Asianet News TeluguAsianet News Telugu

అగ్నిపథ్ పథకంతో యువతకు కలిగే ప్రయోజనాలివే...: కేంద్ర యువజన మంత్రి రాజ్యవర్ధన్

కేంద్ర ప్రభుత్వం ఆర్మీ రిక్రూట్ మెంట్ కోసం కొత్తగా తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకాన్ని యువత అర్థం చేసుకోడానికి ప్రయత్నించాలని కేంద్ర యువజన మరియు క్రీడా శాఖ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ సూచించారు. 

కేంద్ర ప్రభుత్వం ఆర్మీ రిక్రూట్ మెంట్ కోసం కొత్తగా తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకాన్ని యువత అర్థం చేసుకోడానికి ప్రయత్నించాలని కేంద్ర యువజన మరియు క్రీడా శాఖ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ సూచించారు. ఈ పథకం కేవలం దేశానికే కాదు యువకులకు చాలా ఉపయోగకరమని అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఆర్మీ నియామకాల కంటే చాలా ఎక్కువగా ఈ అగ్నిపథ్ ద్వారా నియామకాలు జరుగుతాయని... దీంతో ఎక్కువగా యువత ఆర్మీలో చేరే అవకాశం లభిస్తుందన్నారు. ఇలా నియమితులైన వారిలో ప్రతి నలుగురిలో  ఒకరికి 15ఏళ్లపాటు ఆర్మీలో పనిచేసే అవకాశం లభిస్తుందన్నారు. మిగతావారు కూడా 20లక్షల రూపాయలతో బయటకు వెళతారని... చిన్న వయసులో ఇంత పెద్దమొత్తంలో డబ్బులు సంపాదించే అవకాశం ఎవరికి వస్తుందన్నారు. బిఎస్ఎఫ్, సీఆర్పిఎఫ్, పోలీస్ తదితర విభాగాల్లో జరిగే రిక్రూట్ మెంట్స్ లో వీరికి ప్రాధాన్యత వుంటుందన్నారు మంత్రి రాజ్యవర్ధన్. ఈ అగ్నిపథ్ పథకం వెనక భారత సైన్యం, ప్రధాని మోదీ వున్నారని... ఇద్దరిపై నమ్మకం వుంచాలని మంత్రి యువతకు సూచించారు.  

Video Top Stories