ఎన్టీఆర్ బయోపిక్: ‘తల్లా పెళ్లామా' నాటి రోజుల్లోకి వెళ్లి...

By Udayavani DhuliFirst Published Nov 10, 2018, 9:23 AM IST
Highlights

"తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది తెలంగాణ నాది రాయలసీమ నాది సర్కారు నాది నెల్లూరు నాది అన్నీ కలసిన తెలుగునాడు మనదే మనదే మనదేరా తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది"..

"తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది తెలంగాణ నాది రాయలసీమ నాది సర్కారు నాది నెల్లూరు నాది అన్నీ కలసిన తెలుగునాడు మనదే మనదే మనదేరా తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది"..ఈ గీతాన్ని గుర్తు పెట్టుకోని తెలుగువారు ఎవరు ఉంటారు..

మహానటుడు ఎన్‌.టి. రామారావు తన సినిమా ‘తల్లా పెళ్లామా' చిత్రానికి తెలుగుభాషపై ఒక గీతం రాయమని కోరగా, మహాకవి సి.నారాయణరెడ్డి రాసి యిచ్చిన గేయమే ఇది. ఈ గీతం నేపధ్యాన్ని ఇప్పుడు తెరపై చూడబోతున్నాం.

దివంగత నటుడు, తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు జీవితం ఆధారంగా ఎన్టీఆర్ బయోపిక్‌ను డైరెక్టర్ క్రిష్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. వెండితెరపైనే కాకుండా రాజకీయంగా తెలుగు ప్రజల జీవితాలపై చెరగని ముద్ర వేసిన ఎన్టీఆర్ జీవితాన్ని తెరపై చూడటం కోసం ప్రేక్షకులు రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

ఈ నేపధ్యంలో ఈ చిత్రంలో కీలకమైన పాత్రల కోసం...ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్న ఆర్టిస్ట్ లను మాత్రమే కాకుండా జనాలకు పరిచయం ఉన్న సినీ సెలబ్రెటీలను సైతం సీన్ లోకి తీసుకు వస్తున్నారు. అలాగే ఇప్పుడు  తన కవితలతో, సినీ పాటలతో తనకంటూ ఓ ముద్ర వేసుకున్న ప్రముఖ పాటల రచయిత సి.నారాయణరెడ్డి పాత్రకు మరో లిరిక్  రామ జోగయ్య శాస్త్రిని ఒప్పించి వేషం వేయిస్టున్నట్లు సమాచారం. ఈ మేరకు మేకప్ టెస్ట్ జరిగిందని, షూటింగ్ కూడా రెండు మూడు రోజుల్లో ప్రారంభం కాబోబోతోందని చెప్తున్నారు.

ఇక నిజ జీవితంలో ఎన్టీఆర్ కు సినారెకు మంచి సన్నిహిత సంబంధాలు ఉండేవి. కవి అయిన సినారెను ఎన్టీఆర్  సినిమాల్లోకి తీసుకు వచ్చి పాటల రచయితను చేసారు. సినారే తన సినీ కెరీర్ లో ఎన్నో ఆణిముత్యాలు లాంటి పాటలు అందించారు. ముఖఅయంగా చారిత్రాత్మక - పౌరాణిక చిత్రాల పాటలకు ఆయనది అందెవేసిన చేయి. 

దాంతో లెంగ్త్ ఎక్కువ అవుతుందని మొదట వద్దనుకున్నా...ఇప్పడు ఎలాగో రెండు పార్ట్ లు తీస్తుున్నాం కదా అని సినారే పాత్రను ఈ బయోపిక్ లోకి తీసుకువచ్చారు. రామజోగయ్య శాస్త్రి చేత ..సినారే రాసిన కొన్ని కవితలుని ఎన్టీఆర్ సమక్షంలో గానం చేయటం జరగుతుందని...తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది పాటను గుర్తు చేస్తారని చెప్పుకుంటున్నారు.

సంబంధిత వార్తలు.. 

ఎన్టీఆర్ బయోపిక్ లో బాహుబలి హీరోయిన్!

బాలయ్య 'అల్లూరి సీతారామరాజు' అవతారం!

'ఎన్టీఆర్' బయోపిక్: క్రిష్ రీషూట్ చేస్తాడా..?

ఎన్టీఆర్ బయోపిక్: దాసరి పాత్రలో మాస్ డైరెక్టర్!

మహేష్ కోసం 'ఎన్టీఆర్' ఎదురుచూపులు!

ఎన్టీఆర్ బయోపిక్: ఇంట్రెస్టింగ్ అప్డేట్..ఎన్టీఆర్ ప్రేమ కథ!

పెళ్లి పీటలెక్కిన బాలకృష్ణ!

బయోపిక్ లో ఎన్టీఆర్.. క్రిష్ ఏమన్నాడంటే..?

'ఎన్టీఆర్' బయోపిక్: రానా పాత్రపై షాకింగ్ న్యూస్

ఎన్టీఆర్ బయోపిక్: లక్ష్మీపార్వతిగా సీనియర్ హీరోయిన్..!

ఎన్టీఆర్ బయోపిక్ లో భూతాల రాజు!

'బయోపిక్' లో ఎన్టీఆర్ ఉంటాడు కానీ..!

ఎన్టీఆర్ బయోపిక్ లో తారక్.. అసలు నిజమేమిటంటే..?

వేటగాడి గెటప్ లో బాలయ్య!

ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్2: 'మహానాయకుడు'!

'ఎన్టీఆర్' బయోపిక్ టైటిల్.. @కథానాయకుడు!

రెండు భాగాలుగా 'ఎన్టీఆర్' బయోపిక్!

ఎన్టీఆర్ ని పరిగెత్తిస్తున్న క్రిష్!

ఎన్టీఆర్ పిక్ వైరల్.. రిక్షా తొక్కిన బాలయ్య!

ఎన్టీఆర్ బయోపిక్ లో రకుల్.. అచ్చం శ్రీదేవిలానే!

ఎన్టీఆర్‌ భార్యగా విద్యాబాలన్ గెటప్!

ఎన్టీఆర్ సినిమా అందుకే ఒప్పుకోలేదు.. కీర్తి సురేశ్ కామెంట్స్!

పిక్ టాక్: ఎన్టీఆర్ తో నందమూరి హరికృష్ణ

click me!