Maruti Suzuki: మారుతి సుజుకి ఇండియా కొత్త కార్లను లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. కొత్త ఎలక్ట్రిక్, హైబ్రిడ్ కార్లతో పాటు ఇంకా చాలా మోడల్స్ తీసుకురాబోతున్నట్టు కంపెనీ ప్రకటించింది. ఎలాంటి మోడల్ కార్లు రానున్నాయో తెలుసుకుందామా?

మారుతి సుజుకి కొత్త కార్లను త్వరలోనే మార్కెట్లోకి తీసుకురానుంది. మీరు గాని కొత్తగా కారు కొనాలనుకుంటే కొంచెం వెయిట్ చేయండి. బెస్ట్ ఫీచర్స్ ఉన్న కారును సెలెక్ట్ చేసుకోవచ్చు. సుజుకి కొత్త కార్ల గురించి పూర్తి వివరాలు ఇంకా చెప్పలేదు. కాని తెలిసిన సమాచారం కొంత ఇక్కడ ఉంది.

కాంపాక్ట్ MPV & మైక్రో SUV

టాటా పంచ్ లాంటి కార్లకు పోటీగా సుజుకి కొత్త కాంపాక్ట్ MPV లేదా SUV ని తక్కువ ధరలో తీసుకురానుందని సమాచారం. హైబ్రిడ్ వెర్షన్ లో కూడా ఈ కారు రావచ్చు. ఈ సెగ్మెంట్ లో వచ్చిన ఇగ్నిస్, రిట్జ్ లాంటి కార్లు సక్సెస్ కాలేకపోయినా వ్యాగన్ R మాత్రం మంచి అమ్మకాలు సాధిస్తోంది. కొత్తగా రానున్న ఈ కారు వ్యాగన్ R కి కొత్త లుక్ లా కూడా ఉండొచ్చు. 

మారుతి సుజుకి EWX

జపాన్ లో జరిగిన ఆటో షోలో EWX అనే చిన్న హ్యాచ్ బ్యాక్ కారుని సుజుకి ప్రదర్శించింది. SUV లాంటి డిజైన్ తో ఈ కారు ఉంది. ఈ కారు ఎప్పుడు మార్కెట్లోకి వస్తుందో ఇంకా క్లారిటీ లేదు. కాని ఇది చిన్న EV ని లా అనిపిస్తోంది. 

మారుతి సుజుకి ఫ్రాంక్స్ హైబ్రిడ్

ఫ్రాంక్స్ కారు హైబ్రిడ్ వెర్షన్ లో రాబోతోంది. టెస్టింగ్ దశలో ఉన్న ఈ కారు త్వరలోనే మార్కెట్లోకి రావచ్చు. మైల్డ్ హైబ్రిడ్ వెర్షనా లేక ఫుల్ హైబ్రిడ్ వెర్షనా అనేది ఇంకా తెలియదు. 1 లీటర్ టర్బోచార్జ్డ్ ఇంజిన్, 1.2 లీటర్ 4 సిలిండర్ ఇంజిన్ లలో ఈ కారు రావచ్చని సమాచారం.

కొత్త KIA సోనెట్ పోటీదారు

KIA సోనెట్ కారుకి పోటీగా మారుతి సుజుకి కొత్త 5 సీటర్ SUV ని తీసుకురాబోతోంది. విటారా బ్రెజ్జా, గ్రాండ్ విటారా తర్వాత మరో కొత్త SUV ని తీసుకురావాలని సుజుకి భావిస్తోంది. హైబ్రిడ్ వెర్షన్ లో ఈ కారు రావచ్చు. ఫ్రాంక్స్ హైబ్రిడ్ తర్వాత ఈ కారు మార్కెట్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.