SSC: ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి శుభవార్త. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ స్టెనో గ్రేడ్ సి, డి పరీక్ష నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 261 ఖాళీలు ఉన్నాయి. దీనికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి. క్వాలిఫికేషన్, లాస్ట్ డేట్ తదితర వివరాలు ఇక్కడ ఉన్నాయి.
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) 2025 స్టెనో గ్రేడ్ సి, డి పరీక్ష నోటిఫికేషన్ విడుదల చేసింది. 261 ఖాళీలను భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ ఇచ్చారు. మీరు ప్రభుత్వం ఉద్యోగం సాధించాలని ప్రయత్నిస్తుంటే ఇది మంచి అవకాశం. అందులోనూ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం సాధిస్తే లభించే బెనిఫిట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఈ పోస్టుల కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎస్ఎస్సీ స్టెనో 2025 పరీక్ష రాయాలంటే అర్హత ఏంటంటే?
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా స్టెనో ఉద్యోగాలకు అప్లై చేయాలంటే మీరు ప్రభుత్వం గుర్తింపు పొందిన బోర్డ్ నుండి 12వ తరగతి పాస్ అయి ఉండాలి. అది కూడా ఆగస్టు 1, 2025 లోపు పాస్ అయి ఉండాలి. తెలుగు రాష్ట్రాల్లో అయితే ఇంటర్ పాసై వారు అప్లై చేసుకోవచ్చు.
ఎస్ఎస్సీ స్టెనో 2025 అప్లికేషన్ ఫీజు ఎంతంటే?
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా స్టెనో ఉద్యోగాలు సాధించాలనుకొనే సాధారణ అభ్యర్థులు రూ.100 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, PwBD, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులైతే ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
దరఖాస్తు చేసే విధానం
స్టెనో ఉద్యోగాలకు అప్లై చేయాలంటే ssc.gov.in వెబ్‌సైట్‌కి వెళ్ళాలి.
'ఎస్ఎస్సీ స్టెనో గ్రేడ్ సి & డి 2025' లింక్ క్లిక్ చేయాలి.
దరఖాస్తు ఫారం నింపి, ఆన్‌లైన్‌లో పేమెంట్ చెల్లించాలి.
జూన్ 26 లోపు దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి. మరిన్ని వివరాలకు ssc.gov.in చూడండి.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి జూన్ 26, 2025 లాస్ట్ డేట్.
ఆన్‌లైన్ పేమెంట్ చేయడానికి మాత్రం జూన్ 27, 2025 వరకు అవకాశం ఇచ్చారు.
అప్లికేషన్ లో ఏవైనా మార్పులు చేయాలనుకుంటే?
మీరు నింపిన దరఖాస్తులో మార్పులు చేయాలనుకుంటే జూలై 1 2025 నుండి జూలై 2, 2025 వరకు అవకాశం ఉంటుంది. అయితే మొదటి మార్పులు చేయడానికి రూ.200, రెండోసారి చేయాల్సి వస్తే రూ.500 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. BHIM UPI, నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్ ల ద్వారా కూడా పేమెంట్ చేయొచ్చు.
పరీక్ష విధానం ఎలా ఉంటుందంటే?
ఆగస్టు 6, 2025 నుండి ఆగస్టు 11, 2025 వరకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) ఉంటుంది. జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లీష్, రీజనింగ్ నుండి ప్రశ్నలు అడుగుతారు. ఎగ్జామ్ రాయడానికి సమయం 2 గంటలు మాత్రమే. ప్రశ్నపత్రం హిందీ, ఇంగ్లీష్‌లో మాత్రమే ఉంటుంది.
