Nuzividu Crime: దంపతులను అర్ధరాత్రి అడ్డుకుని... దారుణానికి పాల్పడ్డ దుండగులు
విజయవాడ: కృష్ణా జిల్లా నూజివీడు నియోజకవర్గంలో మంగళవారం రాత్రి దారుణం చోటుచేసుకుంది. బైక్ పై వెళుతున్న దంపతులను చాట్రాయి మండలం చిత్తపూరు చెరువు వద్ద ముగ్గురు దుండగులు ఆడ్డుకున్నారు. ఇలా బైక్ ఆపగానే ఒక్కసారిగా వారిపై రెడ్ మిర్చీ స్ప్రే కొట్టడమే కాదు కర్రలతో చితకబాదారు. దీంతో నందిపాం రాంబాబు, నవ్య దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. దాడి అనంతరం దుండగులు అక్కడినుండి పరారయ్యారు. రోడ్డుపై గాయాలతో పడివున్న దంపతులను గమనించిన కొందరు వారిని నూజివీడు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చెయ్యకపోవడంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఆకతాయిల పనా...?కావాలనే కక్షతో ఎవరైనా దాడి చేశారా? ఇంకేమయినా కారణాలున్నాయా? అనేది తెలియాల్సి వుంది.