
India Beat England by 7 Runs in Semi Final: ఒక్క క్యాచ్ మ్యాచ్‌నే మార్చేసింది
ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026 రెండో సెమీఫైనల్‌లో భారత్ అద్భుత విజయాన్ని అందుకుంది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ పోరులో ఇంగ్లాండ్‌ను 7 పరుగుల తేడాతో ఓడించి భారత్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. కేవలం బ్యాటింగ్, బౌలింగ్‌లోనే కాకుండా, ఫీల్డింగ్‌లోనూ భారత్ ప్రపంచ స్థాయి ప్రమాణాలను ప్రదర్శించింది. ముఖ్యంగా అక్షర్ పటేల్ పట్టిన అద్భుతమైన క్యాచ్‌లు మ్యాచ్ ఫలితాన్ని మార్చేశాయి.