చెన్నైలో చాహల్ మాయాజాలం చేశాడు. ఐపీఎల్‌లో హ్యాట్రిక్ సాధించిన క్రికెటర్‌గా నిలిచాడు. ఇదొక్కటే కాదు మరెన్నో అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు చాహల్. అవేంటో ఇక్కడ చూద్దాం. 

CSK vs PBKS : ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో మరో సంచలనం నమోదయ్యింది. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో యజువేందర్ చాహల్ మాయాజాలం కొనసాగింది. అతడు కేవలం ఒకే ఓవర్లో ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టాడు... ఇందులో మూడు వికెట్లు వరుస బంతుల్లో పడగొట్టడం విశేషం. ఇలా ఈ ఐపిఎల్ సీజన్ హ్యాట్రిక్ సాధించిన క్రికెటర్ గా చాహల్ నిలిచాడు. 

చెన్నై సూపర్ కింగ్స్ పై ఈ ఫీట్ సాధించాడు చాహల్. సొంతమైదానంలో చెన్నై చెలరేగి ఆడుతున్న సమయంలో చాహల్ మణికట్టు మాయాజాలం చేసాడు. 18 ఓవర్లో మహేంద్రసింగ్ ధోనిని ముందుగా ఔట్ చేసాడు చాహల్. మధ్యలో ఓ బంతి మిస్ అయ్యింది. తర్వాత మూడు బంతులకు దీపక్ హుడా, అన్షుల్, నూర్ అహ్మద్ ల వికెట్లు పడగొట్టి హ్యాట్రిక్ సాధించాడు. చాహల్ దెబ్బకు 200 దాటుతుందనుకున్న చెన్నై స్కోరు 191 కే పరిమితం అయ్యింది. 

Scroll to load tweet…

ఒకే ఒక్క ఓవర్ తో చాహల్ రికార్డు మోత : 

చెన్నై సూపర్ కింగ్స్ పై చాహల్ హ్యాట్రిక్ సాధించడం ద్వారా ఎన్నో రికార్డులు బద్దలుగొట్టాడు. ఈ ఒక్క ఓవర్ ద్వారా చాహల్ సాధించిన రికార్డులేమిటో పరిశీలిద్దాం.

1. ఐపిఎల్ లో అత్యధికసార్లు 4 కంటే ఎక్కువ వికెట్లు పడగొట్టిన ఆటగాడిగా చాహల్ నిలిచాడు. అతడు 9 సార్లు 4 కంటే ఎక్కువ వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత 8 సార్లు సునీల్ నరైన్, 7 సార్లు లసిత్ మలింగ, 6 సార్లు రబడ ఫోర్ ప్లస్ వికెట్లు పడగొట్టారు. 

2. ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు పడగొట్టడం ద్వారా చాహల్ పేరిట మరో రికార్డు నమోదయ్యింది. ఇలా ఇప్పటివరకు రెండుసార్లు ఒకే ఓవర్లో నాలుగు వికెట్ల ఫీట్ సాధించాడు చాహల్. గతంలో 2022 ఐపిఎల్ సీజన్లో కూడా ఇలాగే నాలుగు వికెట్లు తీసాడు. ఇలా చాహల్ తర్వాత ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు తీసిన ఆటగాళ్లు అమిత్ మిశ్రా, ఆండ్రీ రస్సెల్ మాత్రమే.

3. ఐపిఎల్ లో అత్యధికసార్లు హ్యాట్రిక్ సాధించిన ఆటగాడిగా అమిత్ మిశ్రా నిలిచాడు. అతడు 3 సార్లు హ్యాట్రిక్ సాధించాడు. ఆ తర్వాతి స్థానం చాహల్ దే... అతడు రెండుసార్లు హ్యాట్రిక్ వికెట్లు తీసాడు. యువరాజ్ సింగ్ కూడా రెండుసార్లు హ్యాట్రిక్ సాధించాడు. 

4. పంజాబ్స్ టీంలో ఇప్పటివరకు హ్యాట్రిక్ వికెట్లు తీసిన బౌలర్లు ముగ్గురున్నారు... చాహల్ నాలుగోవాడు. అంతకుముందు యువరాజ్ సింగ్, అక్షర్ పటేల్, సామ్ కర్రమ్ లు హ్యాట్రిక్ సాధించారు. ఇప్పుడు చాహల్ ఆ పని చేసాడు. 

5. చెన్నై సూపర్ కింగ్స్ పై మొదటి హ్యాట్రిక్ సాధించిన ఏకైక బౌలర్ గా చాహల్ నిలిచాడు. అలాగే చెపాక్ లో చివరగా 2008 లో బాలాజి హ్యాట్రిక్ సాధించాడు... మళ్లీ ఇప్పుడే అక్కడ హ్యాట్రిక్ వికెట్లు పడటం.