తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తో పాటు జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు,, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలతో పాటు ఈరోజు జరిగే లేటెస్ట్ లైవ్ న్యూస్ అప్డేట్స్ అన్ని ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి.

11:13 PM (IST) Jun 06
Recruitment: మీకు స్పేస్ సెంటర్ లో ఉద్యోగం చేయాలనుందా? అయితే రూ.1.4 లక్షల వరకు జీతం లభించే పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఉద్యోగాలు ఎక్కడ? ఎన్ని పోస్టులున్నాయి? అర్హతలు, అప్లై చేసే విధానాల గురించి వివరంగా ఇక్కడ తెలుసుకోండి.
11:11 PM (IST) Jun 06
ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం తర్వాత వేడుకల్లో జరిగిన తొక్కిసలాటలో 11 మంది మరణించిన విషయం తెలిసిందే. అయితే దీనిపై ఇప్పుడు ఎక్స్ వేదికగా ఓ హ్యాష్ ట్యాగ్ తెగ ట్రెండ్ అవుతోంది.
10:48 PM (IST) Jun 06
ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి పాక్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. పహల్గామ్ దాడి తర్వాత తొలిసారి కశ్మీర్‌లో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు.
10:18 PM (IST) Jun 06
బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి విడుదల చేసిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య ఉన్న సరిహద్దు వివాదాలను ఆయన కళ్లకు కట్టినట్లు చూపించారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే..
09:46 PM (IST) Jun 06
మంచి ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌లో పెట్టుబడి పెట్టాలని మీరు ప్లాన్ చేస్తున్నారా? మార్కెట్ రిస్క్‌లు లేకుండా, ప్రభుత్వ భద్రతతో, పన్ను మినహాయింపుతో మంచి రాబడినిచ్చే పథకం గురించి మీరు తెలుసుకోవాలి. అదే నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్(NSC) మీరు బెస్ట్ ఆప్షన్.
09:08 PM (IST) Jun 06
అరుదైన వస్తువులకు ఉండే డిమాండ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలిచే వస్తువులను వేలంలో కోట్లు పెట్టి కొనుగోలు చేస్తుంటారు. అయితే కండోమ్‌కు కూడా అలాంటి క్రేజ్ ఉందంటే నమ్ముతారా.?
09:00 PM (IST) Jun 06
వాట్సాప్‌లో ఆఫీస్, బిజినెస్ మెసేజ్‌లు, చాట్స్ తప్ప ఫ్రెండ్స్ ఎవరూ మాట్లాడటం లేదు కదా.. అందుకే వినియోగదారుల కోసం వాట్సాప్ లో AI ఫ్రెండ్ వచ్చేస్తున్నాడు. ఈ కొత్త ఫీచర్ గురించి ఇంట్రెస్టింగ్ విశేషాలు తెలుసుకుందాం రండి.
08:41 PM (IST) Jun 06
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కెనడా ప్రధాని మార్క్ కార్నీ నుంచి జి7 (G7) శిఖరాగ్ర సమావేశానికి ఆహ్వానం అందుకున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని మోదీ తన ఎక్స్ అకౌంట్ ద్వారా తెలియజేశారు.
08:24 PM (IST) Jun 06
సమ్మర్ హాలిడేస్ కదా అని పిల్లలు ఎప్పుడు చూసినా సెల్ ఫోన్లు పట్టుకొనే ఉంటున్నారు. చాలా మంది తల్లిదండ్రులు కూడా తమ పనులకు ఆటంకం కాకుండా ఉంటుందని పిల్లలను పట్టించుకోవడం లేదు. ఎక్కువ సేపు ఫోన్లు వాడితే వచ్చే ప్రమాదాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
08:11 PM (IST) Jun 06
ఇప్పటికే ఫార్ములా వన్ కేసు, కవిత ఎపిసోడ్‌తో ఇబ్బందులు పడుతోన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మరో సమస్య వచ్చింది. సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ఇంతకీ సుప్రీం నోటీసులు జారీ చేయడానికి అసలు కారణం ఏంటంటే..
07:17 PM (IST) Jun 06
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌ల మధ్య వ్యవహారం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఒకప్పుడు స్నేహితులుగా ఉన్న వీరిద్దరూ ఇప్పుడు బద్ధ శత్రువులుగా మారడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
06:36 PM (IST) Jun 06
కశ్మీర్ నుంచి కన్యాకుమారికి రైలు మార్గం కల నిజమైందని ప్రధాని మోడీ చెప్పారు. చీనాబ్ రైల్వే వంతెనను ప్రారంభించిన ఆయన, దీన్ని భారతదేశ ఐక్యత, సంకల్పానికి గొప్ప ఉత్సవంగా అభివర్ణించారు.
05:28 PM (IST) Jun 06
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఎప్పటి నుంచో చేస్తున్న ప్రయత్నాలు ఓ కొలిక్కి వస్తున్నాయి. భారత్‌లో స్టార్ లింక్ ఇంటర్నెట్ సేవలను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్న మస్క్‌కు ఎట్టకేలకు అనుమతులు లభించాయి.
04:11 PM (IST) Jun 06
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే కాళేశ్వరం కమిషన్ ఎదుట మాజీ మంత్రి ఈటల రాజేందర్ హాజరయ్యారు.
04:06 PM (IST) Jun 06
బెంగళూరులో ఆర్‌సీబీ గెలుపు సంబరాలు విషాదం నింపాయి. భారీ ర్యాలీలో తొక్కిసలాటలో జరిగి 11 మంది మృతి చెందగా 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనలో మొదటి అరెస్ట్ జరిగింది. నిఖిల్ సోసలే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
03:04 PM (IST) Jun 06
02:04 PM (IST) Jun 06
తాను దొంగతనానికి పాల్పడలేదని, భారత్‌కు తిరిగి రావాలన్న ఉద్దేశం ఉందని విజయ్ మాల్యా తాజా వ్యాఖ్యలు చేశారు.
01:23 PM (IST) Jun 06
జమ్మూ కాశ్మీర్‌లో నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చీనాబ్ రైల్వే వంతెనను ప్రధాని మోడీ ప్రారంభించారు. అలాగే రెండు వందే భారత్ రైళ్లను కూడా ఆయన ప్రారంభించారు.
01:02 PM (IST) Jun 06
షాంఘై ఫోరంలో భారత అభివృద్ధి, పెట్టుబడి అవకాశాలపై ప్రతీక్ మాథుర్ ప్రసంగించారు. భారత్‌ను మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దే లక్ష్యంగా ముందుకు దూసుకుపోతున్నట్లు పేర్కొన్నారు.
12:45 PM (IST) Jun 06
తల్లికి వందనం పథకం ద్వారా ఏపీ ప్రభుత్వం విద్యార్థుల తల్లులకు ప్రతి సంవత్సరం రూ.15,000 ఇవ్వనుంది. అర్హతలు, డాక్యుమెంట్ల వివరాలు తెలియజేశారు.
12:15 PM (IST) Jun 06
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. యాక్టివ్ కేసులు 5,364కు చేరగా, మరణాల సంఖ్య 55కి పెరిగింది.
11:54 AM (IST) Jun 06
RBI MPC Meeting: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును 0.50% తగ్గించి 5.50%గా నిర్ణయించింది. దీనివల్ల సామాన్య ప్రజలకు కలిగే ప్రయోజనం ఏంటో ఇక్కడ తెలసుకుందాం.
10:45 AM (IST) Jun 06
మీరు మంచి సెల్ ఫోన్ కొనుక్కొనే ధరకు చక్కటి ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుక్కోవచ్చు. నమ్మశక్యంగా లేదా? ఈ స్కూటర్ల ధరలు తెలిస్తే మీరు కూడా ఒప్పుకుంటారు. తక్కువ ధరలో, బెస్ట్ ఫీచర్స్ కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్లు, వాటి ధరల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
10:35 AM (IST) Jun 06
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రముఖ వ్యాపారి ఎలాన్ మస్క్ మధ్య వివాదం మరింత ముదురుతోంది. తాజాగా మస్క్ ఎక్స్ వేదికన సంచలన ప్రకటన చేసారు.
10:16 AM (IST) Jun 06
9-10వ శతాబ్దాల్లో తూర్పు చాళుక్యుల పాలనలోని ఏలూరు-పిఠాపురం ప్రాంతానికి చెందిన రాగి శాసనాలు జర్మనీలో బయటపడ్డాయి. వీటిలో ఆ కాలంనాటి పాలనా వ్యవహారాలకు సంబంధించిన కీలక సమాచారం ఉన్నట్లు భారత పురావస్తు శాఖ గుర్తించింది.
09:54 AM (IST) Jun 06
తయారీ వ్యయాల్లో చైనాను వెనక్కినెట్టి, అత్యంత ఖర్చుతో కూడిన మాన్యుఫ్యాక్చరింగ్ కేంద్రంగా భారత్ ప్రథమ స్థానానికి ఎదిగింది.
09:37 AM (IST) Jun 06
Redmi: ప్యాడ్ ఒకటి చేతిలో ఉంటే చిన్నసైజ్ కంప్యూటర్ ఉన్నట్టే. ఆఫీస్ అవసరాల కోసం ప్యాడ్ ఎంతో ఉపయోగపడుతుంది. వినియోగదారుల కోసం రెడ్‌మీ ప్యాడ్ 2 ను ఇండియాలో లాంచ్ చేయనుంది. దీని ఫీచర్స్, రిలీజ్ డేట్, ధర గురించి తెలుసుకుందామా?
08:49 AM (IST) Jun 06
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని అర్హత కలిగిన రైతులకు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రూ.20000 నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి జమ చేస్తోంది.
08:46 AM (IST) Jun 06
ప్రస్తుతం వర్షాలు కురవక కంగారుపడుతున్న తెలుగు రైతులకు వాతావరణ విభాగం గుడ్ న్యూస్ తెలిపింది. మరో నాలుగైదు రోజుల్లో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో తిరిగి వర్షాలు ప్రారంభం అవుతాయని తెలిపారు.
08:27 AM (IST) Jun 06
తెలంగాణలో స్వయం సహాయక బృంద సభ్యుల ప్రమాద మరణాలపై ప్రభుత్వమే నేరుగా రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించనుంది. ఇప్పటికే 385 కుటుంబాలకు రూ.38.5 కోట్లు మంజూరు అయ్యాయి.
08:13 AM (IST) Jun 06
స్టార్ హీరోల వరసులు ఇండస్ట్రీకి వచ్చి హీరోలుగాసెటిల్ అవుతున్నారు. కొంత మంది తండ్రిని మించిన తనయుడు అనిపించుకుంటున్నారు.ఓ యంగ్ హీరో మాత్రం వేల కోట్ల ఆస్తులు పక్కన పెట్టి కూలి పనులు చేసుకుంటున్నాడు. పశువులు కాస్తున్నాడు. ఇంతకీ ఎవరా హీరో?
07:27 AM (IST) Jun 06
బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌కు గుండెపోటు రావడంతో వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతోంది. పరిస్థితి విషమం. పార్టీలో ఆందోళన నెలకొంది.