Rain Alert: ఏపీ, తెలంగాణలో మళ్లీ వర్షాలు.. ఈ ప్రాంతాలను అలర్ట్ చేసిన అధికారులు.
వాతావరణం: ఈసారి తెలుగు రాష్ట్రాలను వరుణుడు ముందుగానే పలకరించాడు. రుతుపవనాల ఆగమనం కంటే ముందే పలు చోట్ల వర్షాలు కురిశాయి. అయితే తాజాగా కాస్త బ్రేక్ ఇచ్చిన వర్షాలు మళ్లీ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
- FB
- TW
- Linkdin
Follow Us
)
మారిన వాతావారణం
తెలంగాణ వ్యాప్తంగా వాతావరణంలో మార్పులు మొదలయ్యాయి. భారత వాతావరణ శాఖ (IMD) తెలిపిన వివరాల ప్రకారం, జూన్ 7 నుంచి 11 వరకు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే మబ్బులు కమ్ముకున్న నేపథ్యంలో ఈ అంచనాలు ప్రజలకు కొంత ఉపశమనం కలిగించనున్నాయి.
ఉష్ణోగ్రతలు తగ్గే సూచనలు
ఈ వర్షాల ప్రభావంతో రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 36 డిగ్రీల సెంటిగ్రేడ్‌కు దిగువగా నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. గత కొద్దిరోజులుగా మండుతున్న ఎండలకు ఇది ఉపశమనంగా భావించవచ్చు. వర్షాల కారణంగా రాత్రిపూట గాలిలో తేమ పెరిగి చల్లదనంగా మారే అవకాశం ఉంది.
హైదరాబాద్‌లో వాతావరణం ఎలా ఉండనుంది.?
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో వచ్చే నాలుగు రోజుల పాటు ఆకాశం మేఘావృతంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. జూన్ 10 వరకు వర్షాలు పడే అవకాశముంది. మధ్యాహ్నం ప్రాంతాల్లో మోస్తరు వర్షం, సాయంత్రానికి ఈదురుగాలులు వీస్తూ వాతావరణం చల్లగా మారే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో కూడా వర్షాలు
ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ (APSDMA) ప్రకారం, ఆదివారం సాయంత్రం నుంచి అనేక జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం పరిసరాలు, విజయనగరం, పార్వతీపురం, శ్రీకాకుళం, గుంటూరు, తిరుపతి వంటి జిల్లాల్లో వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు.
ఈ ప్రాంతాల్లో ఎండ తీవ్రత
వర్షం కురిసే జిల్లాలు తప్ప మిగతా ప్రాంతాల్లో మాత్రం ఎండలు కొనసాగనున్నాయి. ముఖ్యంగా అనంతపురం, కర్నూల్, కడప, నెల్లూరు వంటి జిల్లాల్లో ఉష్ణోగ్రతలు గరిష్టంగా 40–41 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉంది. దీని కారణంగా ప్రజలు వేడి నుంచి జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈ ఉక్కపోతకు దక్షిణ మధ్య మహారాష్ట్ర నుంచి కోస్తాంధ్ర వరకూ విస్తరించిన ద్రోణి ప్రధాన కారణమని వాతావరణ శాఖ పేర్కొంది.