- Home
- Andhra Pradesh
- Annadhata Sukhibhava: అన్నదాత సుఖీభవ పథకానికి అప్లై చేసుకున్నారా..ఖాతాల్లోకి నేరుగా రూ.20000
Annadhata Sukhibhava: అన్నదాత సుఖీభవ పథకానికి అప్లై చేసుకున్నారా..ఖాతాల్లోకి నేరుగా రూ.20000
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని అర్హత కలిగిన రైతులకు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రూ.20000 నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి జమ చేస్తోంది.

అన్నదాత సుఖీభవ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని అర్హత కలిగిన రైతులకు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రూ.20000 నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి జమ చేస్తోంది. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డీబీటీ) విధానంలో ఈ మొత్తం మూడువిడతలుగా అందించనుంది.
పీఎం కిసాన్ యోజన
ఈ మొత్తం రూ.20000లో భాగంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ యోజన కింద అందే రూ.6000 కూడా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రూ.14000 జమ చేస్తుంది.
'Know Your Status'
రైతులు తమ సాయం వచ్చిందా లేదా అన్నది తెలుసుకోవాలంటే, అధికారిక వెబ్‌సైట్ అయిన https://annadathasukhibhava.ap.gov.inలోకి వెళ్లాలి. అక్కడ 'Know Your Status' అనే విభాగాన్ని సెలెక్ట్ చేసి, ఆధార్ నంబర్ లేదా రిజిస్ట్రేషన్ నంబర్ నమోదు చేయాలి. ఆ తర్వాత మొబైల్ నంబర్‌తో పాటు క్యాప్చా కోడ్ ఇచ్చి, స్క్రీన్‌పై తమ స్థితిని తెలుసుకోవచ్చు
ఇంటికి ఒక్కరికి మాత్రమే
ఈ పథకానికి దరఖాస్తు చేసినవారికి ఏవైనా సందేహాలు ఉంటే 8004255032 అనే టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ చేయవచ్చు.ఈ పథకం ఇంటికి ఒక్కరికి మాత్రమే వర్తిస్తుంది. వ్యవసాయం, ఉద్యానవనం, పట్టు పరిశ్రమలపై ఆధారపడిన రైతులు మాత్రమే అర్హులు. వారివద్ద భూ రికార్డులు ఖచ్చితంగా ఉండాలి.
నేరుగా బ్యాంక్ ఖాతాకు
ఈ పథకం రైతుల నేరుగా బ్యాంక్ ఖాతాకు డబ్బులు చేరే విధంగా రూపొందించడం జరిగింది. మధ్యవర్తుల అవసరం లేకుండా, పూర్తి పారదర్శకతతో ప్రభుత్వం అమలు చేస్తోంది.