Pahalgam Attack: భారత ఆర్మీ దెబ్బకు.. నేలమట్టమవుతోన్న ఉగ్రవాదుల ఇళ్లు
పహల్గాం దాడి తర్వాత జమ్మూ కశ్మీర్‌లో లష్కరే తోయిబా, జైషే మహ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థలకు చెందిన 14 మంది ఉగ్రవాదుల ఇళ్లను అధికారులు కూల్చివేశారు.

జమ్మూ కాశ్మీర్‌లో 14 మంది ఉగ్రవాదుల ఇళ్ళు కూల్చివేత
ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం దాడి తర్వాత భద్రతా దళాలు వివిధ ఉగ్రవాద సంస్థలకు చెందిన 14 మంది ఉగ్రవాదుల ఇళ్లను కూల్చివేశాయి. ఈ చర్యలు లష్కరే తోయిబా (LeT), జైషే మహ్మద్ (JeM), హిజ్బుల్ ముజాహిదీన్ సభ్యులను లక్ష్యంగా చేసుకుని ఈ ప్రాంతంలో ఉగ్రవాద వ్యవస్థను నిర్మూలించేందుకు ఇండియన్ ఆర్మీ చర్యలు చేపట్టింది. ఆ 14 మంది ఉగ్రవాదుల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
1. ఆదిల్ రెహమాన్ డెంటూ (21)
సోపోర్‌లోని లష్కరే తోయిబా జిల్లా కమాండర్ అయిన డెంటూ 2021లో నిషేధిత ఉగ్రవాద సంస్థలో చేరాడు. అతను ఈ ప్రాంతంలో అనేక ఉగ్రవాద కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొన్నాడు.
2. ఆసిఫ్ అహ్మద్ షేక్ (28)
అవంతిపోరాలోని జైషే మహ్మద్ జిల్లా కమాండర్ అయిన షేక్ 2022 నుండి నిరంతర ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొంటున్నాడు.
3. అహ్సాన్ అహ్మద్ షేక్ (23)
పుల్వామాలోని లష్కరే తోయిబా చురుకైన సభ్యుడు అయిన షేక్ 2023 నుండి ఉగ్రవాద కార్యకలాపాల్లో నిరంతరం పాల్గొంటున్నాడు.
4. హారిస్ నజీర్ (20)
2023 నుంచి లష్కరే తోయిబాలో చురుకుగా ఉన్న నజీర్ పుల్వామాకు చెందిన మరో కీలక ఉగ్రవాది. తాజాగా ఇండియన్ ఆర్మీ హారిస్ నజీర్ ఇంటిని ధ్వంసం చేశారు.
5. ఆమిర్ నజీర్ వాని (20)
జైషే మహ్మద్ సభ్యుడైన వాని పుల్వామాలో చురుకైన ఉగ్రవాది, 2024లో ఈ గ్రూపులో చేరాడు. ఈ క్రమంలోనే తాజాగా ఆర్మీ అధికారులు వాని ఇంటిని ధ్వంసం చేశాడు.
6. యావర్ అహ్మద్ భట్
2024 నుండి జైషే మహ్మద్‌తో సంబంధం ఉన్న భట్, పుల్వామా నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న మరో చురుకైన ఉగ్రవాది.
7. ఆసిఫ్ అహ్మద్ ఖండే (24)
షోపియాన్‌కు చెందిన ఉగ్రవాది ఖండే జూలై 2015లో హిజ్బుల్ ముజాహిదీన్‌లో చేరాడు. అతను పాకిస్థానీ ఉగ్రవాదులకు, ముఖ్యంగా ఈ ప్రాంతంలో దాడులు చేయడంలో సహాయం చేస్తున్నాడు.
8. నసీర్ అహ్మద్ వాని (21)
షోపియాన్‌కు చెందిన లష్కరే తోయిబాకు సంబంధించిన మరో సభ్యుడు వాని 2019 నుండి ఉగ్రవాద కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటున్నాడు.
9. షాహిద్ అహ్మద్ కుటే (27)
2023 నుండి షోపియాన్‌లో చురుకుగా ఉన్న కుటే లష్కరే తోయిబా. దాని ప్రాక్సీ గ్రూప్ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) తో సంబంధం కలిగి ఉన్నాడు.
10. ఆమిర్ అహ్మద్ దార్
షోపియాన్‌లో కీలక వ్యక్తి అయిన దార్ 2023 నుండి లష్కరే తోయిబాతో చురుకుగా ఉన్నాడు. పలు ఉగ్ర కార్యకలపాల్లో పాల్గొన్నాడు.
11. అద్నాన్ సఫి దార్
షోపియాన్‌కు చెందిన మరో ఉగ్రవాది దార్ 2024 నుంచి లష్కరే తోయిబాతో పాటు TRF కోసం పనిచేస్తున్నాడు.ఈ క్రమంలో పలు దాడుల్లో పాల్గొన్నాడు.
12. జుబైర్ అహ్మద్ వాని (39)
అబు ఉబైదా, ఉస్మాన్ అనే మారుపేర్లతో ఉన్న అహ్మద్ వాని అనంతనాగ్‌లోని హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ ఆపరేషనల్ కమాండర్.
13. హరూన్ రషీద్ గనై (32)
అనంతనాగ్‌కు చెందిన చురుకైన హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది గనై 2018లో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లో ఉగ్రవాద శిక్షణ పొందాడు.
14. జాకీర్ అహ్మద్ గనీ (29)
కుల్గాంలో కీలక వ్యక్తి అయిన గనీ లష్కరే తోయిబాతో సంబంధం కలిగి ఉన్నాడు. తాజాగా ఈ ఉగ్రవాది ఇంటిని ఆర్మీ అధికారులు నేలమట్టం చేశారు.