తెలంగాణ పదో తరగతి ఫలితాల్లో 92.78% ఉత్తీర్ణత నమోదయ్యింది. మహబూబాబాద్ జిల్లాలో అత్యధికం, వికారాబాద్‌లో అత్యల్ప ఉత్తీర్ణత నమోదయ్యింది.అయితే ఓ రెండు స్కూళ్లలో మాత్రం కనీసం ఒక్కరు కూడా పాస్ కాలేదు.
Tenth Results : తెలంగాణలో పదో తరగతి పలితాలు వెలువడ్డాయి. పరీక్షలు రాసినవారిలో 92.78 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలికలు 94.26 శాతం, బాలురు 91.32 శాతం మంది పాసయ్యారు... అంటే ఈసారి కూడా అమ్మాయిలే పైచేయి సాధించారు.
రెసిడెన్షియల్ పాఠశాలలో 98.79 శాతం, బీసీ వెల్ఫేర్ పాఠశాలో 97.79 % , సోషల్ వెల్ఫేర్ 97.1 శాతం, ట్రైబల్ వెల్ఫేర్ 97.63 శాతం ఉత్తీర్ణత సాధించడం విశేషం. ఇక మైనార్టీ రెసిడెన్షియల్ 96.57 శాతం, మోడల్ స్కూల్స్ 95.31 శాతం, ఆశ్రమ పాఠశాలలో 95 శాతం, కస్తూర్బా గాంధీ బాలికా విద్యార్థులకు 94.42 శాతం పాస్ అయ్యారు. ప్రైవేట్ పాఠశాలలో 94.21 శాతం ఉత్తీర్ణత సాధించారు.
పదోతరగతి పలితాల్లో ఆసక్తికర విషయం ఏమిటంటే రాష్ట్రంలోని రెండు స్కూళ్లలో జీరో శాతం ఉత్తీర్ణత నమోదయ్యింది అంటే 100 శాతం విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. ఈ స్కూళ్లలో కనీసం ఒక్క విద్యార్థి కూడా పాస్ కాలేదు.
రాష్ట్రంలో అత్యధిక ఉత్తీర్ణతశాతం మహబూబాబాద్ జిల్లాలో నమోదయ్యింది... ఇక్కడ 99.29 శాతం మంది పాసయ్యారు. అత్యల్పంగా వికారాబాద్ జిల్లాలో ఉత్తీర్ణత నమోదయ్యింది. ఇక్కడ కేవలం 73.97 శాతం విద్యార్థులే ఉత్తీర్ణులయ్యారు.
సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ :
పదో తరగతి పరీక్షల్లో ఫెయిలైనవారికోసం వెంటనే అడ్వాన్సుడ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షల షెడ్యూల్ ను కూడా ప్రకటించారు. జూన్ 3 నుండి 13 వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఎస్సెస్సి బోర్డ్ ప్రకటించింది. మే 16 వరకు ఫీజు చెల్లించడానికి సమయం ఇచ్చారు.
ఇక మార్కులు తక్కువగా వచ్చాయని అనుమానంగా ఉంటే రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. సబ్జెక్టుకు రూ.500 చెల్లించి రీకౌంటింగ్, సబ్జెక్టుకు రూ.1000 కడితే రీవెరిఫికేషన్ చేస్తారు. ఇందుకోసం మే 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.


