఐపోన్లతో పాటు ఇతర ఉత్పత్తుల ధరలు భారీగా పెరిగే అవకాశాలున్నాయి. 
 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
సాంకేతిక వార్తలు చిట్కాలు
డొనాల్డ్ ట్రంప్
ప్రపంచం
భారత దేశం
 
1st ODI • NZ vs IND 2026
NZNZ
Wed, 4 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
BLS Polymers IPO: మొదటి రోజే ఇన్వెస్టర్లకు నోట్ల వర్షం.. ఈ ఐపీఓ 65% లాభాలతో ధమాకా ఎంట్రీ
Recommended image2
Most Expensive Water Bottle: రూ. 50 లక్షల వాటర్ బాటిల్.. ప్రపంచంలో అత్యంత ఖరీదైన నీళ్ళను నీతా అంబానీ తాగేది నిజమేనా?
Recommended image3
ITR Filing 2026: 60 ఏళ్లు వచ్చినా ఆగట్లేదు.. యంగ్ ఇండియా స్టైలే వేరు !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved