దుర్గాదేవి నిమజ్జనోత్సవాల్లో అపశ్రుతి... ఆకస్మిక వరదల వల్ల పశ్చిమబెంగాల్ లో 8 మంది మృతి, పలువురి గల్లంతు..!
పశ్చిమ బెంగాల్ : దేవీ నవరాత్రి వేడుకల్లో భాగంగా ఏర్పాటుచేసిన దుర్గా దేవి విగ్రహ నిమజ్జనం పశ్చిమ బెంగాల్ లో మారణహోమం సృష్టించింది.
పశ్చిమ బెంగాల్ : దేవీ నవరాత్రి వేడుకల్లో భాగంగా ఏర్పాటుచేసిన దుర్గా దేవి విగ్రహ నిమజ్జనం పశ్చిమ బెంగాల్ లో మారణహోమం సృష్టించింది. జల్పాయిగురి జిల్లాలోని మాల్ బజార్ పట్టణంలో తొమ్మిదిరోజులపాటు పూజలందుకున్న దుర్గమ్మ విగ్రహ నిమజ్జన కార్యక్రమం ఘనంగా జరిగింది. రాత్రి వరకు ఊరేగింపు చేపట్టి దగ్గర్లోని మాల్ నదిలో నిమజ్జనం చేపట్టారు. అయితే ఈ నిమజ్జనాన్ని చూసేందుకు భారీగా తరలివచ్చిన ప్రజలు ఒక్కసారిగా నదీప్రవాహం పెరగడంతో నీటిలో చిక్కుకున్నారు. అంతకంతకు నదిలో నీటి ప్రవాహం పెరగడంతో చాలామంది కొట్టుకుపోయారు. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు ఎనిమిదిమంది మృతిచెందగా చాలామంది గల్లంతయ్యారు. 50మందిని ఈ ప్రమాదం నుండి సురక్షితంగా బయటపడ్డారు. నదిలో గల్లంతయిన వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. నదీ ప్రవాహంలో గల్లంతయిన వారి సంఖ్య ఎక్కువగా వుండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నారు.