అక్రమ కేసుల్లో తనను అరెస్టు చేయించిన వారిని వదిలిపెట్టబోనని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి హెచ్చరించారు. ఈ విషయం తెలిసే మంత్రి హరీష్ రావు తన నియోజకవర్గం సిద్దిపేట వదిలి సంగారెడ్డిలో మకాం వేశారని అన్నారు. హరీష్ సంగారెడ్డిలోనే ప్రచారం చేసి ఇక్కడే నిద్రపోతున్నారని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.

యునైటెడ్ క్రిస్టియన్ ఫోరం ఆధ్వర్యంలో జరిగిన క్రైస్తవ ఆత్మీయ సమ్మేళన సభలో జగ్గారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అధికారాన్ని అడ్డం పెట్టుకుని మంత్రి హరీష్, స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తనపై అక్రమ కేసులు పెడుతున్నారని అన్నారు. ఇలా ఎక్కువ కేసుల్లో ఇరికించడం ద్వారా తన నామినేషన్ తిరన్కరణకు గురయ్యేలా చేయాలన్నది వారి ప్లాన్ అని జగ్గారెడ్డి ఆరోపించారు. తాను గెలిస్తే హరీష్ ఔటేనని జగ్గారెడ్డి హెచ్చరించారు.
ఈ సభలో జగ్గారెడ్డి క్రైస్తవులకు పలు హామీలిచ్చారు. ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే సంగారెడ్డి లోని చర్చిల్లోని సమస్యలను తీరుస్తానని హామీ ఇచ్చారు. అలాగే ఈ మతానికి చెందిన యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తానన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తన హామీలను నెరవేర్చి తీరతానని జగ్గారెడ్డి యేసు ప్రభువుపై ఒట్టేసి మరీ ప్రకటించారు.
మరిన్ని వార్తలు
కేసీఆర్,కేటీఆర్, హరీష్‌లపై జగ్గారెడ్డి తిట్ల దండకం....