TVS కంపెనీ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ని తీసుకొస్తోందన్న వార్త లీక్ అయ్యింది. తెలిసిన సమాచారం ప్రకారం ఈ స్కూటర్ పేరు జూపిటర్ EV అని, ఐక్యూబ్ మోడల్ లా దీన్ని కూడా సక్సెస్ చేసేందుకు టీవీఎస్ ప్లాన్ చేస్తోందని సమాచారం. కొత్త స్కూటర్ విశేషాలు తెలుసుకుందామా?

TVS కంపెనీ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ని తీసుకొస్తున్నట్టు సమాచారం. జూపిటర్ EV అని పిలిచే ఈ స్కూటర్ టీవీఎస్ నుంచే వచ్చిన ఐక్యూబ్ మోడల్ కంటే బెటర్ ఫీచర్స్ ను కలిగి ఉంటుందట. 

జూపిటర్ EV అంత భారీ ధర ఉండదు

ఇది TVS X లా భారీ ధర ఉండదని కూడా తెలిసింది. TVS X ధర రూ.2.50 లక్షలు. ధర ఎక్కువ, తక్కువ లభ్యత కారణంగా ఈ మోడల్ అమ్మకాలు తక్కువగా ఉన్నాయి. అయితే జూపిటర్ EV మాత్రం తక్కువ ధరకే లభిస్తుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

జూపిటర్ EVలో ఏమేం ఫీచర్లు ఉంటాయంటే..

అయితే జూపిటర్ 110, 125 ప్లాట్‌ఫారాలు ఇప్పటికే ఎలక్ట్రిక్ వెర్షన్‌కి సిద్ధంగా ఉన్నాయి. అంటే వాటి పెట్రోల్ ట్యాంక్ ఉండే చోట చార్జింగ్ పోర్ట్ ఉంటుందన్న మాట. మరి జూపిటర్ EV పేరుతో రానున్న ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో ప్రత్యేకంగా ఏమేం ఫీచర్లు ఉండనున్నాయో వేచి చూడాల్సిందే.

జూపిటర్ EV దేనికి పోటీగా నిలుస్తుందంటే..

జూపిటర్ EV మాత్రం బజాజ్, ఓలా లాంటి కంపెనీలకి పోటీ ఇస్తుందని టీవీఎస్ కంపెనీ ధీమాగా చెబుతోంది. ముఖ్యంగా 1.2 లక్షల రూపాయల లోపు ఈ స్కూటర్ ఉంటుందని, ఈ విభాగంలో లభించే స్కూటర్లన్నింటికంటే ఇది మంచి ఆప్షన్ అవుతుందని కంపెనీ చెబుతోంది.

TVS నుంచి మరికొన్ని కొత్త వెహికల్స్

TVS కంపెనీ కొత్త 450cc ట్విన్ సిలిండర్ మోటార్ సైకిల్‌ని కూడా తయారు చేస్తున్నట్టు సమాచారం. జూపిటర్ EV లాంటి ఎలక్ట్రిక్ స్కూటర్‌తో సహా చాలా కొత్త మోడల్స్ త్వరలోనే మార్కెట్లోకి వస్తాయని దీన్ని బట్టి అర్థమవుతోంది. BMW మోటోరాడ్‌తో కలిసి 450cc ఇంజిన్‌ని తయారు చేయాలని TVS భావిస్తోంది. కొత్త 450 ట్విన్-ప్లాట్‌ఫారం ఆధారంగా ఈ మోటార్ సైకిల్ ఉంటుంది. BMW మోటోరాడ్ F 450 GS ఈ ప్లాట్‌ఫారంను ఉపయోగించే మొదటి మోటార్ సైకిల్ అవుతుంది.

కొత్త 450cc మోడల్ సూపర్‌స్పోర్ట్ మోటార్ సైకిల్‌గా ఉంటుంది. అంటే ఇది అపాచీ RR 310 కంటే ఎక్కువ ఫీచర్స్ ఉన్న బైక్ అవుతుందన్న మాట. దీనికి TVS అపాచీ RR 450 అని పేరు పెట్టే అవకాశాలు ఉన్నాయి.