MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Business
  • NSC: పెట్టుబడి రూ.5 లక్షలు.. ఆదాయం రూ.7.24 లక్షలు: రిస్క్ లేని ఆ స్కీమ్ ఏంటో తెలుసా?

NSC: పెట్టుబడి రూ.5 లక్షలు.. ఆదాయం రూ.7.24 లక్షలు: రిస్క్ లేని ఆ స్కీమ్ ఏంటో తెలుసా?

మంచి ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌లో పెట్టుబడి పెట్టాలని మీరు ప్లాన్ చేస్తున్నారా? మార్కెట్ రిస్క్‌లు లేకుండా, ప్రభుత్వ భద్రతతో, పన్ను మినహాయింపుతో మంచి రాబడినిచ్చే పథకం గురించి మీరు తెలుసుకోవాలి. అదే నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్(NSC) మీరు బెస్ట్ ఆప్షన్. 

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : Jun 06 2025, 09:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీమ్
Image Credit : social media

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీమ్

రిస్క్ లేనివి, నమ్మకమైనవి పోస్ట్ ఆఫీస్ పొదుపు పథకాలు. ముఖ్యంగా నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (NSC) తక్కువ రిస్క్‌తో అధిక రాబడినిచ్చే పెట్టుబడి పథకం. దీన్ని మీరు ఏ బ్యాంకులోనైనా, పోస్ట్ ఆఫీసులోనైనా సులభంగా ప్రారంభించవచ్చు. చిన్న, మధ్యతరగతి పెట్టుబడిదారులకు ఇది చక్కని అవకాశం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
దీనికి పన్ను మినహాయింపు కూడా ఉంది..
Image Credit : Gemini

దీనికి పన్ను మినహాయింపు కూడా ఉంది..

NSCకి ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. PPF, పోస్ట్ ఆఫీస్ దీర్ఘకాలిక డిపాజిట్ల మాదిరిగానే NSC కూడా హామీ ఇచ్చిన వడ్డీ, పూర్తి మూలధన రక్షణను అందిస్తుంది. అయితే టాక్స్ సేవింగ్ మ్యూచువల్ ఫండ్స్, NPS వంటి పథకాల్లా ద్రవ్యోల్బణాన్ని మించిన రాబడిని మాత్రం అందించలేదు. సురక్షితమైన పెట్టుబడికి మాత్రం ఇదే అనువైనది.

36
రూ.1,000 పెట్టుబడితో ఈ స్కీమ్ లో చేరొచ్చు
Image Credit : social media

రూ.1,000 పెట్టుబడితో ఈ స్కీమ్ లో చేరొచ్చు

మీరు కనీసం రూ.1,000 పెట్టుబడితో ఈ పథకంలో చేరవచ్చు. బ్యాంకులు, NBFCల నుండి రుణాలు పొందడానికి హామీగా NSC సర్టిఫికెట్లను ఉపయోగించవచ్చు. ఈ పథకం చక్రవడ్డీ ప్రాతిపదికన పనిచేస్తుంది. అందువల్ల సంపాదించిన వడ్డీని ప్రతి సంవత్సరం తిరిగి పెట్టుబడిగా పెట్టొచ్చు. ఆ మొత్తాన్ని మెచ్యూరిటీ సమయంలో తిరిగి చెల్లిస్తారు. NSCపై TDS లేదు కాబట్టి పెట్టుబడిదారుడు తన ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేసేటప్పుడు వర్తించే పన్ను చెల్లించాలి.

46
వడ్డీ రేటు సంవత్సరానికి 7.7%
Image Credit : Google

వడ్డీ రేటు సంవత్సరానికి 7.7%

NSC ప్రస్తుత ఆర్థిక వివరాలు ఎలా ఉన్నాయంటే.. వడ్డీ రేటు సంవత్సరానికి 7.7% లభిస్తుంది. ఈ స్కీమ్ మెచ్యూరిటీ 5 సంవత్సరాలు. ఇందులో మీరు రూ.1.5 లక్షల వరకు పెట్టుబడి పెడితే 80C కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. మీరు కావాలంటే NSCని బ్యాంకులో తనఖా పెట్టి డబ్బు తీసుకోవచ్చు.

56
రూ.5 లక్షలు పెట్టుబడి పెడితే ఏం జరుగుతుంది?
Image Credit : Google

రూ.5 లక్షలు పెట్టుబడి పెడితే ఏం జరుగుతుంది?

NSCలో రూ.5 లక్షలు పెట్టుబడి పెడితే వార్షిక వడ్డీ రేటు 7.7% లభిస్తుంది. సంవత్సరానికి ఒకసారి వడ్డీ చెల్లిస్తారు. దాన్ని తిరిగి పెట్టుబడిగా పెట్టాలి. ఇలా 5 సంవత్సరాలు పెడితే ఆ తర్వాత మొత్తం రూ.7,24,513 లభిస్తుంది. అంటే లాభం రూ.2,24,513 అన్న మాట. 

66
NSCని ఎంచుకోవడానికి ప్రధాన కారణాలు
Image Credit : iSTOCK

NSCని ఎంచుకోవడానికి ప్రధాన కారణాలు

ప్రభుత్వం నుండి పూర్తి ఆర్థిక భద్రత లభిస్తుంది. మార్కెట్ రిస్క్ ఉండదు. షేర్ మార్కెట్ హెచ్చుతగ్గులు, నష్టాలు NSCలో ఉండవు. పన్ను మినహాయింపు 80C కింద రూ.1.5 లక్షల వరకు పన్ను ఆదా చేయవచ్చు. కొత్త పెట్టుబడిదారులైతే కనీసం రూ.1,000తో NSC ప్రారంభించవచ్చు. వీటిని బ్యాంకుల్లో తనఖా పెట్టి డబ్బు కూడా తీసుకోవచ్చు.

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
వ్యాపారం
ప్రభుత్వ పథకాలు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Low Investment Business: ఇంటి నుంచే సంపాదించాలనుకుంటున్నారా? 7 హోం బిజినెస్ ఐడియాస్
Recommended image2
Best Selfie Phones: రూ.20 వేల బడ్జెట్‌లో వచ్చే బెస్ట్ సెల్ఫీ ఫోన్ల జాబితా ఇదిగో
Recommended image3
Worlds Oldest Bank: వరల్డ్స్ ఓల్డెస్ట్ బ్యాంక్.. ప్రపంచ యుద్ధాలను సైతం తట్టుకుని ఎలా నిలబడింది?
Related Stories
Recommended image1
SIP vs Government Schemes: రిటైర్మెంట్ డబ్బును ఈ స్కీమ్స్ లో పెట్టుబడిగా పెడితే డబ్బే డబ్బు
Recommended image2
Government Schemes పెట్టుబడికి ఇవే టాప్ ప్రభుత్వ పథకాలు.. ఇంతకు మించి వడ్డీ మరెక్కడా దొరకదు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved