హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీని గద్దె దిండచమే లక్ష్యంగా ఏర్పాటైన మహాకూటమిలో టిక్కెట్ల లొల్లి ఇంకా ఓ కొలిక్కి రావడం లేదు. కాంగ్రెస్,టీడీపీ, టీజేఎస్, సీపీఐ పార్టీలు ఏకమైనా సీట్ల సర్దుబాటుపై ఫినిషింగ్ టచ్ ఇవ్వలేకపోతున్నాయి. సీట్ల పేచీని తీర్చలేకపోతున్నాయి. 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు గట్టిగా నెలరోజులే ఉంది. సీట్ల లెక్కతేలడం ఒక ఎత్తైతే అభ్యర్థుల ప్రకటన మరో ఎత్తు. కూటమిలో సీట్ల సర్దుబాటుపై కసరత్తు ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ సీట్ల పంచాయితీని తేల్చేందుకు కాంగ్రెస్ సీనియర్ నేత  జానారెడ్డి నేతృత్వంలో త్రిసభ్యకమిటీ భేటీ కానుంది. 

మహాకూటమిలో 119 స్థానాలకు గాను కాంగ్రెస్,టీడీపీలు ఓ కొలిక్కి వచ్చాయి. సీట్ల సర్దుబాటు చేసుకున్నాయి. అభ్యర్థుల పేర్లు ఖరారు కావాల్సి ఉంది. నాలుగు పార్టీలకు గాను రెండు పార్టీలు పంచేసుకున్నాయి. కాంగ్రెస్ కు 95 స్థానాలు, టీడీపీకి 14 స్థానాలు కన్ఫమ్ చేసుకున్నాయి. ఇక ఈ స్థానాలపై ఎలాంటి మార్పులేదని మహాకూటమికి దిశానిర్దేశం చేస్తూ పెద్దన్న పాత్ర పోషిస్తున్న  కాంగ్రెస్ తేల్చిచెప్పింది. 

కాంగ్రెస్ టీడీపీలు 109 స్థానాలు పంచుకోగా మిగిలినవి కేవలం 10 స్థానాలు మాత్రమే. ఈ పది స్థానాల పీటముడి ఇప్పడమే కాంగ్రెస్ పార్టీకి పెద్ద కష్టాన్ని తెప్పిస్తోంది. ఈ పది స్థానాల్లో టీజేఎస్ కు ఆరు సీపీఐకు 4 కేటాయించాలా, లేనిపక్షంలో టీజేఎస్ కు 7 సీపీఐకు 3 కేటాయించాలా అన్న ఫార్మూలాను ఇరుపార్టీల మధ్య ఉంచింది కాంగ్రెస్. పది స్థానాలే ఉన్నాయి ఎలా పంచుకుంటారో పంచుకోండంటూ వారికే వదిలేసింది. 

అయితే కాంగ్రెస్ ప్రతిపాదనకు ససేమిరా అంటున్నాయి టీజేఎస్, సీపీఐ పార్టీలు. టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ కనీసం 12 సీట్లు కావాలని పట్టుబడుతున్నారు. ఇటీవలే 8 సీట్లు ఇస్తామని చెప్పి ఇప్పుడు ఏడు లేదా ఆరు అంటే ఊరుకోనని కోదండరామ్ తెగించి చెప్తున్నారు. పది సీట్లపై పేచీ తేలడం లేదని తెలిసినా కూడా కాంగ్రెస్,టీడీపీలు ఏదైనా సీట్ల త్యాగానికి మాత్రం అంగీకరించడం లేదు. తాము తేల్చేసుకున్నాం తమరే తేల్చుకోవాలంటూ ఇద్దరి మధ్యకిరికిరి పెట్టినట్లు పెట్టేశారు.

మరోవైపు తాము 9 స్థానాలు ఆశించామని అయితే కనీసం నాలుగు స్థానాలు ఇచ్చినా పర్వాలేదని అంతేకానీ కేవలం మూడు స్థానాలే ఇస్తే కష్టమంటూ సీపీఐ ఉంది. ఇద్దరు పట్టిన పట్టు ఉడుంపట్టులా పట్టడంతో ఇప్పుడు బాల్ జానారెడ్డి నేతృత్వంలోని త్రిసభ్యకమిటీ కోర్టులోకి నెట్టబడింది. 

దీంతో సీట్ల సర్దుబాటుపై శనివారం జానారెడ్డి నేతృత్వంలోని త్రిసభ్యకమిటీ ఓ నిర్ణయం తీసుకోనుంది. ముందు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ తో చర్చలు జరిపిన తర్వాత సీపీఐ రాష్ట్రకార్యదర్శి చాడ వెంకటరెడ్డితో భేటీ కావాలని జానారెడ్డి నేతృత్వంలోని కమిటీ నిర్ణయించుకుంది.  

మరోవైపు సీట్ల సర్దుబాటుపై టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ రహస్య మంతనాలు జరపడం చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ నగరంలోని శివార్లలో మహాకూటమి నేతలతో కోదండరామ్ సమావేశమైనట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి తన వాహనంలో  కాకుండా వేరే వాహనంలో కోదండరామ్ వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. 

ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసిన కోదండరామ్ సీట్ల సర్దుబాటు పంచాయితీ తేలకపోతే సొంతగా పోటీ చెయ్యాలని మహాకూటమికి గుడ్ బై చెప్పాలని యోచిస్తున్నారని ప్రచారం జరుగుతుంది.  

ఈ వార్తలు కూడా చదవండి

ఉత్తమ్ భార్య త్యాగం: టీడీపికి కాంగ్రెసు ఇచ్చే సీట్లు ఇవే...

కూకట్ పల్లి నుంచి విజయశాంతి: రాములమ్మ కోసం బాలయ్య

ప్రజా కూటమిలో లుకలుకలు: చాడ సీరియస్ కామెంట్స్​​​​​​​

నా చుట్టూ చర్చ జరగొద్దు: రాహుల్ తో భేటీ తర్వాత కోదండరామ్

రాహుల్‌గాంధీతో కోదండరామ్ భేటీ: టీజేఎస్‌‌కు స్వల్ప ఊరట

సర్ధుబాటుపై పీటముడి: ప్రజా కూటమిలో సీట్ల బేరసారాలు

ప్రజా కూటమి సీట్ల సర్ధుబాటు ఖరారు: కాంగ్రెస్ 95, టీడీపీకి 14

ప్రజాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌తో ఇక తాడోపేడో

కాంగ్రెస్ లీకులపై అసంతృప్తి: టీడీపీ, సీపీఐ, టీజేఎస్ నేతల భేటీ

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: టీజేఎస్‌, సీపీఐకి కాంగ్రెస్‌ షాక్

ప్రజా కూటమికి బీటలు: సీట్ల సర్దుబాటుపై పీటముడి

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: రంగంలోకి చంద్రబాబు