సింహాచలం వరాహ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ప్రమాదం జరిగింది. మంగళవారం కురిసిన భారీ వర్షానికి గోడకూలి ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. దీంతోపాటు భారత్, పాకిస్తాన్ ల మధ్య ఉద్రిక్తత వాతవరణానికి సంబంధఇంచిన అప్డేట్స్, ఈ రోజు ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. వీటితో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలన్నీ ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..
11:58 PM (IST) Apr 30
Indian Railway New Rules: 1 మే, 2025 నుండి ఇండియన్ రైల్వే ప్రయాణీకుల టిక్కెట్లకు సంబంధించి పెద్ద మార్పు చేసింది. దీనివల్ల ప్రయాణీకులకు ప్రయాణంలో అసౌకర్యం నుండి ఉపశమనం లభిస్తుంది.
పూర్తి కథనం చదవండి11:50 PM (IST) Apr 30
ఐపీఎల్ 2023లో చెన్నై సూపర్ కింగ్స్ దారుణ ప్రదర్శన కనబరుస్తోంది. వరుస ఓటములతో ప్లేఆఫ్స్ చేరే అవకాశాలు దూరమయ్యాయి... చివరకు ధోని కూడా ఈ టీం ను కాపాడలేకపోయాడు.
పూర్తి కథనం చదవండి11:07 PM (IST) Apr 30
10:49 PM (IST) Apr 30
పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఏప్రిల్ 30 నుండి మే 23 వరకు పాకిస్తాన్ విమానాలు భారత గగనతలంలోకి రాకుండా భారత్ నిషేధం విధించింది.
పూర్తి కథనం చదవండి10:30 PM (IST) Apr 30
చెన్నైలో చాహల్ మాయాజాలం చేశాడు. ఐపీఎల్‌లో హ్యాట్రిక్ సాధించిన క్రికెటర్‌గా నిలిచాడు. ఇదొక్కటే కాదు మరెన్నో అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు చాహల్. అవేంటో ఇక్కడ చూద్దాం.
పూర్తి కథనం చదవండి09:50 PM (IST) Apr 30
సింహాచలంలో దుర్ఘటనతో జగన్ శవరాజకీయాలు చేస్తున్నారని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. గతంలో జరిగిన దుర్ఘటనల్లో జగన్ స్పందించలేదు.. కానీ ఇప్పుడు శవరాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.
పూర్తి కథనం చదవండి09:14 PM (IST) Apr 30
పహల్గాం దాడిలో చనిపోయిన వారికి అమరుల హోదా ఇవ్వాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. దోషులకు కఠిన శిక్ష పడాలని, ప్రతిపక్షాలు ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నాయని ఆయన అన్నారు.
పూర్తి కథనం చదవండి09:11 PM (IST) Apr 30
కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఒక అద్భుతమైన గుడ్ న్యూస్ చెప్పబోతోంది. EPS పెన్షన్ పెంచేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇదే జరిగితే ఇకపై కనీస పెన్షన్‌ను రూ.1,000 నుండి ఏకంగా రూ.3,000కి పెరుగుతుంది. దీనివల్ల 36.6 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుతుంది. ఈ విషయం గురించి మరింత సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం.
08:59 PM (IST) Apr 30
స్వాతంత్య్రం అనంతరం తొలిసారిగా దేశవ్యాప్త కులగణనకు కేంద్రం ఆమోదం తెలిపింది. జనాభా లెక్కలతోపాటు ఈ గణన జరుగుతుంది. ఈ ఢాటా ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో తెలుసా?
పూర్తి కథనం చదవండి08:40 PM (IST) Apr 30
Pakistan India: ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ ఇండియాని దెబ్బతీయాలని చూస్తున్న పాక్ ఆర్థికంగా ఎంత కుదేలైందో తెలుసా? ఆ దేశంలో వస్తువుల ధరలు తెలిస్తే మీకే అర్థమవుతుంది. దీనికి ఉదాహరణే అక్కడ స్మార్ట్ ఫోన్ ధరలు. పాకిస్తాన్ లో ఓ మంచి స్మార్ట్ ఫోన్ కొనుక్కొనే ధరకి ఇండియాలో ఏకంగా కారే కొనుక్కోవచ్చు. ఆ దేశంలో మొబైల్ ధరలు ఎంతో తెలుసుకుందాం రండి.
పూర్తి కథనం చదవండి
08:02 PM (IST) Apr 30
Worlds Longest Train Journey: దేశాలు చుట్టి రావాలని ఎవరికి ఉండదు చెప్పండి. కాని డబ్బు, సమయం రెండు కలిసి రావడం కష్టం. అందుకే తక్కువ టైమ్ లో ఎక్కువ దేశాలు తిరిగి వచ్చే అద్భుతమైన ట్రైన్ జర్నీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి
07:48 PM (IST) Apr 30
కేంద్ర కెబినెట్ జనాభా లెక్కలతో పాటే కులగణన చేపట్టాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు.
పూర్తి కథనం చదవండి07:35 PM (IST) Apr 30
పాకిస్తాన్‌లో చినాబ్ నది ఎండిపోతోందా? దీనికి భారత్ సింధు నది జలాల ఒప్పందం రద్దు కారణమా? అంటే అవుననే ప్రచారం జరుగుతోంది. కొన్ని శాటిలైట్ చిత్రాలు పాకిస్థాన్ లో చీనాబ్ నది పరిస్థితిని తెలియజేస్తున్నాయి.
పూర్తి కథనం చదవండి
07:15 PM (IST) Apr 30
బ్యాంక్ ఖాతా ఉన్న ప్రతీ ఒక్కరికీ ఏటీఎమ్ కార్డు ఉంటుందనే విషయం తెలిసిందే. ఇక ఏటీఎమ్లను ఉపయోగించే క్రమంలో పలు నిబంధనలను అమలు చేస్తుంటారు. వీటిని అధికారులు తరచూ మారుస్తుంటారు. తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం లావాదేవీలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
07:10 PM (IST) Apr 30
Jio 895 recharge plan: రిలయన్స్ జియోలో అనేక బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్‌లు ఉన్నాయి. అందుకే జియోకు దేశవ్యాప్తంగా కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. వీటిల్లో చాలా తక్కువ ధరకే అన్ లిమిటెడ్ కాల్స్, డేటా పొందే ప్లాన్స్ కూడా ఉన్నాయి. రూ.900 కంటే తక్కువ ధరకి లభించే ఓ బెస్ట్, స్పెషల్ ప్లాన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి06:58 PM (IST) Apr 30
సింహాచలం ఆలయంలో చందనోత్సవం సందర్భంగా గోడ కూలి ఏడుగురు భక్తులు మృతి చెందారు. దీంతో బాధిత కుటుంబాలకు ప్రభుత్వం రూ. 25 లక్షల ఆర్థిక సాయం, ఒకరికి ఉద్యోగం ప్రకటించింది.
పూర్తి కథనం చదవండి06:33 PM (IST) Apr 30
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరవాతికి కొత్త ఊపు తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు వేగంగా అడుగులు వేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి అమరావతిపై దృష్టిసారించారు. ఇందులో భాగంగానే మే 2న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అమరావతి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో మోదీ చేతుల మీదుగా జరగనున్న శంకుస్థాపనకు సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
06:21 PM (IST) Apr 30
Road accident in Nellore: ఆంధ్రప్రదేశ్ నెల్లూరులోని పొతిరెడ్డిపాలెం వద్ద ఓ ఇంట్లోకి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఐదుగురు వైద్య విద్యార్థులు ఉన్నారు.
06:15 PM (IST) Apr 30
కేసీఆర్ వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ పాలనే తెలంగాణకు శ్రేయస్కరం అని, కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుందని ఆరోపించారు. ప్రభుత్వ సహకారంతోనే బిఆర్ఎస్ సభ విజయవంతమైందని, తామెలాంటి పథకాలు నిలిపివేయలేదని, కేసీఆర్ ఫామ్‌హౌస్‌కే పరిమితమవుతారని వ్యాఖ్యానించారు.
పూర్తి కథనం చదవండి05:51 PM (IST) Apr 30
Kuldeep Yadav Slap Rinku Singh: ఢిల్లీ క్యాపిటల్స్ vs కోల్ కతా నైట్ రైడర్స్ మ్యాచ్ తర్వాత ఢిల్లీ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ గ్రౌండ్ లో రింకూ సింగ్‌ను చెంపదెబ్బ కొట్టాడు. కుల్దీప్ చెంపదెబ్బతో రింకూ సింగ్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
05:29 PM (IST) Apr 30
డిజిటల్ కంటెంట్ క్రియేటర్ మీషా అగర్వాల్ ఆత్మహత్య చేసుకుంది. ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ తగ్గిపోవడంతో ఆమె డిప్రెషన్‌లోకి వెళ్లి, తన కెరీర్ గురించి ఆందోళన చెందుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
పూర్తి కథనం చదవండి05:06 PM (IST) Apr 30
కృష్ణా జిల్లా కంకిపాడులోని ఆయానా కన్వెన్షన్ కేంద్రంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కుమారుడు నిహార్ వివాహ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకకు తెలుగు రాష్ట్రాల రాజకీయ ప్రముఖులు, న్యాయమూర్తులు, కేంద్ర స్థాయి నాయకులు భారీగా హాజరయ్యారు.
04:48 PM (IST) Apr 30
కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కులగణనకు సిద్దమయ్యింది. దీంతో పాటు మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది ఇవాాళ భేటీ అయిన సూపర్ కేబినెట్. ఆ నిర్ణయాలేంటో తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి04:23 PM (IST) Apr 30
5 blockbuster cricket movies: క్రికెట్ నేపథ్యంలో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలే అందుకున్నాయి. లగాన్ నుంచి నుండి ఎంఎస్ ధోనీ వరకు బాక్సాఫీస్ వద్ద కాలుల వర్షం కురిపించడంతో పాటు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాయి. అలాంటి 5 సూపర్ హిట్ క్రికెట్ స్టోరీతో సాగిన సినిమాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి04:12 PM (IST) Apr 30
తెలంగాణ పదో తరగతి ఫలితాల్లో 92.78% ఉత్తీర్ణత నమోదయ్యింది. మహబూబాబాద్ జిల్లాలో అత్యధికం, వికారాబాద్‌లో అత్యల్ప ఉత్తీర్ణత నమోదయ్యింది.అయితే ఓ రెండు స్కూళ్లలో మాత్రం కనీసం ఒక్కరు కూడా పాస్ కాలేదు.
పూర్తి కథనం చదవండి03:51 PM (IST) Apr 30
Simhachalam: సింహాచలంలో శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి (సింహాద్రి అప్పన్న స్వామి) ఆలయంలో గోడ కూలి ఎనిమిది మంది భక్తులు మరణించిన ఘటనపై తనను కలిచివేసిందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, వైస్ జగన్ మోహన్ రెడ్డి, షర్మిల సహా పలువురు లీడర్లు స్పందించారు.
03:50 PM (IST) Apr 30
విక్టరీ డే వేడుకల్లో పాల్గొనడానికి మోడీ రష్యా వెళ్లట్లేదు. క్రెమ్లిన్ ప్రతినిధి దీన్ని ధృవీకరించారు. అయితే అధికారిక కారణం ఇంకా తెలియరాలేదు.
పూర్తి కథనం చదవండి02:39 PM (IST) Apr 30
అమరావతిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే 2న ఆంధ్రప్రదేశ్ విచ్చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పర్యటన సందర్భంగా రోడ్ షో, బహిరంగ సభ, అభివృద్ధి పనుల ప్రారంభ కార్యక్రమాల్లో మోదీ పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో మోదీ పర్యటనకు ఏపీ ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేస్తోంది.? ఎంత మంది హాజరుకానున్నారు.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
02:14 PM (IST) Apr 30
Bhoodan Land Case: భూదాన్ భూముల కేసులో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. వాదనలు సింగిల్ బెంచ్‌లోనే వినిపించాలంటూ సీనియర్ ఐపీఎస్ సహా పలువురు ఉన్నతాధికారులకు షాక్ ఇచ్చింది.
01:48 PM (IST) Apr 30
కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో సూర్య నటించిన రెట్రో సినిమా మే 1న విడుదల కానుంది. ఈ సినిమాను మిస్సవ్వకూడని 10 కారణాలను ఇక్కడ చూడండి.
పూర్తి కథనం చదవండి01:31 PM (IST) Apr 30
AI డీప్‌ఫేక్ కంటెంట్ , సైబర్ బుల్లీయింగ్‌పై మౌని రాయ్ చేసిన ఘాటైన వ్యాఖ్యలు డిజిటల్ స్థలంలో కఠినమైన నిబంధనలు, నైతిక పరిశీలనల అవసరాన్ని నొక్కి చెబుతున్నాయి
పూర్తి కథనం చదవండి
01:21 PM (IST) Apr 30
Migraine Relief: మీరు గాని, మీ ఇంట్లో గాని మైగ్రేన్ నొప్పితో బాధపడుతున్నారా? ఈ సమస్య నుండి తక్షణం రిలీఫ్ పొందడానికి ఈ ఇంటి చిట్కాలు పాటిస్తే చాలు. త్వరగా రికవరీ అవుతారు. అవేంటో తెలుసుకుందామా?
పూర్తి కథనం చదవండి01:17 PM (IST) Apr 30
Simhachalam: సింహాచలంలో శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో గోడ కూలి 8 మంది భక్తులు మరణించిన ఘటనపై ముగ్గురు సభ్యుల కమిటీతో దర్యాప్తు చేపట్టారు. 72 గంటల్లో ప్రాథమిక నివేదిక అందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలిచ్చారు.
12:46 PM (IST) Apr 30
iPhone 17: ఐఫోన్ అభిమానులు 17 సిరీస్ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇటీవల యాపిల్ కంపెనీ ఓ నిర్ణయం తీసుకుందట. దాని వల్ల ఓ ఐఫోన్ ను ప్రొటెక్ట్ చేసే చక్కటి ఫీచర్ 17 సిరీస్ లో ఉండదని వార్తలు వస్తున్నాయి. అదేంటో తెలుసుకుందాం రండి.
పూర్తి కథనం చదవండి12:39 PM (IST) Apr 30
Simhachalam: సింహాచలంలో శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి (సింహాద్రి అప్పన్న స్వామి) ఆలయంలో గోడ కూలి ఎనిమిది మంది భక్తులు మరణించిన ఘటనపై ముగ్గురు సభ్యుల కమిటీతో దర్యాప్తు చేపడతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
పూర్తి కథనం చదవండి12:36 PM (IST) Apr 30
ISC 12వ తరగతి ఫలితాలు వచ్చేసాయి. 99.02% మంది పాసయ్యారు. గత సంవత్సరం కంటే ఈసారి ఫలితాలు కాస్త తగ్గాయి. అయితే, ఆడపిల్లలు మళ్ళీ బాగా రాణించి అబ్బాయిల కంటే మెరుగైన ప్రతిభ కనబరిచారు.
పూర్తి కథనం చదవండి12:28 PM (IST) Apr 30
హర్యానాకి చెందిన అమిత్ భదానా బ్యాంక్ ఉద్యోగం వదిలేసి, తన కుటుంబ వ్యాపారమైన పాల వ్యాపారాన్ని తన ఆడీ కారులో చేస్తున్నాడు. మొదట్లో బైక్ మీద పాలు పంపిణీ చేసేవాడు, ఇప్పుడు ఆడీ కారులో పాలు ఇస్తుంటే జనాలు ఆశ్చర్యపోతున్నారు.
పూర్తి కథనం చదవండి12:17 PM (IST) Apr 30
Vaibhav Suryavanshi Age Controversy: వైభవ్ సూర్యవంశీ క్రికెట్ ప్రపంచంలో సంచలనం. 12 ఏళ్లకే దేశవాళీ క్రికెట్, 14 ఏళ్లకే ఐపీఎల్ ఎంట్రీతో వైరల్ గా మారాడు. ఐపీఎల్ 2025లో సెంచరీ కొట్టిన యంగెస్ట్ ప్లేయర్ గా చరిత్ర సృష్టించాడు. అయితే, వైభవ్ సూర్యవంశీ నిజంగానే 14 ఏళ్ల కుర్రాడా? లేదా మోసం చేశాడా? బీసీసీఐ బోన్ టెస్టు రిపోర్టులో ఏం తేలింది? వైభవ్ సూర్యవంశీ వయస్సు వివాదంలో నిజాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
12:14 PM (IST) Apr 30
తెలంగాణలో పదో తరగతి పరీక్షలకు హాజరైన విద్యార్థులు, వారి పేరెంట్స్ రిజల్ట్స్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. బుధవారం మధ్యాహ్నం ఫలితాలు విడుదల చేయనున్నట్లు అధికారులు ఇది వరకే ప్రకటించారు. అయితే ఫలితాల విడుదల ఆలస్యం కానుందని తెలుస్తోంది.
11:51 AM (IST) Apr 30
భారత్, పాకిస్తాన్‌ల మధ్య ఉద్రికత్తలు పెరుగుతున్నాయి. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత రెండు దేశాల మధ్య పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఈ దాడి వెనకాల పాకిస్థాన్ హస్తం ఉందని భారత్ ఆధారాలతో సహా నిరూపిస్తోంది. అయితే పాక్ మాత్రం తమ తప్పులేదని చెబుతూనే మరోవైపు కవ్వింపు చర్యలకు దిగుతోంది. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య జరుగుతోన్న పరిణామాలు ఇప్పుడు చూద్దాం.