విశాఖలో వింత ఘటన... నాలుగడుగుల పామును అమాంతం మింగేసిన త్రాచుపాము

విశాఖపట్నం లోని నావికా దళ క్వార్టర్స్ లో వింత ఘటన చోటుచేసుకుంది. సుమారు 5 అడుగుల పొడవుగల త్రాచు పాము నాలుగు అడుగులు పొడవుగల మరో పామును అమాంతం మింగేసింది.

Share this Video

విశాఖపట్నం లోని నావికా దళ క్వార్టర్స్ లో వింత ఘటన చోటుచేసుకుంది. సుమారు 5 అడుగుల పొడవుగల త్రాచు పాము నాలుగు అడుగులు పొడవుగల మరో పామును అమాంతం మింగేసింది. ఇలా పూర్తిగా మింగేసి తర్వాత పామును తిరిగి బయటకు విడిచింది త్రాచుపాము. ఇలా పామును మింగిన తాచు ముందుకు వెళ్లలేని పరిస్థితిలో వుండగా క్వార్టర్స్ లో నావికాదళ అధికారులు గమనించారు. దీంతో వెంటనే పామలు పట్టడంలో నేర్పరి అయిన స్నేక్ క్యాచర్ నాగరాజుకు సమాచారం అందజేశారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న నాగరాజు చాకచక్యంగా వ్యవహరించి నాగుపామును పట్టుకోవడంతో అంత ఊపిరి పీల్చుకున్నారు. ఇలా పామును త్రాచు మింగేయడం, తిరిగి వదిలిపెట్టడాన్ని కొందరు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారాయి. 

Related Video