వైఎస్సార్ కాలనీలో మహిళా వాలంటీర్ పై దాడి.. గర్భిణి అని కూడా చూడకుండా..
విజయవాడ వైఎస్సార్ కాలనీలో పెన్షన్లు ఇవ్వడానికి వెళ్లిన మహిళా వాలంటీర్ పై స్థానికులు దాడి చేశారు.రెండో విడత రేషన్ ఇప్పించలేదనే కోపంతో సాదిక అనే వాలంటీర్ పై 157వ బ్లాక్ వాసూలు గొడవకు దిగారు.
విజయవాడ వైఎస్సార్ కాలనీలో పెన్షన్లు ఇవ్వడానికి వెళ్లిన మహిళా వాలంటీర్ పై స్థానికులు దాడి చేశారు.రెండో విడత రేషన్ ఇప్పించలేదనే కోపంతో సాదిక అనే వాలంటీర్ పై 157వ బ్లాక్ వాసూలు గొడవకు దిగారు. మాటా మాటా పెరిగి బూతులు తిట్టుకున్నారు.. చివరికి వాలంటీర్ కడుపుతో ఉందని కూడా చూడకుండా వాలంటీర్ ను, ఆమె కుటుంబ సభ్యులను విచక్షణారహితంగా కొట్టారు. దీంతో విధులు బహిష్కరించిన వాలంటీర్లు జక్కంపూడి వైఎస్సార్ కాలనీలోని సచివాలయం వద్ద ధర్నాకు దిగారు.