- Home
- National
- Hyderabad: హైదరాబాద్ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి.. పాకిస్థానీ కుర్రాడు ఏం చేశాడో తెలుసా.?
Hyderabad: హైదరాబాద్ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి.. పాకిస్థానీ కుర్రాడు ఏం చేశాడో తెలుసా.?
సాధారణంగానే భారత్, పాకిస్థాన్‌ల మధ్య సంబంధాలు చాలా సున్నితంగా ఉంటాయనే విషయం తెలిసిందే. అందులోనూ పహల్గామ్ దాడి తర్వాత ఇది మరింత కాంప్లికేటెడ్‌గా మారాయి. ఇప్పటికే భారత్‌లో ఉన్న పాకిస్థానీ పౌరులు దేశాన్ని విడిచి వెళ్లాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ఓ సంఘటన అందరి దృష్టిని ఆకర్షించింది..

పాకిస్థాన్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే అతను సరైన మార్గంలో భారత్‌లోకి రాలేదని, నేపాల్ నుంచి అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించినట్లు సమాచారం. హైదరాబాద్‌కు చెందిన ఓ యువతిని పెళ్లి చేసుకోవడానికి ఇలా వచ్చినట్లు తెలుస్తోంది.
వివరాల్లోకి వెళితే.. మొహమ్మద్ ఫయాజ్ అనే వ్యక్తి నిబంధనల ప్రకారం భారత్‌లోకి ప్రవేశించకుండా, పాకిస్తాన్ నుంచి నెపాల్ మీదుగా భారత్‌కు వచ్చాడు. హైదరాబాద్‌కు చేరి, అక్కడి యువతిని పెళ్లి చేసుకున్నాడు. అయితే అతడు తన విదేశీ పౌరసత్వాన్ని అధికారులకు తెలపకుండా ఇదంతా చేయడం నేరంగా మారింది.
వివరాలు తెలుసుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని, గత చరిత్ర, ప్రయాణ వివరాలు, వలస నిబంధనలు, పెళ్లి చట్టబద్ధత గురించి విచారిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఇలాంటి ఘటన జరగడం ఇదే తొలిసారి కాదు. 2022లో కూడా ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది.
అప్పట్లో మొహమ్మద్ ఫయిజ్ అనే పాకిస్తాన్ వ్యక్తి నేపాల్ మార్గంగా అక్రమంగా భారత్‌లోకి వచ్చి, హైదరాబాద్‌లో ఓ యువతిని పెళ్లి చేసుకుని, ఆమె కుటుంబ సహకారంతో ఆధార్ కార్డు పొందాడు. ఇది అప్పట్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే.