ప్రజాసంగ్రామ పాదయాత్రకు సర్వం సిద్దం... మహాశక్తి అమ్మవారిని దర్శించుకున్న బండి సంజయ్

కరీంనగర్ : బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ మూడో విడత ప్రజాసంగ్రామ పాదయాత్ర రేపటినుండి (ఆగస్ట్ 2 మంగళవారం) ప్రారంభంకానుంది.

Share this Video

కరీంనగర్ : బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ మూడో విడత ప్రజాసంగ్రామ పాదయాత్ర రేపటినుండి (ఆగస్ట్ 2 మంగళవారం) ప్రారంభంకానుంది. ఈ క్రమంలో ఇవాళ (సోమవారం) కరీంనగర్ లోని మహాశక్తి అమ్మవారిని సంజయ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆలయానికి చేరుకున్న ఆయనకు స్థానిక నాయకులు స్వాగతం పలికారు. రేపు ప్రముఖ పుణ్యక్షేత్రం యాదరిగిగుట్ట లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకుని బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభించనున్నారు. తొలి విడత ప్రజాసంగ్రామ యాత్ర ఛార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం నుండి, రెండో విడత ఆలంపూర్ జోగులాంబ అమ్మవారి ఆలయం నుండి ప్రారంభించగా మూడో విడత యాదాద్రి నుండి ప్రారంభం కానుంది. 

Related Video