జియో బంపర్ ఆఫర్: రూ.895కే ఏడాది పొడవునా అన్ లిమిటెడ్ కాల్స్, డేటా
Jio 895 recharge plan: రిలయన్స్ జియోలో అనేక బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్‌లు ఉన్నాయి. అందుకే జియోకు దేశవ్యాప్తంగా కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. వీటిల్లో చాలా తక్కువ ధరకే అన్ లిమిటెడ్ కాల్స్, డేటా పొందే ప్లాన్స్ కూడా ఉన్నాయి. రూ.900 కంటే తక్కువ ధరకి లభించే ఓ బెస్ట్, స్పెషల్ ప్లాన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

జియో తన కోట్లాది మంది వినియోగదారులకు అనేక ప్లాన్‌లను అందిస్తోంది. కస్టమర్ల సౌలభ్యం కోసం రీఛార్జ్ పోర్ట్‌ఫోలియోను అనేక విభాగాలుగా కూడా విభజించింది. జియోలో అనేక ప్రీపెయిడ్ ప్లాన్స్ ఉన్నాయి. అందులో చాలా తక్కువ ధరకే అపరిమిత కాల్స్, డేటా ఆఫర్‌లు ఇచ్చే ప్లాన్స్ కూడా ఉన్నాయి. అలాంటి బెస్ట్ రీఛార్జ్ ప్లాన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
రూ.895 కే ప్రత్యేక ప్లాన్
జియో అందిస్తున్న ఈ ప్రత్యేకమైన ప్లాన్ రూ.900 కంటే తక్కువ ధరకే దాదాపు ఒక సంవత్సరం వ్యాలిడిటీని అందిస్తుంది. ఈ ప్లాన్ అసలు ధర రూ.895. అంటే ఈ ప్లాన్ రోజువారీ ఖర్చు కేవలం రూ.2.66 మాత్రమే. అంటే రోజుకు రూ.3 కంటే తక్కువ ఖర్చు చేయడం ద్వారా డేటా, SMS, కాల్స్ ప్రయోజనాలను పొందవచ్చు.
336 రోజుల వ్యాలిడిటీ
రిలయన్స్ జియో అందిస్తున్న ఈ రూ.895 ప్లాన్ వ్యాలిడిటీ 336 రోజులు. అంటే దాదాపు 11 నెలల వరకు మీరు ఈ ప్లాన్ వాడుకోవచ్చు. ఈ ప్లాన్‌లో చేరితే మీరు ఏ నెట్‌వర్క్‌లోనైనా ఎవరితోనైనా 336 రోజుల పాటు అన్ లిమిటెడ్ కాల్స్ మాట్లాడవచ్చు.
ఈ ప్లాన్‌లో మొత్తం 600 SMSలు
ఈ ప్లాన్ రీఛార్జ్ చేయించుకున్న వారు 28 రోజులకు 50 ఉచిత SMSలు పొందుతారు. అంటే మొత్తం 12 సార్లు నెలకు 50 ఉచిత SMSలను పొందుతారు. అంటే ఈ ప్లాన్‌లో మొత్తం 600 SMSలు లభిస్తాయి.
ఈ ప్లాన్‌లో ఇంత డేటా లభిస్తుంది
ఈ ప్లాన్‌లో మీకు మొత్తం 24 GB డేటా లభిస్తుంది. అందులోనూ మీకు 28 రోజులకు 2 GB డేటా మాత్రమే లభిస్తుంది. 12 నెలలకు ప్రతి 28 రోజులకు 2 GB డేటా లభిస్తుంది. మీకు ఎక్కువ ఇంటర్నెట్ అవసరం లేకపోతే ఈ ప్లాన్ సరిపోతుంది.
ఈ ప్రత్యేక ప్లాన్ ఈ జియో వినియోగదారులకు మాత్రమే
రూ.895 రీఛార్జ్ ప్లాన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే మీరు కచ్చితంగా జియోఫోన్ వినియోగదారులు అయి ఉండాలి. సాధారణ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ఈ ప్లాన్‌ను ఉపయోగించుకోలేరు. ఈ ప్లాన్ ద్వారా, జియో టీవీ, జియో క్లౌడ్ ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ను కూడా పొందవచ్చు. సాధారణ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు తమ సిమ్‌ను 336 రోజులు యాక్టివ్‌గా ఉంచుకోవడానికి రూ.1748 ప్లాన్ ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు.