
లైఫ్ లో తొందరగా సెటిల్ అవ్వాలా? ఫాలో అవ్వాల్సిన గోల్డెన్ రూల్ ఇదే
ఈ రోజుల్లో మంచి జీతం రావడం ఒక్కటే సరిపోదు.. వచ్చిన డబ్బును సరిగ్గా నిర్వహించడం కూడా చాలా ముఖ్యం. 'ఈరోజే జీతం పడింది.. అప్పుడే అకౌంట్ ఖాళీ అయిపోయింది' అని చాలా మంది బాధపడుతుంటారు. మరి మీ జీతం ఎటు పోతుందో మీకు తెలుసా? దీనికి చెక్ పెట్టడానికే ఆర్థిక నిపుణులు ఒక సూపర్ ఫార్ములాను సూచిస్తున్నారు. అదే '50-30-20 రూల్'. నెలకు లక్ష రూపాయలు సంపాదించినా, లేదా ఇరవై వేలు సంపాదించినా.. ఈ సింపుల్ రూల్ పాటిస్తే మీ ఖర్చులు కంట్రోల్ అవుతాయి, మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. అసలు ఏంటి ఈ ఫార్ములా? దీన్ని ఎలా వాడాలో ఇప్పుడు చూద్దాం.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండి