హైదరాబాద్: తనకు సీఎం కావాలనే ఆలోచన  లేదని  తెలంగాణ రాష్ట్ర  మున్సిఫల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు.  మరో మంత్రి హరీష్‌రావుతో తనకు ఎలాంటి విబేధాలు లేవని ఆయన స్పష్టం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడులో అభద్రతాభావం నెలకొందన్నారు.

మంగళవారం నాడు  తెలంగాణ మంత్రి కేటీఆర్  మీడియాతో చిట్ చాట్ చేశారు. ప్రధానంగా ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కేంద్రంగా చేసుకొని కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ఏపీలో మాదిరిగా తెలంగాణలో కుల రాజకీయాలకు చంద్రబాబునాయుడు  ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణలో  కుల రాజకీయాలు  నడవవని ఆయన చెప్పారు.

 ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పూర్తిగా అభద్రతా భావంతో ఉన్నారని  ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ  అభ్యర్థుల టిక్కెట్ల కేటాయింపు నుండి అన్ని విషయాలను బాబే  ఫైనల్ చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు.

మహా కూటమి పుంజుకొనే పరిస్థితే లేదన్నారు. సీట్ల కోసం  మహాకూటమిలోని పార్టీలు  కొట్లాడుకొంటున్నాయన్నారు.తెలంగాణలోని సెటిలర్సంతా టీఆర్ఎస్‌ వైపే ఉన్నారని కేటీఆర్ ధీమాను వ్యక్తం చేశారు.  తెలంగాణలో 100 సీట్లను తాము కైవసం చేసుకొంటామని  కేటీఆర్ చెప్పారు. వంద సీట్లు రాకపోతే  తాను రాజకీయ సన్యాసం చేస్తానని కేటీఆర్ సవాల్ విసిరారు. తన సవాల్‌కు విపక్షాలు స్వీకరించాలని కోరారు. 

విపక్షాల అభ్యర్థులు ఇంకా ఫైనల్ కానందునే  కేసీఆర్ ప్రచారం నిర్వహించడం లేదన్నారు. సరైన సమయంలో కేసీఆర్ ప్రచారాన్ని  ప్రారంభించనున్నట్టు చెప్పారు.

కోదండరామ్ పోటీ చేసే మూడు స్థానాల కోసం మేనిఫెస్టో అవసరమా అంటూ ఆయన ఎద్దేవా చేశారు. హరీష్ రావుపై ప్రత్యర్థులు చేస్తున్న విమర్శలు ర్ధరహితమన్నారు. హరీష్‌రావుతో తనకు ఎలాంటి విబేధాలు లేవన్నారు.

మరో  పది నుండి పదిహేను ఏళ్లు కేసీఆర్ సీఎంగా కొనసాగుతారని కేటీఆర్ ధీమాను వెలిబుచ్చారు.టీఆర్ఎస్‌లో 99 శాతం సంతృప్తి ఉందన్నారు.ఎన్నికల తర్వాత ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఎన్టీఆర్ మ్యూజియంగా మారనుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబునాయుడు దత్తపుత్రుడిగా మారాడని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

తెలంగాణలో కేసీఆర్‌కు అనుకూల వవనాలు వీస్తున్నాయని చెప్పారు. తెలంగాణలోని అన్ని స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులే కన్పిస్తున్నారని  కేటీఆర్ చెప్పారు.

సంబంధిత వార్తలు

టీఆర్ఎస్‌లో హరీష్ స్థితిపై రేవూరి సంచలన వ్యాఖ్యలు

చంద్రబాబూ..! జాగ్రత్త: నీ రికార్డులు బయటపెడతాం: హరీష్ సంచలనం

పువ్వులు పెట్టే వారికి పువ్వు గుర్తు... పుల్లలు పెట్టే వారికి అగ్గిపెట్టె గుర్తు: కేటీఆర్

సీఎం రేసులో లేను.. ఎన్నికల్లో పోటీ చేయడం లేదు: జైపాల్ రెడ్డి

రసమయికి చేదు అనుభవం: 4 ఏళ్లలో ఏం చేశావని నిలదీత

నేను గెలిస్తే హరీష్ ఔటే...: జగ్గారెడ్డి

సీట్ల పంచాయతీ: రహస్య ప్రదేశంలో కోదండరామ్ చర్చలు, ఆ తర్వాతే...

రాహుల్ గాంధీతో హరీష్ టచ్ లో ఉన్నారు: వంటేరు సంచలన వ్యాఖ్యలు

''మీ పాలన బాగాలేదు...కానీ మీరు బాగుండాలి మిత్రమా'' -కేసీఆర్ కు టిడిపి నేత లేఖ

కేసీఆర్ ను గద్దెదించాలని వాళ్ళిద్దరి ప్లాన్:బయటపెట్టిన కేటీఆర్

ఆ విషయంలో తండ్రిని మించిన తనయుడు కేటీఆర్:పొన్నం

నిజమా?: మల్కాజిగిరి నుంచి లగడపాటి లడాయి

చేనేత కార్మికులు కాదు చేనేత కళాకారులు:కేటీఆర్

నాకు ఇచ్చినా, అప్పిరెడ్డికి ఇచ్చినా ఓకే...ఎన్నారైకి ఇస్తే చూపిస్తా: శంకరమ్మ ఆగ్రహం

ఈ సర్వే నిజమేనా: ఎన్నికల్లో కేసీఆర్ కు భారీ షాక్?

చంద్రబాబుపై కేటీఆర్ సెటైర్.. ట్వీట్ వైరల్