Redmi: ప్యాడ్ ఒకటి చేతిలో ఉంటే చిన్నసైజ్ కంప్యూటర్ ఉన్నట్టే. ఆఫీస్ అవసరాల కోసం ప్యాడ్ ఎంతో ఉపయోగపడుతుంది. వినియోగదారుల కోసం రెడ్‌మీ ప్యాడ్ 2 ను ఇండియాలో లాంచ్ చేయనుంది. దీని ఫీచర్స్, రిలీజ్ డేట్, ధర గురించి తెలుసుకుందామా?
షావోమి కంపెనీ తన రెడ్‌మీ ప్యాడ్ 1ను అప్ గ్రేడ్ చేసి ప్యాడ్ 2ను మార్కెట్ లోకి రిలీజ్ చేసింది. ఇది ఇండియాలో జూన్ 18న లాంచ్ అవుతోంది! 2.5K డిస్‌ప్లే, హీలియో G100 అల్ట్రా చిప్‌సెట్, 9000mAh బ్యాటరీ, డాల్బీ అట్మాస్ తదితర అద్భుతమైన ఫీచర్లు కలిగి ఉంది. దీని ధర, మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి.
ఫిలిప్పీన్స్‌లో ఇప్పటికే రిలీజ్ అయిన రెడ్‌మీ ప్యాడ్ 2
షావోమి కంపెనీ తన కొత్త ట్యాబ్లెట్ రెడ్‌మీ ప్యాడ్ 2ని ఇండియాలో లాంచ్ చేయడానికి ముందే ఫిలిప్పీన్స్‌లో రిలీజ్ చేసింది. అక్కడ నుంచి వచ్చిన రివ్యూల ఆధారంగా ఫీచర్లు, ధర ఇలా ఉన్నాయి.
రెడ్‌మీ ప్యాడ్ 2 ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ ట్యాబ్లెట్. ఇది దాని ముందు మోడల్ కంటే బ్యాటరీ లైఫ్, డిస్‌ప్లే క్వాలిటీ, పెర్ఫార్మెన్స్‌లో మంచి ఇంప్రూవ్‌మెంట్స్‌తో వస్తోంది. కొత్త మీడియాటెక్ హీలియో G100 అల్ట్రా ప్రాసెసర్, పెద్ద 2.5K LCD స్క్రీన్, నాలుగు డాల్బీ అట్మాస్ స్పీకర్లు, 18W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 9,000mAh బ్యాటరీ ఇందులో ముఖ్యమైన ఫీచర్లు. జూన్ 18న ఇండియాలో అఫీషియల్‌గా లాంచ్ అవుతున్న ఈ ట్యాబ్లెట్ యూజర్లకి మంచి అనుభవాన్ని ఇస్తుందని షావోమి కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది.
రెడ్‌మీ ప్యాడ్ 2 డిస్‌ప్లే, పెర్ఫార్మెన్స్, ఆడియో ఎలా ఉన్నాయంటే..
రెడ్‌మీ ప్యాడ్ 2 మొదటి రెడ్‌మీ ప్యాడ్ కంటే చాలా హార్డ్‌వేర్ ఇంప్రూవ్‌మెంట్స్‌తో వస్తోంది. ఇందులో 11 అంగుళాల LCD స్క్రీన్ ఉంది. ఇది 600 నిట్స్ బ్రైట్‌నెస్, 90 Hz రిఫ్రెష్ రేట్, 2560 x 1600 రిజల్యూషన్‌తో వస్తుంది. ముందు రెడ్‌మీ ప్యాడ్‌లో 10.61 అంగుళాల స్క్రీన్ ఉండేది. రెడ్‌మీ ప్యాడ్ 2 మదర్‌బోర్డ్ హీలియో G99కి బదులుగా కొత్త మీడియాటెక్ హీలియో G100 అల్ట్రా చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఇది డైలీ వర్క్స్‌కి, గేమింగ్‌కి మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తుంది.
256GB UFS 2.2 స్టోరేజ్, 8GB LPDDR4X RAM వరకు సపోర్ట్ చేస్తుంది. మైక్రో SD కార్డ్ స్లాట్ కూడా ఉంది. ఆడియో విషయానికి వస్తే నాలుగు స్పీకర్లు, డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంది. ఈసారి 3.5mm హెడ్‌ఫోన్ జాక్ కూడా షావోమి యాడ్ చేసింది. ఇది రెడ్‌మీ ప్యాడ్ 1లో లేదు.
రెడ్‌మీ ప్యాడ్ 2 కెమెరా, సాఫ్ట్‌వేర్
రెడ్‌మీ ప్యాడ్ 2లో 8 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే ఇది ఆండ్రాయిడ్ 15, హైపర్ OS 2.0తో వస్తోంది. ఇది ముందు మోడల్ కంటే మంచి అప్‌గ్రేడ్. పెద్ద 9,000mAh బ్యాటరీ మంచి బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. మొదటి జనరేషన్ ట్యాబ్లెట్ లాగే ఇది 18W ఛార్జింగ్‌ని సపోర్ట్ చేస్తుంది. కానీ ఇందులో దానికంటే ఎక్కువైన 22.5W ఛార్జర్ బాక్స్ ఇచ్చారు. Wi-Fi, 4G LTE, బ్లూటూత్, USB-C, ఫేస్ అన్‌లాక్ తదితర రెగ్యులర్ ఫీచర్లు ఉన్నాయి.
ఇండియాలో రెడ్‌మీ ప్యాడ్ 2 ధర ఎంత?
ఫిలిప్పీన్స్‌లో 6GB RAM, 128GB స్టోరేజ్ ఉన్న రెడ్‌మీ ప్యాడ్ 2 బేస్ మోడల్ ధర PHP 10,499 అంటే ఇండియన్ రూపాయల్లో సుమారు రూ.16,200. అదే 8GB + 256GB మోడల్ ధర PHP 12,999. అంటే సుమారు రూ.19,300. ఇండియాలో కూడా ఇదే ధర ఉండే అవకాశం ఉంది. రెడ్‌మీ ప్యాడ్ 2 బడ్జెట్ ధరలో మంచి ఫీచర్స్ కోరుకునే వారికి మంచి ఆప్షన్ అవుతుంది.
ఇది సిల్వర్, లైట్ బ్లూ, గ్రే కలర్స్‌లో లభిస్తుంది. జూన్ 18న ఇండియాలో ఈ ట్యాబ్లెట్ లాంచ్ అవుతుంది.