పాక్ పౌరులు భారత్ ను వీడకుంటే ఏం జరుగుతుంది? వాళ్లను ఎలా గుర్తిస్తారు?
Consequences for Pakistani Citizens Not Leaving India: ఏప్రిల్ 22, పహల్గామ్… అమాయక పర్యాటకులపై జరిగిన దారుణ ఉగ్రదాడి యావత్ భారతావనిని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ చేసిన ఈ దాడిలో 28 మంది ప్రాణాలు కోల్పోయారు. మరీ ముఖ్యంగా మత గుర్తింపుతో పౌరుల ప్రాణాలు తీశారు. ఈ దాడి తర్వాత భారత ప్రభుత్వం ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపుతూ పాకిస్తాన్ విషయంలో కఠిన చర్యలు తీసుకుంటోంది.

What happens if Pakistani citizens do not leave India? How will they be identified?
Consequences for Pakistani Citizens Not Leaving India: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ జరిగిన దాడిలో పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో 28 మంది మరణించగా, చాలా మంది గాయపడ్డారు. ఈ దాడిలో లష్కరే తోయిబా ఉగ్రసంస్థ ప్రమేయం ఉన్నట్టు కేంద్ర నిఘా వర్గాలు స్పష్టం చేశాయి. దాడికి పాక్ నుంచి మద్దతు ఉన్నట్టు ఆధారాలు కూడా లభించాయి.
ఈ క్రమంలోనే దేశంలోని పాక్ పౌరులందరినీ వెనక్కి పంపించాలని రాష్ట్రాలకు కేంద్రహో శాఖ ఆదేశాలు జారీ చేసింది. అలాగే, అన్ని రాష్ట్రాల సీఎంలతో అమిత్ షా స్వయంగా మాట్లాడారు. వారి వివరాలు కేంద్రానికి అందించాలన్న డైరెక్టివ్‌తో పాటు, బహిష్కరణ ప్రక్రియ వేగంగా పూర్తిచేయాలన్న ఆదేశాలు ఇచ్చారు.
What happens if Pakistani citizens do not leave India? How will they be identified?
దీనిలో భాగంగా ఏప్రిల్ 27 నుండి పాక్ పౌరుల వీసాలన్నీ రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. అలాగే, వైద్య వీసాలతో ఉన్నవారికి ఏప్రిల్ 29 వరకే అనుమతి ఉంటుందని తెలిపింది. SAARC వీసా మినహాయింపుతో ఉన్నవారికి 48 గంటల గడువు ఉంచింది. ఈ లోపు పాక్ పౌరులందరూ భారత్ ను నుంచి వెంటనే వెళ్లిపోవాల్సిందేనని విదేశాంగ శాఖ కూడా స్పష్టం చేసింది.
పాక్ పౌరులు భారత్ ను వీడకుంటే ఏం జరుగుతుంది?
పాక్ పౌరులు విధించిన సమయంలోపు భారత్ ను వీడకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని మరోసారి హెచ్చరించింది. ఇచ్చిన సమయంలో దేశం వీడకుంటే పౌక్ పౌరులను జైలుకు పంపుతామని హెచ్చరించింది. ఏప్రిల్ 4న అమల్లోకి వచ్చిన ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారిన్ యాక్ట్ 2025 ప్రకారం.. ఇచ్చిన గడువు ముగిశాక భారత్ లో ఉన్న పాక్ పౌరులకు 3 ఏళ్ల జైలు శిక్షను విధిస్తారు లేదా 3 లక్షల జరిమానా విధిస్తారు. కొన్ని సందర్భాల్లో జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధిస్తారు. ప్రస్తుత భద్రతా కారణాలను చూస్తే మరింత కఠినంగా చర్యలు ఉండవచ్చు.
What happens if Pakistani citizens do not leave India? How will they be identified?
భారత్‌లో ఉన్న పాక్ పౌరులను ఎలా గుర్తిస్తారు?
భారత్‌లో నివసిస్తున్న పాకిస్తాన్ పౌరులను ప్రభుత్వ యంత్రాంగం ఎలా గుర్తిస్తుంది? వారిని ఎలా పర్యవేక్షిస్తారు? ఇది కేవలం ఒక సాధారణ ప్రశ్న కాదు… భద్రతకు సంబంధించి ఎంతో కీలకమైన అంశం.
పాకిస్తాన్ పౌరులు భారత్‌లోకి రావాలంటే తప్పనిసరిగా వీసా తీసుకోవాలి. వీసా వివరాలు భారత రాయబార కార్యాలయం, FRRO, హోం మంత్రిత్వ శాఖ వద్ద నమోదు అవుతాయి. దేశంలోకి వచ్చిన వెంటనే, వారి వివరాలు పోర్ట్ ఆఫ్ ఎంట్రీ వద్ద నమోదు చేస్తారు.
What happens if Pakistani citizens do not leave India? How will they be identified?
వారు భారత్ లోకి వచ్చిన తర్వాత 24 గంటల్లోపు FRRO లేదా FRO వద్ద తమ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. రెసిడెన్షియల్ పర్మిట్ కూడా జారీ అవుతుంది, ఇది వారి నివాసం, చిరునామాను అధికారికంగా ట్రాక్ చేస్తుంది. ఈ వివరాలు రాష్ట్ర ప్రభుత్వాల వద్ద కూడా ఉంటాయి. కాబట్టి పాక్ పౌరులను గుర్తించడంలో ఆయా రాష్ట్రాల పోలీసులు కూడా కీలక పాత్ర పోషిస్తారు. ఆ వివరాలను కేంద్ర ప్రభుత్వానికి కూడా రాష్ట్రప్రభుత్వాలు మళ్లీ పంపుతాయి.
What happens if Pakistani citizens do not leave India? How will they be identified?
అలాగే, IB, RAW వంటి భారత గూఢచార సంస్థలు ఎప్పటికప్పుడు పాక్ పౌరుల కదలికలను గమనిస్తాయి. అనుమానాస్పదంగా కనిపిస్తే, వారి పాస్‌పోర్ట్, హిస్టరీ ఆధారంగా విచారణ జరుపుతాయి.
వీసా గడువు ముగిసిన తర్వా దేశం విడిచిపెట్టని పాక్ పౌరులను గుర్తించడానికి పోలీసులు, ఇంటెలిజెన్స్ సంస్థలు లొకల్ ఇంటరాక్షన్ ద్వారా చెక్ చేస్తారు. ఈ వ్యక్తులను డిటెన్షన్ సెంటర్లకు పంపించడం లేదా డిపోర్ట్ చేస్తారు.