ఎన్టీఆర్ నాలుగో కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి ఆత్మహత్య...అనారోగ్య సమస్యలే కారణమా..?

ఎన్టీఆర్ కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకున్నారు. 

Share this Video

ఎన్టీఆర్ కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఉమామహేశ్వరి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మానసిక ఒత్తిడి, అనారోగ్య సమస్యలతోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడి వుండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఉమామహేశ్వరి మరణవార్త తెలుసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, సినీనటుడు బాలకృష్ణ ఆమె ఇంటికి చేరుకున్నారు. ఐపీసీ సెక్షన్ 174 కింద అనుమానాస్పద మృతి కేసు నమోదు చేశారు పోలీసులు. పోస్ట్‌మార్టం అనంతరం భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు.

Related Video