తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ అంశాలు, సినిమా వార్తలు, లైఫ్ స్టైల్ సంబంధిత కథనాలు, క్రికెట్ వార్తలు అన్ని ఒకే చోట, ఎప్పటికప్పుడు లైప్ అప్‌డేట్స్ ఇక్కడ చూడండి..

11:51 PM (IST) Jun 08
Modi threat: జీ7 సదస్సు ముందు ఖలిస్థానీ తీవ్రవాదంపై కెనెడియన్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ మోచా బెజిర్గాన్ ఆందోళన వ్యక్తం చేశారు. భారత ప్రధాని మోడీ దాడి హెచ్చరికలపై ఖాలిస్తానీ వాదుల తీరును ఎత్తి చూపారు.
11:34 PM (IST) Jun 08
SSC: ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి శుభవార్త. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ స్టెనో గ్రేడ్ సి, డి పరీక్ష నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 261 ఖాళీలు ఉన్నాయి. దీనికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి. క్వాలిఫికేషన్, లాస్ట్ డేట్ తదితర వివరాలు ఇక్కడ ఉన్నాయి.
10:26 PM (IST) Jun 08
TIN Number: కొత్తగా వ్యాపారం మొదలుపెట్టే వాళ్లందరు తప్పనిసరిగా TIN(టాక్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్) నెంబర్ తీసుకోవాలి. ఇది పొందడానికి కావాల్సిన డాక్యుమెంట్స్, దాని ఉపయోగాలు, సంపాదించే విధానం గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
10:21 PM (IST) Jun 08
Air India: ఎయిర్ ఇండియా FY25లో రూ.61,000 కోట్లు ఆదాయం, 44 మిలియన్ ప్రయాణికులతో 9.9% వృద్ధి సాధించింది. విహాన్.ఏఐ ప్రోగ్రామ్ మంచి ఫలితాలను ఇచ్చిందని రిపోర్టులు పేర్కొంటున్నాయి.
09:58 PM (IST) Jun 08
WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్ జూన్ 11 నుంచి 15 వరకు లార్డ్స్ వేదికగా జరుగుతుంది. భారత్ లేకుండా మొదటిసారి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ జరుగుతోంది. తుదిపోరులో ఆస్ట్రేలియాతో దక్షిణాఫ్రికా తలపడనుంది.
09:53 PM (IST) Jun 08
TVS కంపెనీ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ని తీసుకొస్తోందన్న వార్త లీక్ అయ్యింది. తెలిసిన సమాచారం ప్రకారం ఈ స్కూటర్ పేరు జూపిటర్ EV అని, ఐక్యూబ్ మోడల్ లా దీన్ని కూడా సక్సెస్ చేసేందుకు టీవీఎస్ ప్లాన్ చేస్తోందని సమాచారం. కొత్త స్కూటర్ విశేషాలు తెలుసుకుందామా?
09:21 PM (IST) Jun 08
Maruti Suzuki: మారుతి సుజుకి ఇండియా కొత్త కార్లను లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. కొత్త ఎలక్ట్రిక్, హైబ్రిడ్ కార్లతో పాటు ఇంకా చాలా మోడల్స్ తీసుకురాబోతున్నట్టు కంపెనీ ప్రకటించింది. ఎలాంటి మోడల్ కార్లు రానున్నాయో తెలుసుకుందామా?
08:44 PM (IST) Jun 08
AP EAPCET 2025 Results: ఏపీ ఈఎపీసెట్ 2025 ఫలితాలు ఆదివారం విడుదలయ్యాయి. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆ వివరాలు మీకోసం.
07:48 PM (IST) Jun 08
AP EAMCET 2025 results: ఏపీ ఎంసెట్ (AP EAMCET 2025) ఫలితాల్లో ఇంజనీరింగ్ స్ట్రీమ్‌లో 1.89 లక్షల మంది, అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్‌లో 67,761 మంది అర్హత సాధించారు.
07:48 PM (IST) Jun 08
MS Dhoni bike ride: ఐపీఎల్ 2025 ముగిసిన తర్వాత రాంచీలో తన బైక్‌పై దర్శనమిచ్చిన ధోనీ ఫోటో వైరల్ అవుతోంది.
06:50 PM (IST) Jun 08
Team India: టెస్ట్ సిరీస్ కోసం భారత జట్టు ఇంగ్లాండ్ చేరుకుంది. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ గురించి రిషబ్ పంత్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
06:47 PM (IST) Jun 08
సాధారణంగా ఏసీ ఆన్ చేయగానే చాలా మంది 18 డిగ్రీల సెల్సియస్‌లో పెట్టేస్తారు. కాని దీని వల్ల కరెంటు మీటరు ఒక్కసారిగా గిర్రున తిరుతుగుతుంది. నెలాఖరున బిల్లు కూడా భారీగా వస్తుంది. కరెంటు ఆదా చేయాలంటే ఏసీ ఎన్ని పాయింట్లలో పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం.
05:06 PM (IST) Jun 08
Andhra Minister Savitha : ఏపీ మంత్రి సంజీవరెడ్డిగారి సవిత తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక కార్యక్రమంలో మంత్రి సవిత పుష్పగుచ్చంను విసిరికొట్టారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
04:14 PM (IST) Jun 08
Maganti Gopinath: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మగంటి గోపీనాథ్ తీవ్ర అస్వస్థతతో గచ్చిబౌలిలోని ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఈ క్రమంలోనే ఆయనకు నివాళులు అర్పిస్తూ మాజీ సీఎం, భారత రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) కంటతడి పెట్టుకున్నారు.
03:49 PM (IST) Jun 08
Telangana new ministers: తెలంగాణ మంత్రివర్గంలోకి మరో ముగ్గురు ఎమ్మెల్యేలు చేరారు. జీ.వివేక్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, వాకిటి శ్రీహరిలు మంత్రులుగా ప్రమాణం చేశారు. అలాగే, రామచంద్రు నాయక్ కు డిప్యూటీ స్పీకర్ పదవి దక్కింది.
02:51 PM (IST) Jun 08
ప్రస్తుత రోజుల్లో వైద్యం అంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. కన్సల్టేషన్ ఫీజులు రూ. 500 వసలూఉ చేస్తున్న రోజులివీ అయితే ఓ వ్యక్తి మాత్రం కేవలం రూ. 10కే వైద్యం అందించాడు. ఎంతో మందికి వైద్యాన్ని అందించిన ఆ మహానుభావుడు తుది శ్వాస విడించారు.
02:36 PM (IST) Jun 08
Compact SUV: మీరు కొత్త కారు కొనాలనుకుంటున్నారా? కొంత కాలం వెయిట్ చేస్తే హైబ్రిడ్ వెర్షన్ కార్లు మార్కెట్ లోకి వస్తాయి. ఇందులో పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్, సీఎన్జీ మోడల్స్ కూడా ఉన్నాయి. మీకు నచ్చిన కారు సెలెక్ట్ చేసుకోవచ్చు.
02:01 PM (IST) Jun 08
మన ఆరోగ్యం తీసుకునే ఆహారంపై ఆధారపడి ఉంటుందని తెలిసిందే. అయితే ఉదయం తీసుకునే ఆహారం లివర్ పై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో తీసుకోకూడని కొన్ని పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
01:31 PM (IST) Jun 08
మనం మంచిగా ఆలోచిస్తే పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది. చెడు ఆలోచనల వల్ల ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది. ఇది ఇంటిపై కూడా ప్రభావం చూపుతుంది. ఇంట్లో ఉండే వాళ్లంతా పాజిటివ్ ఎనర్జీకి కలిగి ఉండాలంటే ఇంట్లో ఈ సౌండ్ ఎప్పుడూ మోగుతూ ఉండాలి. అదేంటో తెలుసా?
12:51 PM (IST) Jun 08
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం అక్కడ ఉద్రిక్తతకు దారి తీసింది. లాస్ ఏంజెలెస్‌లో అక్రమ వలసదారులపై చేపట్టిన తనిఖీలతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
12:26 PM (IST) Jun 08
జ్యోతిష్యంపై మనలో చాలా మందికి విశ్వాసం ఉంటుంది. శాస్త్రసంకేతికంగా ఎంత ఎదిగినా జ్యోతిష్యాన్ని నమ్మేవారు చాలా మంది ఉంటారు. ఈ నేపథ్యంలోనే వచ్చే వారం రాశి ఫలాలు ఎలా ఉండనున్నాయి.? ఎవరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.? ఇప్పుడు తెలుసుకుందాం.
11:28 AM (IST) Jun 08
గతకొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఆదివారం తెల్లవారు జామున తుది శ్వాస విడిచారు. గుండె సంబంధిత సమస్యలతో ఆసుపత్రిలో చేరిన గోపినాథ్‌కు వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందించగా ఆదివారం కన్నుమూశారు.
10:52 AM (IST) Jun 08
ఎన్నో రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ఎట్టకేలకు ఆమోదం లభించింది. ఆదివారం మధ్యాహ్నం కొత్త మంత్రులు బాధ్యతలను స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి మంత్రుల జాబితాను అధికారికంగా ప్రకటించారు.
10:25 AM (IST) Jun 08
కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు, తనను విచారణకు హాజరుకావాలని కమిషన్ ఆదేశించిన నేపథ్యంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.
09:46 AM (IST) Jun 08
జపాన్‌లో ఒక ప్రత్యేకమైన నడక టెక్నిక్ ఉంది, ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. దీని సహాయంతో ఎక్కువ నడవకుండానే త్వరగా బరువు తగ్గొచ్చు. అదేలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
08:34 AM (IST) Jun 08
వాతావరణం: ఈసారి తెలుగు రాష్ట్రాలను వరుణుడు ముందుగానే పలకరించాడు. రుతుపవనాల ఆగమనం కంటే ముందే పలు చోట్ల వర్షాలు కురిశాయి. అయితే తాజాగా కాస్త బ్రేక్ ఇచ్చిన వర్షాలు మళ్లీ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
08:12 AM (IST) Jun 08
ప్రతీ ఏడాది మృగశిర కార్తె రోజున చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో ఈ ఏడాది కూడా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో పలు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
07:52 AM (IST) Jun 08
ఆదివారం మృగశిరా కార్తె వచ్చింది. ఉదయం నుంచి మార్కెట్లన్నీ చేపలతో హడావుడిగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అసలు మృగశిరా కార్తె రోజు చేపలు తినే ఆనవాయితే ఎలా వచ్చింది.? దీని వెనకాల ఉన్న ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.