గుంటూరులో మహిళా మాక్ పార్లమెంట్..: ఏపీ మహిళా కమీషన్ ఛైర్మన్ ప్రకటన

గుంటూరు: ఈనెల 4వ తేదీన అంటే వచ్చే శుక్రవారం గుంటూరు జిల్లాలో జాతీయ మహిళా కమిషన్, రాష్ట్ర మహిళా కమిషన్ సంయుక్తంగా మహిళా మాక్ పార్లమెంట్ నిర్వహించనున్నట్లు ఏపీ మహిళా కమీషన్ ఛైర్మన్ వాసిరెడ్డి పద్మ ప్రకటించారు. 

First Published Mar 2, 2022, 3:23 PM IST | Last Updated Mar 2, 2022, 3:22 PM IST

గుంటూరు: ఈనెల 4వ తేదీన అంటే వచ్చే శుక్రవారం గుంటూరు జిల్లాలో జాతీయ మహిళా కమిషన్, రాష్ట్ర మహిళా కమిషన్ సంయుక్తంగా మహిళా మాక్ పార్లమెంట్ నిర్వహించనున్నట్లు ఏపీ మహిళా కమీషన్ ఛైర్మన్ వాసిరెడ్డి పద్మ ప్రకటించారు. ఆచార్య  నాగార్జున యూనివర్సిటీలో ఈ కార్యక్రమం జరపనున్నట్లు ఆమె తెలిపారు. మహిళలకు అన్ని రకాల సమస్యలపై, చట్టాలను ఎలా అమలు అవుతాయనే అంశాలపై అవగాహన కల్పించడమే కాదు ఐదు రకాల అంశాలపై ఈ మహిళా పార్లమెంట్లో చర్చించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి పలువురు మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎన్జీవోలు, న్యాయవాదులు, విద్యార్థులు పాల్గొంటారని వాసిరెడ్డి పద్మ వెల్లడించారు.