బాలయ్య బాగా పొట్టి అయ్యాడా?...ఈ కామెంట్స్ ఏంటి

By Udayavani DhuliFirst Published Nov 21, 2018, 9:17 AM IST
Highlights

బాలయ్య చేస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ ని ఓ వర్గం అద్బుతం అంటూంటే మరో వర్గం అందులో లోపాలు ఏమన్నా ఉన్నాయా అని వెతుకుతోంది. సినిమా రిలీజ్ కాకుండానే ఈ రచ్చ మొదలైంది. 

బాలయ్య చేస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ ని ఓ వర్గం అద్బుతం అంటూంటే మరో వర్గం అందులో లోపాలు ఏమన్నా ఉన్నాయా అని వెతుకుతోంది. సినిమా రిలీజ్ కాకుండానే ఈ రచ్చ మొదలైంది. తాజాగా ఈ చిత్రం గురించి కొన్ని మీడియా వర్గాలు చిత్రమైన కామెంట్స్ ని ప్రచారంలోకి తెలుస్తోంది. అందులో ఒకటి..ఆ సినిమాలో బాలయ్య పొట్టిగా ఉన్నాడని. వారు చెప్పేదేమిటంటే...ఎన్టీఆర్ ఆజానుబాహుడు. ఆరుడుగుల మనిషి. బాలయ్య తన తండ్రి అంత ఎత్తులేడు అని వారి కంప్లైంట్. 

ఎన్టీఆర్ గా బాలయ్య తేలిపోతున్నాడని అంటున్నారు. అయితే బయోపిక్ తీసేటప్పుడు యాజటీజ్ ..ఒరిజనల్ మనిషిని పోలిన వాళ్లు దొరకటం మాత్రం కష్టమే అనేది మాత్రం మర్చిపోకూడదు. అయితే తేజ దర్శకత్వంలో ఈ సినిమా ప్రారంభమయ్యినప్పుడు దుర్యోధనుడుగా బాలయ్య స్టిల్స్ వచ్చినప్పుడు ఇలాగే సెటైర్స్ పడ్డాయి. ఎన్టీఆర్ ఏంటి ఇలా ఉన్నాడు అని అన్నారు. 

ఎందుకంటే ఆ స్టిల్ లో బాలయ్యే ప్రధానంగా కనిపించారు. అయితే క్రిష్ ఈ విమర్శలు దృష్టిలో పెట్టుకుని సాధ్యమైనంతవరకూ అటువంటివి రిపీట్ కాకుండా జాగ్రత్తపడ్డారని ఆ తర్వాత వచ్చిన స్టిల్స్ ని బట్టి అర్దమైంది. ఇంతలా ఉన్నా రీసెంట్ గా బయిటకువచ్చిన మైక్ ముందు బాలయ్య ప్రసంగిస్తున్న స్టిల్ లో ఎదురుగా క్రిష్ ఉంటారు. క్రిష్ కన్నా బాలయ్య పొట్టిగా కనిపించారు. అలాగే మైక్ కు తగ్గ ఎత్తులో కనపడలేదని అన్నారు. 

అయితే ఇవన్నీ సినిమా రిలీజ్ కాకుండా ఏవో పోస్టర్స్ చూసి చేసే విమర్శలు. సినిమా మొదలవగానే కథ,కథనం సరిగ్గా ఉంటే ఎక్కడా ఇలాంటి ఆలోచనలు రావు.  ముఖ్యంగా బయోపిక్ అనగానే...జనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు అంటే...ఎన్టీఆర్ జీవితంలో జరిగిన సంఘటనలు తెరకు ఎలా ఎక్కించారా అని..అలాగే తాము చూసిన ఎన్టీఆర్ సినిమాలో సన్నివేశాలు తీసేటప్పుడు ఎలా ఉండేవారు...ఆ రోజులు గుర్తు చేస్తున్నారా వంటివి చూడటానికి ఆసక్తి చూపుతారు. అప్పుడు ఈ పొట్టి,పొడుగు కామెంట్స్ పొరపాటున కూడా రావు. ఏమంటారు. 

సంబంధిత వార్తలు.. 

ఎన్టీఆర్ 'కథానాయకుడు' ప్రీరిలీజ్ ఫంక్షన్ కి భారీ ప్లాన్!

ఎన్టీఆర్ లవ్ స్టోరీ చూపించరా..?

ఎన్టీఆర్ బయోపిక్.. సెకండ్ పార్ట్ లో స్టార్ హీరోలు!

'ఎన్టీఆర్ బయోపిక్' లో కృష్ణకుమారిగా ఆమెనే ఫైనల్

ఎన్టీఆర్ బయోపిక్ లో బాహుబలి హీరోయిన్!

బాలయ్య 'అల్లూరి సీతారామరాజు' అవతారం!

'ఎన్టీఆర్' బయోపిక్: క్రిష్ రీషూట్ చేస్తాడా..?

ఎన్టీఆర్ బయోపిక్: దాసరి పాత్రలో మాస్ డైరెక్టర్!

మహేష్ కోసం 'ఎన్టీఆర్' ఎదురుచూపులు!

ఎన్టీఆర్ బయోపిక్: ఇంట్రెస్టింగ్ అప్డేట్..ఎన్టీఆర్ ప్రేమ కథ!

పెళ్లి పీటలెక్కిన బాలకృష్ణ!

బయోపిక్ లో ఎన్టీఆర్.. క్రిష్ ఏమన్నాడంటే..?

'ఎన్టీఆర్' బయోపిక్: రానా పాత్రపై షాకింగ్ న్యూస్

ఎన్టీఆర్ బయోపిక్: లక్ష్మీపార్వతిగా సీనియర్ హీరోయిన్..!

ఎన్టీఆర్ బయోపిక్ లో భూతాల రాజు!

'బయోపిక్' లో ఎన్టీఆర్ ఉంటాడు కానీ..!

ఎన్టీఆర్ బయోపిక్ లో తారక్.. అసలు నిజమేమిటంటే..?

వేటగాడి గెటప్ లో బాలయ్య!

ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్2: 'మహానాయకుడు'!

'ఎన్టీఆర్' బయోపిక్ టైటిల్.. @కథానాయకుడు!

రెండు భాగాలుగా 'ఎన్టీఆర్' బయోపిక్!

ఎన్టీఆర్ ని పరిగెత్తిస్తున్న క్రిష్!

click me!