- Home
- International
- Viral News: 200 ఏళ్ల క్రితం కండోమ్ ఎలా ఉండేదో తెలుసా? ఇప్పుడు దాని ధర రూ. 98 లక్షలు
Viral News: 200 ఏళ్ల క్రితం కండోమ్ ఎలా ఉండేదో తెలుసా? ఇప్పుడు దాని ధర రూ. 98 లక్షలు
అరుదైన వస్తువులకు ఉండే డిమాండ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలిచే వస్తువులను వేలంలో కోట్లు పెట్టి కొనుగోలు చేస్తుంటారు. అయితే కండోమ్‌కు కూడా అలాంటి క్రేజ్ ఉందంటే నమ్ముతారా.?

చరిత్రలో నిలిచిన ప్రత్యేక కండోమ్
ప్రపంచంలో ఎన్నో విభిన్న రకాల పురాతన వస్తువులున్నాయి. కానీ తాజాగా వార్తల్లోకి వచ్చిన ఒక ప్రత్యేకమైన కండోమ్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దాదాపు 200 సంవత్సరాల క్రితం తయారైన కండోమ్ ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఈ కండోమ్‌ను ఒక విలువైన ప్రదర్శన వస్తువుగా మ్యూజియంలో ప్రదర్శిస్తున్నారు.
ఎక్కడ ఉంది.?
ఈ అద్భుతమైన కండోమ్ నెదర్లాండ్స్‌లోని ప్రముఖ మ్యూజియం ఆమ్‌స్టర్‌డామ్ రిజ్క్స్‌మ్యూజియంలో (Rijksmuseum) సందర్శనకు ఉంచారు. వేలాదిమంది సందర్శకులు దీనిని చూడటానికి అక్కడికి వస్తున్నారు. 1830లో దీనిని తయారు చేసినట్లు మ్యూజియం వర్గాలు వెల్లడించాయి.
గొర్రె పేగుతో తయారీ
ఈ కండోమ్ తయారీకి గొర్రె పేగులు ఉపయోగించారు. అప్పట్లో రబ్బరు అందుబాటులో లేకపోవడం వల్ల, జంతు అవయవాలు ఉపయోగించి కండోమ్స్‌ను ఉపయోగించారు. ఇలాంటి పురాతన కండోమ్‌లు ప్రస్తుతం ప్రపంచంలో కేవలం రెండు మాత్రమే ఉన్నాయి.
చిత్రకళ
అయితే ఈ కండోమ్‌లో మరో ప్రత్యేకత ఉంది. దీనిపై చిత్రకళ కూడా ప్రతిబింబిస్తుంది. ఈ ఫొటోలో కొంత మంది వ్యక్తులు ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ కండోమ్ ఒక అపురూప వస్తువుగా మారడానికి ఈ చిత్రం కూడా ఒక కారణమని చెప్పాలి.
ధర ఎంతో తెలుసా.?
ఈ కండోమ్ ధర రూ.98 లక్షలు. వేలం పాటలో ఈ మ్యూజియం వాళ్లు దీనిని సొంతం చేసుకున్నారు. అయితే, ఇది నవంబర్ 2025 వరకు మాత్రమే ప్రదర్శనలో ఉంటుంది. దీన్ని ప్రత్యక్షంగా చూడాలనుకునే వారు వెంటనే ఆమ్సర్డమ్ వెళ్లాల్సిందే.
A 200-year-old condom is on display at an Amsterdam museum. The item was manufactured in 1830. The exhibit is almost unique — there are only 2 of them in the world now. pic.twitter.com/cZarxSWAR1
— Тимур Коваленко (@BRAINSMUR) June 4, 2025