మనం మంచిగా ఆలోచిస్తే పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది. చెడు ఆలోచనల వల్ల ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది. ఇది ఇంటిపై కూడా ప్రభావం చూపుతుంది. ఇంట్లో ఉండే వాళ్లంతా పాజిటివ్ ఎనర్జీకి కలిగి ఉండాలంటే ఇంట్లో ఈ సౌండ్ ఎప్పుడూ మోగుతూ ఉండాలి. అదేంటో తెలుసా?

మన ఆలోచనలే ఎనర్జీని జనరేట్ చేస్తాయి

ఆధ్యాత్మిక గ్రంథాలు, వాస్తు శాస్త్రాల ప్రకారం మన ఆలోచనల వల్ల మన చుట్టూ ఒక రకమైన ఎనర్జీ జనరేట్ అవుతుంది. పాజిటివ్ ఆలోచనలు ఉంటే పాజిటివ్ ఎనర్జీ, నెగెటివ్ ఆటోచనలు ఉంటే నెగెటివ్ ఎనర్జీ తయారవుతుంది. వీటి ప్రభావం మన జీవితాలపై పడుతుంది. ఇంట్లో కూడా రకరకాల మైండ్ సెట్ ఉన్న వ్యక్తులు ఉంటారు. వారిలో పాజిటివ్ ఆటోచనలు కలిగిన వారు, ప్రతికూల మనస్తత్వాలు ఉన్న వారు కూడా ఉంటారు.

నెగెటివ్ ఎనర్జీ వల్ల ఎప్పుడూ గొడవలే..

ఇలా విభిన్న వ్యక్తుల కలిసి ఉన్న ఇంట్లో ఎవరి ఆలోచనలు వారిని ప్రభావం చేస్తుంటాయి. ఇది వారి వ్యక్తిగత జీవితంపైనా, ఉద్యోగ, వ్యాపార రంగాలపైనా కూడా ఎఫెక్ట్ చూపుతుంది. బయట ఎవరు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నా ఇంటికి వచ్చే సరికి ఇంట్లో ఆహ్లాదకర వాతావరణం ఉండాలి. కాని ఇంట్లో ఎవరైతే ఎక్కువ డామినేట్ చేస్తారో వారి ఎనర్జీ ఇంటిని ఎక్కువ ప్రభావితం చేస్తుంది. అయితే పాజిటివ్ అయితే పర్వాలేదు కాని.. నెగెటివ్ ఎనర్జీ అయితే ఇంట్లో ఎప్పుడూ గందరగోళంగా ఉంటుంది. గొడవలు జరుగుతూ ఉంటాయి. మనస్ఫర్థలు కలుగుతాయి.

పాజిటివ్ ఎనర్జీ జనరేట్ చేయడానికే సంప్రదాయాలు

అందుకే పూర్వం ఇంట్లో ఆహ్లాదకర వాతావరణం, ఆధ్మాత్మిక చింతన ఉండాలని కొన్ని సంప్రదాయాలు ఏర్పాటు చేశారు. తెల్లవారుజామునే లేచి స్నానం చేసి దేవుడికి పూజ చేయడం, పువ్వులతో దేవుని చిత్ర పటాలు అలంకరించడం, శ్లోకాలు, స్తోత్రాలు పఠించడం లాంటివి కచ్చితంగా చేయాలని చెప్పేవారు. దీపం, అగరవత్తులు, హారతి కర్పూరం వెలిగించడం ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ జనరేట్ అవ్వాలనే చేయించేవారు. 

ఈ సౌండ్ వింటే ఆహ్లాదంగా ఉంటుంది..

అయితే ఇప్పుడున్న బిజీ జీవితంలో ఇలాంటి సంప్రదాయాలు పాటించడం చాలా కష్టమైనే పనే. కాని పాటిస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇలాంటివి చేయలేని వారు ఇంట్లో ఒక శబ్దం ఎప్పుడూ మోగేలా చేయగలిగితే ఆ ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ దూరమైపోతుంది. అంతేకాకుండా బయట నుంచి కూడా ఎటువంటి ప్రతికూల శక్తి లోపలికి రాకుండా ఉంటుంది. 

చిన్న వాటర్ ఫౌంటెయిన్ ఏర్పాటు చేసుకోండి

ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ పోవాలంటే ఒక చిన్న వాటర్ ఫౌంటెయిన్ ఏర్పాటుచేసుకోండి. అది నిరంతరం పనిచేసేలా చూడండి. ఆ వాటర్ ఫౌంటెయిన్ నుంచి వచ్చే గలగల నీటి శబ్దం మీ ఇంట్లో ఉండే నెగెటివ్ ఎనర్జీని బయటకు పంపేస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఆ శబ్దం వింటున్న వారి ఆలోచనలు కూడా పాజిటివ్ గా మారతాయని, తద్వారా వారు తీసుకొనే నిర్ణయాలు కూడా సత్ఫలితాలనిస్తాయని చెబుతున్నారు. 

ఇంట్లో డ్రాయింగ్ రూమ్ కార్నర్‌లో గాని, గార్డెన్ మూలల్లో గాని చిన్న వాటర్ ఫౌంటెయిన్ పెట్టడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు.