Asianet News TeluguAsianet News Telugu

Visakhapatnam: పరవాడ ఫార్మా సిటీలో ప్రమాదం... విషవాయువులు లీక్

విశాఖ జిల్లా పరవాడలోని జవహార్ లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో ప్రమాదం చోటుచేసుకుంది. 

విశాఖ జిల్లా పరవాడలోని జవహార్ లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో ప్రమాదం చోటుచేసుకుంది. ఎమ్మెన్నార్ ఫార్మా యూనిట్ 2 బి బ్లాక్ సెకండ్ ఫ్లోర్ లో సాల్వెంట్స్ పంపింగ్ చేస్తుండగా ఒక్కసారిగా దట్టమైన పొగలు వ్యాపించి విషవాయువకులు వెలువడ్డాయి. దీంతో ఈ ఫార్మాకంపనీ ఉన్న ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్ (IOCL) బొట్లింగ్ ప్లాంట్ లో ఓ డ్రైవర్ అస్వస్థతకు గురయ్యాడు. అతడిని హాస్పిటల్ కు తరలించారు. ఉద్యోగులెవ్వరూ ఘటన జరిగిన ప్లాంట్ కు సమీపంలో లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.