సమ్మర్ హాలిడేస్ కదా అని పిల్లలు ఎప్పుడు చూసినా సెల్ ఫోన్లు పట్టుకొనే ఉంటున్నారు. చాలా మంది తల్లిదండ్రులు కూడా తమ పనులకు ఆటంకం కాకుండా ఉంటుందని పిల్లలను పట్టించుకోవడం లేదు. ఎక్కువ సేపు ఫోన్లు వాడితే వచ్చే ప్రమాదాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఇప్పుడు అందరి ఇళ్లలోనూ పిల్లలకు ఫోన్లు ఇచ్చి అలవాటు చేసేస్తున్నారు.. కానీ పిల్లలకు ఫోన్లు ఎంత ప్రమాదకరమో చాలా మందికి తెలియదు. కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలు చిన్న వయసులోనే స్మార్ట్‌ఫోన్ వాడాలని, దాని ద్వారా ఎక్కువ సమాచారం తెలుసుకోవాలని అనుకుంటారు. అందుకే వాళ్లకు ఫోన్లు ఇస్తారు.
మరికొంతమంది తల్లిదండ్రులు పిల్లలు ఏడిస్తే, మారాం చేస్తే, సరిగ్గా తినాలంటే ఫోన్లు ఇస్తారు. కానీ ఇలా చేయడం వల్ల పిల్లల మెదడు దెబ్బతింటుందని చాలామందికి తెలియదు. నిజానికి పిల్లలు ఎక్కువ సేపు ఫోన్లు వాడితే వాళ్ల మెదడు పనితీరు దెబ్బతింటుందని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. పిల్లలు ఎక్కువ సేపు ఫోన్లు వాడితే వాళ్లకు ఏమవుతుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

52 శాతం పిల్లలు ఫోన్లు చూస్తున్నారు..
ఇటీవల కాలంలో పిల్లల్లో ఫోన్ల వాడకం ఎక్కువైందని అందరికీ తెలుసు. దీని గురించి ఇటీవల ఓ సంస్థ చేసిన సర్వే వివరాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. గత కొన్నేళ్లలో దాదాపు 52 శాతం పిల్లలు ఫోన్లు చూడటం పెరిగిందని ఈ సర్వేలో తేలింది. పిల్లల మనసు, ఆరోగ్యం, తల్లిదండ్రుల సంరక్షణ వంటి అంశాల గురించి కూడా ఈ సర్వేలో చాలా విషయాలు తెలిశాయి.
స్మార్ట్‌ఫోన్ వల్ల పిల్లలకు శారీరక, మానసిక సమస్యలు
పిల్లలు ఎక్కువగా ఫోన్లు చూడటం వల్ల శారీరక, మానసిక సమస్యలు వస్తాయని ఈ సర్వేలో తేలింది. ముఖ్యంగా పిల్లలు ఎక్కువ సేపు ఫోన్లు వాడితే వాళ్ల మెదడు దెబ్బతింటుందని, ఆ ప్రభావం చాలా కాలం ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.
స్మార్ట్‌ఫోన్ వాడకం వల్ల పిల్లలు, యువత మెదడు పనితీరు సరిగ్గా ఉండటం లేదని సర్వేలో తేలింది. స్మార్ట్‌ఫోన్ ఎక్కువగా వాడితే పిల్లలకు చాలా హాని జరుగుతుందని మానసిక వైద్యులు హెచ్చరిస్తున్నారు.

పిల్లలకు చెవుడు రావచ్చు..
స్మార్ట్‌ఫోన్‌లో ఎక్కువ సౌండ్‌తో మ్యూజిక్ వింటే పిల్లలకు చెవుడు వచ్చే అవకాశం ఉందని తేలింది. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్లను స్మార్ట్‌ఫోన్ వాడకుండా కాపాడాలి.
ఇలా చేస్తే మంచిది..
పిల్లలు మారాం చేస్తే, లేదా ఏడిస్తే వాళ్లకు ఫోన్లు ఇచ్చి అలవాటు చేస్తే భవిష్యత్తులో వచ్చే ప్రమాదాలను అడ్డుకోలేరు. పిల్లలకు స్మార్ట్‌ఫోన్ ప్రమాదాల గురించి తెలియదు. కాని పెద్దలు అర్థం చేసుకొని వారికి వివరించాలి. పిల్లలతో తల్లిదండ్రులు టైమ్ గడపగలిగితే వారికి సరదాగా ఉంటుంది. పెద్దలకు రిలాక్షేషన్ లభిస్తుంది.
