Asianet News TeluguAsianet News Telugu

ఈ సర్వే నిజమేనా: ఎన్నికల్లో కేసీఆర్ కు భారీ షాక్?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం అన్ని పార్టీల ప్రచారం ఊపందుకుంది. ఎన్నికలకు మరో నెలరోజుల సమయమే ఉండటంతో ముఖ్య పార్టీలన్ని నియోజకవర్గాల బాట పట్టాయి. అయితే వీరితో పాటే ఎన్నికల సరళిని, పార్టీల బలాబలాలను, గెలుపోటములను అంచనా వేసే సర్వే సంస్థలు కూడా నియోజకవర్గాల్లో పాగా వేసి ఓటర్ల నాడిని పడుతున్నాయి. ఇలా తెలంగాణ వ్యాప్తంగా ఈటీ(టైమ్స్ నౌ సంస్థకు చెందింది) అనే జాతీయ సంస్థ నిర్వహించిన సర్వేలో షాకింగ్ ఫలితాలు వచ్చాయి. టీఆర్ఎస్ కు కాకుండా మహాకూటమివైపే తెలంగాణ ప్రజలు మొగ్గుచూపుతునట్లు ఈ సంస్థ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 

Shocking Survey Results in Telangana
Author
Hyderabad, First Published Nov 2, 2018, 4:09 PM IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం అన్ని పార్టీల ప్రచారం ఊపందుకుంది. ఎన్నికలకు మరో నెలరోజుల సమయమే ఉండటంతో ముఖ్య పార్టీలన్ని నియోజకవర్గాల బాట పట్టాయి. అయితే వీరితో పాటే ఎన్నికల సరళిని, పార్టీల బలాబలాలను, గెలుపోటములను అంచనా వేసే సర్వే సంస్థలు కూడా నియోజకవర్గాల్లో పాగా వేసి ఓటర్ల నాడిని పడుతున్నాయి. ఇలా తెలంగాణ వ్యాప్తంగా ఈటీ(టైమ్స్ నౌ సంస్థకు చెందింది) అనే జాతీయ సంస్థ నిర్వహించిన సర్వేలో షాకింగ్ ఫలితాలు వచ్చాయి. టీఆర్ఎస్ కు కాకుండా మహాకూటమివైపే తెలంగాణ ప్రజలు మొగ్గుచూపుతునట్లు ఈ సంస్థ వెలువరించినట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 

ఈ వివరాల ప్రకారం రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో  తెలంగాణలోని మొత్తం స్థానాల్లో మహాకూటమి(కాంగ్రెస్, టిడిపి, సిపిఐ, టీజెఎస్) దాదాపు  67 నుండి 81 సీట్లను సాధిస్తుందని వెల్లడించింది. అయితే ప్రస్తుత అధికార పార్టీ టీఆర్ఎస్ కేవలం 35 నుండి 40 స్థానాలకే పరిమితం అవుతుందని సర్వే సంస్థ సంచలన ప్రకటన చేసింది. ఇక ఎంఐఎం పార్టీకి 5 నుండి 7, బిజెపికి 0 నుండి 3 స్థానాలు వచ్చే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. 

ఇలా ముందస్తు ఎన్నికలకు వెళ్లిన టీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ తగలనున్నట్లు ఈటీ సంస్థ బైటపెట్టింది. అయితే ఈ సర్వేపై కాంగ్రెస్ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తుండగా టీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి బోగస్ సంస్థల సర్వే ఫలితాలను ప్రజలు నమ్మరని టీఆర్ఎస్ నాయకులు విమర్శిస్తున్నారు.   

మరిన్ని వార్తలు

సర్వే: కేసీఆర్‌కు అంత లేదు, మెరుగైన కాంగ్రెస్

తెలంగాణలో పోటీకి లగడపాటి సై, పోలింగ్ తర్వాత సర్వే ఫలితాలు

కేసీఆర్‌ది గ్లాస్ సర్వే...నాది గ్రాఫ్ సర్వే: టీఆర్ఎస్ గెలిస్తే చెప్పులు మోస్తా: రాములు నాయక్
 

Follow Us:
Download App:
  • android
  • ios