ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలన్నీ ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..

12:19 AM (IST) Apr 28
RCB vs DC IPL 2025: రజత్ పాటిదార్ కెప్టెన్సీలో ఐపీఎల్ 2025 ఆడుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఈ సీజన్ పాయింట్ల పట్టికలో టాప్ లోకి చేరింది. ఢిల్లీ క్యాపిటల్స్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించి, ఈ సీజన్‌లో ఏడో విజయాన్ని అందుకుంది.
పూర్తి కథనం చదవండి11:43 PM (IST) Apr 27
Consequences for Pakistani Citizens Not Leaving India: ఏప్రిల్ 22, పహల్గామ్… అమాయక పర్యాటకులపై జరిగిన దారుణ ఉగ్రదాడి యావత్ భారతావనిని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ చేసిన ఈ దాడిలో 28 మంది ప్రాణాలు కోల్పోయారు. మరీ ముఖ్యంగా మత గుర్తింపుతో పౌరుల ప్రాణాలు తీశారు. ఈ దాడి తర్వాత భారత ప్రభుత్వం ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపుతూ పాకిస్తాన్ విషయంలో కఠిన చర్యలు తీసుకుంటోంది.
10:23 PM (IST) Apr 27
KCR Speech: వరంగల్ వేదికగా ఆదివారం జరిగిన బీఆర్‌ఎస్ రజతోత్సవ సభ కేసీఆర్ స్పీచ్‌తో దద్దరిల్లింది. కాంగ్రెస్ ప్రభుత్వంపై గులాబి దళపతి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్‌కు పరిపాలించడం చేతకాక.. రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయించారన్నారు. రాష్ట్రంలో నీటి ప్రాజెక్టులు 80 నుంచి 90 శాతం పూర్తికాగా.. వాటి పనులు పూర్తి చేయలేకపోయారన్నారు. పేద మహిళల కోసం అమలు చేసిన కేసీఆర్ కిట్ పథకం కూడా బంద్ చేశారన్నారు.
పూర్తి కథనం చదవండి10:09 PM (IST) Apr 27
Massive IAS Transfers in Telangana: తెలంగాణలో భారీగా ఐఏఎస్ (Indian Administrative Service) అధికారుల బదిలీ జరిగింది. ఈ బదిలీలలో వివిధ కీలక శాఖల్లో మార్పులు జరిగాయి. ఫైనాన్స్ కమిషన్ సెక్రటరీగా స్మితా సబర్వాల్(Smita Sabharwal) కు బాధ్యతలు అప్పగించారు.
09:18 PM (IST) Apr 27
How Delhi Missed Virat Kohli in 2008 IPL: ఐపీఎల్ 2008 వేలంలో విరాట్ కోహ్లీని సొంతం చేసుకునే అద్భుత అవకాశాన్ని ఢిల్లీ డేర్‌డెవిల్స్ చేజార్చుకుంది. ఢిల్లీకి చెందిన కుర్రాడు, 2008లో అండర్-19 ప్రపంచ కప్ విజేత జట్టు కెప్టెన్ అయినప్పటికీ, ఢిల్లీ అతన్ని ఎంచుకోలేదు. చివరికి కోహ్లీని ఆర్‌సీబీ కొనుగోలు చేసింది. ఎలా జరిగిందంటే?
పూర్తి కథనం చదవండి08:47 PM (IST) Apr 27
CDS Anil Chauhan meets Rajnath Singh: పహల్గాం ఉగ్రదాడి తర్వాత CDS జనరల్ అనిల్ చౌహాన్ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సమావేశమై సైనిక చర్యలపై చర్చించారు. పాకిస్తాన్‌లోని భారత సైనిక సలహాదారులను వెనక్కి పిలిపించారు.
పూర్తి కథనం చదవండి08:30 PM (IST) Apr 27
BRS Meeting: బీఆర్ఎస్ ఏర్పడి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా ఓరుగల్లు గడ్డ ఎల్కతుర్తిలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభను పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రత్యర్థులకు తన బలం, బలగాన్ని చూపించడమే లక్ష్యంగా కార్యక్రమం నిర్వహించారు. ఇక సభ ఏర్పాట్లన్నీ ఓ ఎత్తైతే… గులాబీ దళపతి స్పీచ్ మరో ఎత్తనే చెప్పాలి. స్టేజి మీదకు వచ్చినప్పటి నుంచి పార్టీ శ్రేణుల్లో జోష్ వచ్చింది. దాదాపు గంటసేపు ఆయన ప్రసంగం కొనసాగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు, రాష్ట్రంలో దొరలపాలన, కాంగ్రెస్ పరిపాలిస్తున్న తీరును కేసీఆర్ ఎండగట్టాడు.
పూర్తి కథనం చదవండి08:22 PM (IST) Apr 27
IPL 2025 MI vs LSG: ర్యాన్ రికెల్టన్, సూర్యకుమార్ యాదవ్ సూపర్ బ్యాటింగ్ కు తోడుగా జస్ప్రీత్ బుమ్రా అద్భుతమైన బౌలింగ్ తో ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ వరుసగా 5వ విజయాన్ని అందుకుంది. రిషబ్ పంత్ కెప్టెన్సీలోని లక్నో సూపర్ జెయింట్స్ ను 54 పరుగుల తేడాతో ఓడించింది.
07:58 PM (IST) Apr 27
BRS Silver Jubilee: బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలను నిర్వహించేందుకు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తిలో భారీగా ఏర్పాట్లు చేశారు. సభలో పార్టీ అగ్రనేతలు హాజరయ్యారు. గులాబి దండు కూడా సభకు భారీగానే చేరుకుంది. ఈక్రమంలో సభ ప్రారంభానికి ముందే స్టేజిపై నాయకుల మధ్య రసాభాస చోటు చేసుకొంది. అందరూ చూస్తుండగానే గులాబి నేతల కుమ్ములాటలు.. బహిర్గతం అయ్యాయి. ఒకనాడు క్రమశిక్షణకు మారుపేరుగా ఉన్న బీఆర్‌ఎస్‌కు ఈ పరిస్థితి ఏంటా అని చర్చించుకుంటున్నారు. ఇక స్టేజీమీద కల్వకుంట్ల కవితకు వ్యతిరేకంగా ఓ వర్గం చేసిన హడావిడి ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యింది.
07:54 PM (IST) Apr 27
అజయ్ దేవగన్ తదుపరి చిత్రం 'రైడ్ 2' అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది. మే 1న విడుదల కానున్న ఈ చిత్రం 2018లో విడుదలైన సూపర్ హిట్ 'రైడ్'కి సీక్వెల్. అజయ్ దేవగన్ చాలా సినిమాల సీక్వెల్స్ వరుసలో ఉన్నాయి. అందులో ఈ 8 కూడా ఉన్నాయి…
పూర్తి కథనం చదవండి07:48 PM (IST) Apr 27
సురక్షితమైన సంభోగం కోసం కండోమ్‌ను ఉపయోగిస్తారనే విషయం తెలిసిందే. కండోమ్‌కు ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంది. ఒకానొక సమయంలో ప్రభుత్వాలు సైతం కండోమ్‌ల వాడకం గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టారు. అయితే కండోమ్‌కు సంబంధించి మనకు తెలియని ఎన్నో ఆసక్తికర విషయాలు ఉన్నాయని మీకు తెలుసా.? అలాంటి ఒక ఇంట్రెస్టింగ్ అంశం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
06:25 PM (IST) Apr 27
Road Accident: కొడంగల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
05:57 PM (IST) Apr 27
Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా ఎంటరైంది. మరోసారి తమ వక్రబుద్దిని చూపిస్తూ చైనా-పాకిస్తాన్ ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడానికి అంగీకరించాయి. ఈ పరిణామం ప్రాంతీయ దౌత్యంపై, భారత్ వ్యూహాలపై ప్రభావం చూపుతుంది.
పూర్తి కథనం చదవండి05:26 PM (IST) Apr 27
2025 ప్రారంభంలో బాక్సాఫీస్ వద్ద అనేక సూపర్ హిట్ చిత్రాలు విడుదలయ్యాయి. కానీ వసూళ్ల విషయానికి వస్తే, ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 200 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసిన నాలుగు చిత్రాలు మాత్రమే ఉన్నాయి. 2025 నాటి ఈ నాలుగు చిత్రాల గురించి తెలుసుకోండి...
పూర్తి కథనం చదవండి04:26 PM (IST) Apr 27
భారతదేశంలో అతిపెద్ద కారు తయారీ సంస్థ అయిన మారుతి సుజుకి, వేగన్ఆర్ తో భారతీయ కస్టమర్ల మనసు దోచుకుంది. 25 ఏళ్లలో 33.7 లక్షల యూనిట్లు అమ్ముడవ్వగా, ప్రతి నలుగురు కొనుగోలుదారుల్లో ఒకరు ఈ కారునే కొనుగోలు చేస్తున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 1.98 లక్షల యూనిట్లు అమ్ముడవ్వడంతో, మారుతి అత్యధికంగా అమ్ముడైన కారుగా తన స్థానాన్ని నిలబెట్టుకుంది.
పూర్తి కథనం చదవండి04:21 PM (IST) Apr 27
Pahalgam Terror Attack - who is Adil Hussain Thokar: జమ్మూ కాశ్మీర్‌కు చెందిన ప్రతిభావంతుడైన విద్యార్థి అయిన ఆదిల్ హుస్సేన్ థోకర్, 26 మంది ప్రాణాలను బలిగొన్న పహల్గాం ఉగ్రదాడికి సూత్రధారులలో ఒకరిగా భావిస్తున్నారు. ఎవరు ఈ ఆదిల్ హుస్సేన్ థోకర్?
పూర్తి కథనం చదవండి02:25 PM (IST) Apr 27
పహల్గాం దాడి తర్వాత జమ్మూ కశ్మీర్‌లో లష్కరే తోయిబా, జైషే మహ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థలకు చెందిన 14 మంది ఉగ్రవాదుల ఇళ్లను అధికారులు కూల్చివేశారు.
పూర్తి కథనం చదవండి02:22 PM (IST) Apr 27
ind-pak: జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రవాదులు జరిపిన దాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. ఈ ఘటన జరిగిన వెంటనే పాకిస్తాన్‌తో పలు ఒప్పందాలు రద్దు చేసుకుంది. దీంతోపాటు.. వీసాలపై వచ్చిన పాక్ పౌరులు ఇండియాను వదిలి వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. అన్ని రాష్ట్రాల సీఎంతో కూడా కేంద్ర మంత్రి అమిత్‌షా ఫోన్‌లో మాట్లాడి.. ఇదే విషయం చెప్పారు. 48 గంటల్లో భారత్‌ను వదిలి వెళ్లాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. సుమారు 107 పాకిస్తానీయులు మిస్సయ్యారని తెలుస్తోంది.
పూర్తి కథనం చదవండి02:15 PM (IST) Apr 27
నటుడు సూర్య నటించిన రెట్రో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా తన తదుపరి చిత్ర దర్శకుడిని ఆయన పరిచయం చేశారు.
పూర్తి కథనం చదవండి02:12 PM (IST) Apr 27
తరుణ్ మూర్తి దర్శకత్వం వహించిన ఈ చిత్రం నిన్ననే థియేటర్లలో విడుదలైంది.
పూర్తి కథనం చదవండి01:58 PM (IST) Apr 27
Shruti Haasan: కమల్ హాసన్ కుమార్తె శృతి హాసన్ తన గ్లామర్‌తోపాటు నటనతో ప్రేక్షకులను మెప్పిస్తోంది. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు మంచి మంచి విజయాలను అందుకుంది. ప్రస్తుతం తెలుగు, తమిళ్ సినిమాల కంటే.. బాలివుడ్‌పై కన్నేసింది శృతి. పాన్ ఇండియా స్టేటస్ కోసం విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో తన తల్లిదండ్రులు విడిపోయినప్పుడు జరిగిన సంఘటనలను గుర్తుకు తెచ్చుకుని చాలా ఎమోషనల్ అయ్యారు.
పూర్తి కథనం చదవండి01:31 PM (IST) Apr 27
పహల్గాం దాడి తర్వాత ఇండియా-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు దిగుతోంది. ఈ క్రమంలోనే పాకిస్థాన్ మంత్రి చేసిన బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీశాయి.
పూర్తి కథనం చదవండి01:22 PM (IST) Apr 27
Kia Engine Theft: ఏపీలోని కియా కార్ల కంపెనీలో ఇంజిన్లు చోరీ కేసులో పురోగతి కనిపిస్తోంది. శ్రీ సత్యసాయి జిల్లాలో ఉన్న కియా కారు పరిశ్రమకు చెందిన ఇంజిన్లు సుమారు 900 వరకు చోరీకి గురైన విషయం ఇటీవల వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై పోలీసులు క్షుణ్నంగా విచారణ జరుపుతున్నారు. చోరీకి పాల్పడిన తమిళనాడు రాష్ట్రానికి చెందిన 9 మందిని ఇప్పటికే అరెస్టు చేశారు. అయితే.. ఒక్కసారే 900 ఇంజిన్లు మాయం అవడం వెనుక పెద్ద ముఠా ఉందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంజిన్లు తరలించేందుకు వినియోగించిన లారీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
01:14 PM (IST) Apr 27
భారత నౌకాదళం బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. ఈ క్షిపణి శత్రువులను క్షణాల్లో ధ్వంసం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది, దీనివల్ల పాకిస్తాన్ వంటి శత్రు దేశాలు ఆందోళన చెందుతున్నాయి.
పూర్తి కథనం చదవండి11:52 AM (IST) Apr 27
ప్రతీ నెల చివరి ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి మన్ కీ బాత్ లో మాట్లాడుతారనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ వారం ప్రధాని మోదీ పహల్గామ్ ఉగ్రదాడి గురించి చర్చించారు. మన్ కీ బాత్ లేటెస్ట్ ఎపిసోడ్ లో మోదీ ఏం మాట్లాడారో ఇప్పుడు తెలుసుకుందాం..
పూర్తి కథనం చదవండి11:35 AM (IST) Apr 27
పహల్గాం ఉగ్రదాడి తరువాత భారత్ పాకిస్థాన్‌ల మధ్య దౌత్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. పాకిస్థాన్ ఉగ్రమూకలను ప్రోత్సహిస్తుందన్న కారణంతో కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఇప్పటికే సింధూ నదీ జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.
10:21 AM (IST) Apr 27
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్)గా ప్రయాణం మొదలుపెట్టి, బీఆర్‌ఎస్‌గా మారిన భారత రాష్ట్ర సమితి నేడు (ఆదివారం) 25వ ఏట అడుగు పెడుతోంది. ఈ సందర్భంగా వరంగల్ శివారులోని ఎల్కతుర్తిలో ‘రజతోత్సవ సభ’ పేరిట భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. సభను విజయవంతం చేయడానికి బీఆర్‌ఎస్ యంత్రాంగం నెల రోజులుగా పూర్తిస్థాయిలో కృషి చేసింది. సుమారు 10 లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు.
10:00 AM (IST) Apr 27
వాటికన్ సిటీలో పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. ప్రపంచ నలుమూలల నుంచి సుమారు 2.5 లక్షల మందికి పైగా ప్రజలు, 130 విదేశీ ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కాగా కొత్త పోప్ ఎన్నిక ప్రక్రియ మొదలైంది.
పూర్తి కథనం చదవండి09:40 AM (IST) Apr 27
సాధారణంగానే భారత్, పాకిస్థాన్‌ల మధ్య సంబంధాలు చాలా సున్నితంగా ఉంటాయనే విషయం తెలిసిందే. అందులోనూ పహల్గామ్ దాడి తర్వాత ఇది మరింత కాంప్లికేటెడ్‌గా మారాయి. ఇప్పటికే భారత్‌లో ఉన్న పాకిస్థానీ పౌరులు దేశాన్ని విడిచి వెళ్లాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ఓ సంఘటన అందరి దృష్టిని ఆకర్షించింది..
08:56 AM (IST) Apr 27
పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు మరణించిన తర్వాత, కశ్మీర్ 'కుందేలు అమ్మాయి' రుబీనా ధైర్యానికి ప్రతీకగా నిలిచింది. ఇప్పుడీ ఈ అమ్మాయి గురించే చర్చ నడుస్తోంది. ఇంతకీ ఎవరీ అమ్మాయి.? ఈమె ఏం చేసింది.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
పూర్తి కథనం చదవండి