దేశంలో మొట్టమొదటి కోవిద్19 హాస్పిటల్..కట్టించిన ముఖేష్ అంబానీ
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) దేశంలోనే మొట్టమొదటి కోవిద్19 ఆసుపత్రిని ముంబైలో ఏర్పాటు చేసింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) దేశంలోనే మొట్టమొదటి కోవిద్19 ఆసుపత్రిని ముంబైలో ఏర్పాటు చేసింది. దీనికి రిలయన్స్ ఫౌండేషన్ నిధులు సమకూరుస్తుంది. దీంట్లో క్రాస్ కంటామినేషన్ కాకుండా సదుపాయం ఉంది. కరోనావైరస్ బారినపడినవారికి అవసరమైన మౌలిక సదుపాయాలు, వెంటిలేటర్లు, పేస్‌మేకర్స్, డయాలసిస్ యంత్రాలు, రోగి పర్యవేక్షణ పరికరాలు వంటి బయోమెడికల్ పరికరాలు అన్నీ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. మహారాష్ట్రలో ఇప్పటివరకు 101 పాజిటివ్ కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి.