- Home
- Entertainment
- తారక్ కి ప్రేమతో అంటూ సుకుమార్ భార్య కామెంట్, ఎన్టీఆర్ రిప్లై ఏంటంటే.. ఏం జరుగుతోంది ?
తారక్ కి ప్రేమతో అంటూ సుకుమార్ భార్య కామెంట్, ఎన్టీఆర్ రిప్లై ఏంటంటే.. ఏం జరుగుతోంది ?
జూనియర్ ఎన్టీఆర్ గురించి స్టార్ డైరెక్టర్ సుకుమార్ తబిత భార్య సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ కి ఎన్టీఆర్ రిప్లై ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. నాన్నకు ప్రేమతో చిత్రంలో తారక్.. సుకుమార్ దర్శకత్వంలో నటించిన సంగతి తెలిసిందే. తబిత చేసిన పోస్ట్ తో సుక్కు, ఎన్టీఆర్ కాంబినేషన్ పై ఊహాగానాలు మొదలయ్యాయి.

Sukumar, NTR
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో చిత్రం గుర్తుందిగా..సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. 9 ఏళ్ళ క్రితం ఈ చిత్రం వచ్చింది. నాన్నకు ప్రేమతో తర్వాత ఎన్టీఆర్, సుకుమార్ కాంబోలో మరో మూవీ రాలేదు. ఎవరి చిత్రాలతో వాళ్ళు బిజీగా ఉన్నారు. ప్రస్తుతం తారక్ వార్ 2, ప్రశాంత్ నీల్ డ్రాగన్ చిత్రాలు చేస్తున్నారు.
Sukumar, NTR
ఈ తరుణంలో సుకుమార్ సతీమణి తబిత సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. ఎన్టీఆర్ ని సుకుమార్ రీసెంట్ గా మీట్ అయ్యారు. ఆ ఫోటోని తబిత సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ 'తారక్ కి ప్రేమతో' అనే క్యాప్షన్ ఇచ్చారు. తబిత పోస్ట్ కి ఎన్టీఆర్ రిప్లై ఇవ్వడం విశేషం.
Sukumar, NTR
'నన్ను వెంటాడే ఎమోషన్ సుకుమార్' అని ఎన్టీఆర్ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎన్టీఆర్ సుకుమార్ కాంబినేషన్ పై ఊహాగానాలు పెరిగేలా చేసింది. సుకుమార్ ఎన్టీఆర్ ని మీట్ కావడంపై ఎలాంటి క్లారిటీ లేదు. కానీ భవిష్యత్తులో వీళ్ళిద్దరి కాంబినేషన్ ఉండబోతుందా? అందుకే ఇప్పుడు మీట్ అయ్యారా? అనే చర్చలు ఫ్యాన్స్ మధ్య మొదలయ్యాయి.
ప్రస్తుతం తారక్ కమిటైన చిత్రాలు పూర్తి కావడానికి రెండేళ్లయినా టైం పడుతుంది. సుకుమార్ తన తదుపరి చిత్రాన్ని రామ్ చరణ్ తో చేయబోతున్నట్లు ఆల్రెడీ ప్రచారం జరుగుతోంది. మరి ఎన్టీఆర్, సుకుమార్ క్యాజువల్ గా మీట్ అయ్యారా లేక ప్రత్యేక కారణం ఏమైనా ఉందా అనేది వాళ్లే చెప్పాలి.