- Home
- Astrology
- Astrology: ఈ రాశి వారు డబ్బుల విషయంలో ఎవరినీ నమ్మొద్దు.. మీ వార ఫలితాలు చెక్ చేసుకోండి
Astrology: ఈ రాశి వారు డబ్బుల విషయంలో ఎవరినీ నమ్మొద్దు.. మీ వార ఫలితాలు చెక్ చేసుకోండి
జ్యోతిష్యంపై మనలో చాలా మందికి విశ్వాసం ఉంటుంది. శాస్త్రసంకేతికంగా ఎంత ఎదిగినా జ్యోతిష్యాన్ని నమ్మేవారు చాలా మంది ఉంటారు. ఈ నేపథ్యంలోనే వచ్చే వారం రాశి ఫలాలు ఎలా ఉండనున్నాయి.? ఎవరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.? ఇప్పుడు తెలుసుకుందాం.
- FB
- TW
- Linkdin
Follow Us
)
మేష రాశి:
ఈ వారం మేషరాశివారు ఒత్తిడికి గురవుతారు. పని విషయంలో ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలు సమస్యలకే దారి తీస్తాయి. వ్యాపార రంగంలో అతి నమ్మకం మోసానికి దారితీయవచ్చు. డబ్బు ఖర్చుపై నియంత్రణ అవసరం. ఉద్యోగం మార్పు కోరేవారికి అవకాశాలు లభించొచ్చు.
ప్రేమ వ్యవహారాల్లో అహాన్ని వదిలేయాలి. ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు అవసరం. సమిష్టిగా ఆలోచిస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఉపాయం: ఆదిత్య హృదయం పారాయణం చేయడం శ్రేయస్కరం.
వృషభం
వృషభరాశివారికి ఈ వారం అనుకూలమే. ఉద్యోగాల్లో స్థిరత, గౌరవం లభిస్తాయి. వ్యాపారంలో ముందడుగు పడతారు. ఆర్థికంగా అభివృద్ధి కనిపిస్తుంది. విద్యార్థులకు ఇది మంచి సమయం.
ప్రేమలో నమ్మకం, నిజాయితీ అవసరం. ఆరోగ్యపరంగా ఈ వారం మంచి ఫలితాలు ఇస్తుంది. ఉపాయం: శ్రీలక్ష్మి గణపతి ఆలయ దర్శనం చేయడం మంచిది.
మిథునం
ఈ వారం మిథునరాశివారికి మంచి ఆర్థిక లాభాలు ఉండొచ్చు. ఆదాయాన్ని పెంచుకునే అవకాశాలు వస్తాయి. వ్యాపారంలో కొత్త ఆవిష్కరణలు చేస్తారు. విద్యార్థులకు చిన్నపాటి అనిశ్చితి కనిపించొచ్చు.
ప్రేమ జీవితం ఆనందంగా ఉంటుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. ఉపాయం: వేంకటేశ్వర స్వామిని దర్శించటం శుభప్రదం.
కర్కాటకం
ఈ వారం కర్కాటకరాశివారికి మిశ్రమమైన ఫలితాలు. ఉద్యోగంలో పదోన్నతి అవకాశాలున్నా ఆర్థికంగా ఒత్తిడి ఉంటుంది. వ్యాపారంలో నిర్ణయాలు తీసుకునే ముందు సలహాలు తీసుకోవాలి. ప్రేమలో నమ్మకం పెంచాలి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. కుటుంబంలో అపార్థాలు నివారించాలి. ఉపాయం: నవగ్రహ ధ్యానం మేలు చేస్తుంది.
సింహం
సింహరాశివారు ఈ వారం సమతుల్యత అవసరం. కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. స్టాక్ మార్కెట్, రుణాల నుంచి దూరంగా ఉండటం మంచిది. కుటుంబంలో అపార్థాలకు అవకాశం ఉంది.
విద్యార్థులు మరింత ఏకాగ్రతతో ముందుకెళ్లాలి. ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందిగా ఉంటుంది. ఉపాయం: సూర్యుడు ఆరాధన చేయడం శ్రేయస్కరం.
కన్య
ఈ వారం కన్యారాశివారికి ఒత్తిడితో కూడిన పరిస్థితి ఉంటుంది. వ్యాపారంలో నష్టాలను నివారించేందుకు ముందు జాగ్రత్త అవసరం. ఉద్యోగులు ఉన్నతులనుంచి ఒత్తిడి ఎదుర్కొంటారు. ఖర్చులు అధికంగా ఉండొచ్చు. శారీరకంగా అలసట ఉంటుంది. ఉపాయం: కార్యసిద్ధి హనుమంతుని పూజించడం మంచిది.
తుల
తులరాశివారికి ఈ వారం ఆరోగ్యపరంగా కొంత అప్రమత్తత అవసరం. ఉద్యోగంలో సానుకూలత ఉన్నా వ్యాపారంలో ఒడిదుడుకులు ఉంటాయి.
విద్యార్థులు శ్రమించి ఫలితాలు పొందవచ్చు. వివాహ బంధాల్లో అపార్థాలు కలగొచ్చు. ఉపాయం: హనుమాన్ చాలీసా పారాయణం చేయండి.
వృశ్చికం
వృశ్చికరాశివారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వ్యాపార విస్తరణ, కొత్త ఒప్పందాల అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగ మార్పు కోసం చూస్తున్న వారికి మంచి అవకాశం ఉంటుంది. కుటుంబంలో శుభవార్తలు వింటారు. ఆరోగ్యాన్ని అలక్ష్యం చేయకండి. ఉపాయం: శ్రీలక్ష్మి ధ్యానం చేయడం శ్రేయస్కరం.
ధనుస్సు
ఈ వారం ధనుస్సురాశివారికి నూతన బాధ్యతలు వస్తాయి. వ్యాపార సంబంధాల విషయంలో ప్రయాణాలు ఫలితాన్ని ఇస్తాయి. అయితే ఖర్చులు ఎక్కువగా ఉండొచ్చు. కుటుంబంలో గొడవలు నివారించాలి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. ఉపాయం: శివారాధన ఫలితాన్ని ఇస్తుంది.
మకరం
మకరరాశివారికి ఈ వారం పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వ్యాపారంలో ఆశించిన లాభాలు రాకపోవచ్చు. కుటుంబ కలహాలు చికాకు కలిగించొచ్చు. ఆరోగ్యపరంగా జాగ్రత్త అవసరం. ఖర్చులు అదుపులో పెట్టుకోవాలి. ఉపాయం: అభయ ఆంజనేయ స్వామి దర్శనం చేయండి.
కుంభం
ఈ వారం కుంభరాశివారికి విజయాలతో నిండిన సమయం. వృత్తిలో పురోగతి, ఆదాయ వృద్ధి కనిపిస్తుంది. కుటుంబంలో ఆనందం వాతావరణం నెలకొంటుంది. విదేశీ అవకాశాలు లభించవచ్చు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఉపాయం: దుర్గాస్తుతి పారాయణ శుభం ఇస్తుంది.
మీనం
మీనరాశివారికి వారం తొలి భాగం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగం, వ్యాపారంలో మంచి అవకాశాలు లభిస్తాయి. అయితే వారం ద్వితీయార్ధంలో ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఖర్చులపై నియంత్రణ అవసరం. ఉపాయం: శని శ్లోకాలు పఠించడం మంచిది.