గాంధీజి కలను నిజం చేస్తున్నది వైఎస్ జగన్..:వైవి సుబ్బారెడ్డి వీడియో

విశాఖపట్నం : ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందిస్తూ జాతిపిత మహాత్మాగాంధీ కలలను నిజం చేస్తున్నారని టిడిపి ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి అన్నారు.

Share this Video

విశాఖపట్నం : ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందిస్తూ జాతిపిత మహాత్మాగాంధీ కలలను నిజం చేస్తున్నారని టిడిపి ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి అన్నారు. గాంధీజి చెప్పినట్లు దేశానికి పట్టుకొమ్మలైన గ్రామాల్లో స్వరాజ్యాన్ని నెలకొల్పేందుకు జగన్ బలమైన పునాదులు వేస్తున్నారని అన్నారు. అలాగే బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనారీటలకు 60-70 శాతం, మహిళలకు 50 శాతం పదవులు ఇవ్వడమే కాదు రాజకీయంగా ఉన్నతస్థానాల్లో నిలబెట్టి సోషల్ జస్టిస్ చేస్తున్న గొప్ప ముఖ్యమంత్రి జగన్ అని సుబ్బారెడ్డి అన్నారు. 

వైసిపి 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విశాఖపట్నం పార్టీ కార్యాలయంలో టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి జెండా ఆవిష్కరించి కేక్ కట్ చేసారు. ఈ ఆవిర్భావ కార్యక్రమంలో మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్,
ఎమ్మెల్యేలు, వైసీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

Related Video