
అభిమాని కోరిక తీర్చిన టిడిపి చీఫ్ చంద్రబాబు నాయుడు... పార్టీ ఆఫీస్ వద్ద ఆసక్తికర సన్నివేశం
మంగళగిరి: కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన టీడీపీ కార్యకర్త వేణు కోరికను తీర్చారు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. తా
మంగళగిరి: కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన టీడీపీ కార్యకర్త వేణు కోరికను తీర్చారు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. తాను కొనుగోలు చేసిన కొత్త కారును తమ ప్రియతమ నేత చంద్రబాబుతో ప్రారంభించాలని వేణు కోరుకున్నారు. దీంతో తన కారు తీసుకుని పార్టీ కార్యాలయానికి వెళ్లారు. అదృష్టవశాత్తు. పార్టీ కార్యాలయం వద్దే అధినేత చంద్రబాబు వున్నారు.ఆయన రాగానే తన కొత్త కారులో కూర్చోవాలని వేణు కోరాడు. అతడి కోరికను మన్నించిన చంద్రబాబు వెంటనే డ్రైవింగ్ సీట్లో కూర్చున్నారు. ఇలా పార్టీ కార్యకర్త చిన్నపాటి కోరికను తీర్చారు. తన ప్రియతమ నాయకుడు కారేక్కడంతో వేణుతో పాటు కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేశారు.