Fact: ప్రపంచంలో అత్యంత ఖరీదైన కండోమ్.. గొర్రె పేగుతో చేసే దీని ధర ఎంతంటే
సురక్షితమైన సంభోగం కోసం కండోమ్‌ను ఉపయోగిస్తారనే విషయం తెలిసిందే. కండోమ్‌కు ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంది. ఒకానొక సమయంలో ప్రభుత్వాలు సైతం కండోమ్‌ల వాడకం గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టారు. అయితే కండోమ్‌కు సంబంధించి మనకు తెలియని ఎన్నో ఆసక్తికర విషయాలు ఉన్నాయని మీకు తెలుసా.? అలాంటి ఒక ఇంట్రెస్టింగ్ అంశం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

అవాంఛిత గర్భధారణను నివారించడానికి వయోజన జంటలు కండోమ్‌లను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అలాగే సురక్షిత సంభోగానికి కూడా కండోమ్‌ను వాడుతుంటారు. మార్కెట్లో ఎన్నో రకాల కండోమ్స్ అందుబాటులో ఉన్నాయి. మారిన కాలంతో పాటు రకరకాల ఫ్లేవర్స్‌తో కూడిన కండోమ్స్ వస్తున్నాయి.
ఇక కండోమ్‌ల ధరలు వాటి నాణ్యత, ఫ్లేవర్ బట్టి మారుతుంటాయి. అయితే ప్రపంచంలో అత్యంత ఖరీదైన కండోమ్ ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా.? ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కండోమ్‌కు 200 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ కండోమ్‌ను గొర్రె పేగు నుంచి తయారు చేశారు. ఇటీవల స్పెయిన్‌లో జరిగిన వేలంలో ఇది దాదాపు రూ.44,000 కు అమ్ముడైంది.
అయితే, రూ.44 వేలకు అమ్ముడైన ఈ కండోమ్‌కు అసలు పేరే లేదు. 5 కండోమ్ కొనుగోలు చేసిన డబ్బులతో దుబాయ్‌లోని ఫైవ్ స్టార్ అర్మానీ హోటల్‌లో ఐదు రాత్రులు బస చేయవచ్చు. దుబాయ్‌లోని ఫైవ్ స్టార్ అర్మానీ హోటల్‌లో ఒక రాత్రి బస ప్రారంభ ధర దాదాపు రూ.38,000 నుంచి రూ.40,000 వరకు ఉంటుంది.
ఇంతటి చరిత్ర ఉన్న ఈ కండోమ్‌ను ఫ్రాన్స్‌లో గుర్తించారు. తరువాత దానిని వేలం వేశారు. దాని పొడవు 19 సెం.మీ అంటే 7 అంగుళాలు. దీనిని ఆమ్స్టర్డామ్‌కు చెందిన ఓ వ్యక్తి వేలంలో కొనుగోలు చేశాడు. ఈ కండోమ్‌ను చేతితోనే తయారు చేశారు. 18వ శతాబ్దంలో ఇలాంటి కండోమ్‌లను గొర్రెలు, పందులు, దూడలుచ, మేకల పేగుల నుంచి తయారు చేసేవారు.
ప్రస్తుతం అత్యంత ఖరీదైన కండోమ్ ఏది?
ప్రస్తుతం విషయానికొస్తే.. మార్కెట్లో అందుబాటులో ఉన్న అత్యంత ఖరీదైన కండోమ్ SKYN సుప్రీం ఫీల్ కండోమ్స్. ఈ కంపెనీకి చెందిన 10 కండోమ్‌లను కొనుగోలు చేయాలంటే 100 డాలర్లు చెల్లించాలి. మన కరెన్సీలో చెప్పాలంటే ఒక్క కండోమ్ ప్యాకెట్ ధర ఏకంగా రూ. 8,500.