తెలంగాణ‌లో ప‌దో త‌ర‌గతి ప‌రీక్ష‌ల‌కు హాజ‌రైన విద్యార్థులు, వారి పేరెంట్స్ రిజ‌ల్ట్స్ కోసం ఎంతో ఆతృత‌గా ఎదురు చూస్తున్న విష‌యం తెలిసిందే. బుధ‌వారం మ‌ధ్యాహ్నం ఫ‌లితాలు విడుద‌ల చేయనున్న‌ట్లు అధికారులు ఇది వ‌ర‌కే ప్ర‌క‌టించారు. అయితే ఫ‌లితాల విడుద‌ల ఆల‌స్యం కానుంద‌ని తెలుస్తోంది.  

తెలంగాణ పదో తరగతి విద్యార్థులు రిజ‌ల్ట్స్ కోసం మ‌రికొంత స‌మ‌యం వేచి చూడాల్సిందే. టెన్త్ పరీక్షల ఫలితాలు ఈ రోజు (బుధవారం) విడుదల కానున్నాయని రాష్ట్ర విద్యాశాఖ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. మొదట మధ్యాహ్నం 1 గంటకు ఫలితాల విడుదల ఉంటుందని తెలియజేసినా, తరువాత సమయాన్ని 1.15కు మార్చింది. అయితే ఇప్పుడు తాజాగా మరోసారి ఫ‌లితాలు ఆల‌స్యం కానున్న‌ట్లు ప్ర‌క‌టించారు. 

తాజా సమాచారం ప్రకారం, టెన్త్ క్లాస్ ఫలితాలను మధ్యాహ్నం 2.15 గంటలకు విడుదల చేసే అవకాశం ఉంది. విద్యార్థులు, తల్లిదండ్రులు ఫ‌లితాల కోసం ఎంతో ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు. ఫలితాలు ఆల‌స్యం కావ‌డాఇన‌కి తాత్కాలిక సాంకేతిక స‌మ‌స్య‌లే కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. విద్యార్థులు తమ ఫలితాలను తెలంగాణ ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్స్ bse.telangana.gov.in, results.bse.telangana.gov.in లో చెక్ చేసుకోవచ్చు.