కశ్మీర్ నుంచి కన్యాకుమారికి రైలు మార్గం కల నిజమైందని ప్రధాని మోడీ చెప్పారు. చీనాబ్ రైల్వే వంతెనను ప్రారంభించిన ఆయన, దీన్ని భారతదేశ ఐక్యత, సంకల్పానికి గొప్ప ఉత్సవంగా అభివర్ణించారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం 'కశ్మీర్ నుంచి కన్యాకుమారికి' రైలు మార్గం కల నిజమైందని అన్నారు. ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే ఆర్చ్ వంతెన అయిన చీనాబ్ రైల్వే వంతెనను ప్రారంభించిన ప్రధాని మోదీ, ఈ క్షణాన్ని భారతదేశ ఐక్యత, సంకల్పానికి గొప్ప ఉత్సవంగా అభివర్ణించారు.

 

Scroll to load tweet…

 

ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. “మాతా వైష్ణోదేవి ఆశీస్సులతో, నేడు కశ్మీర్ లోయ భారతదేశ రైలు నెట్‌వర్క్‌కి అనుసంధానమమైంది” అని ప్రధాని మోదీ అన్నారు. “కశ్మీర్ నుంచి కన్యాకుమారికి. ఇప్పుడు రైల్వే నెట్‌వర్క్‌కి కూడా ఇది నిజమైంది.” అని అన్నారు. 

చినాబ్, అంజి వంతెనల నిర్మాణంలో పనిచేసిన ఇంజనీర్లను ప్రధాని మోడీ ప్రశంసించారు. “చినాబ్, అంజి వంతెనలపై నేడు నడుస్తున్నప్పుడు, నేను భారతదేశ ఇంజనీర్లు, కార్మికుల నైపుణ్యం, ధైర్యాన్ని చూశాను.” అని చెప్పుకొచ్చారు. 

Scroll to load tweet…

 

వంతెనపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన మోదీ

చినాబ్ వంతెనపై ప్రధాని మోదీ జాతీయ జెండాను ఎగురవేశారు. శ్రీ మాతా వైష్ణోదేవి కాట్రా నుంచి శ్రీనగర్ వరకు, తిరిగి వచ్చే రెండు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు కూడా ఆయన జెండా ఊపారు. దీంతో కశ్మీర్ లోయ మొదటిసారిగా భారతదేశ హై-స్పీడ్ రైలు నెట్‌వర్క్‌కి అనుసంధానమైంది. 

వేగవంతమైన, ఆధునిక రైళ్లు ప్రయాణ సమయాన్ని తగ్గిస్తాయని, కశ్మీర్, జమ్మూలకు పర్యాటకం, యాత్రికుల ప్రయాణాన్ని పెంచుతాయని భావిస్తున్నారు.

ఐఫిల్ టవర్ కంటే ఎత్తైంది 

చినాబ్ రైల్వే వంతెన నది మట్టం నుంచి 359 మీటర్ల ఎత్తులో ఉంది, ఐఫిల్ టవర్ కంటే ఎత్తైంది. రియాసి జిల్లాలో చినాబ్ నదిపై నిర్మించిన 1,315 మీటర్ల పొడవైన స్టీల్ ఆర్చ్ వంతెన ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే ఆర్చ్ వంతెనగా పేరు గాాంచింది. 

ఇది ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్ లింక్ (USBRL) ప్రాజెక్ట్‌లో భాగం - భారతదేశంలో అత్యంత కష్టతరమైన ప్రదేశాలలో నిర్మించిన ఇంజనీరింగ్ అద్భుతంగా పేరుగాంచింది. 

కాగా ప్రధాని మోడీ భారతదేశపు మొట్టమొదటి కేబుల్-స్టేడ్ రైల్వే వంతెన అయిన అంజి వంతెనను కూడా ప్రారంభించారు. దీంతో మొత్తం 272 కి.మీ USBRL ప్రాజెక్ట్‌ను దేశానికి అంకితం చేశారు. చరిత్రలో మొదటిసారిగా కశ్మీర్ లోయకు అన్ని వాతావరణాల్లోనూ అతుకులు లేని రైలు అనుసంధానాన్ని ఈ ప్రాజెక్ట్ అందిస్తుంది.

ప్రాజెక్ట్ లో భాగమైన ఇంజనీర్లు, కార్మికులతో ప్రధాని మోదీ సంభాషించారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత ప్రధాని కశ్మీర్ కు రావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. USBRL ప్రాజెక్ట్ పూర్తి కావడాన్ని “అభివృద్ధి, ఏకీకరణ, జాతీయ ఐక్యతకు చారిత్రాత్మక దినం” అని మోదీ అభివర్ణించారు. .