Asianet News TeluguAsianet News Telugu

పువ్వులు పెట్టే వారికి పువ్వు గుర్తు... పుల్లలు పెట్టే వారికి అగ్గిపెట్టె గుర్తు: కేటీఆర్

ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతిపక్ష పార్టీలపై మంత్రి కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.  యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిపల్లిలో జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ.. ప్రజల చెవుల్లో పువ్వులు పెట్టే బీజేపీకి పువ్వు గుర్తు.. పల్లలు పెట్టే వారికి అగ్గిపెట్టే గుర్తు ఇచ్చారని ఎద్దేవా చేశారు. 

Minister KTR Election Campaign in Yadadri District
Author
Yadagirigutta, First Published Nov 4, 2018, 4:44 PM IST

ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతిపక్ష పార్టీలపై మంత్రి కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.  యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిపల్లిలో జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ.. ప్రజల చెవుల్లో పువ్వులు పెట్టే బీజేపీకి పువ్వు గుర్తు.. పల్లలు పెట్టే వారికి అగ్గిపెట్టే గుర్తు ఇచ్చారని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్-చంద్రబాబు ఇద్దరూ ఒక్కటయ్యారని.. ఆలేరులో అభ్యర్థిని రాహుల్ గాంధీ కాకుండా చంద్రబాబు ఎంపిక చేస్తారన్నారు. పనిచేస్తున్న ప్రభుత్వానికి ఆటంకాలు కలిగించేలా కాంగ్రెస్ నాయకులు 200 కేసులను వేశారని.. చివరికి చనిపోయిన వారి పేర్లతో కూడా కేసులు వేయించారని కేటీఆర్ ఆరోపించారు.

కేసీఆర్ అధికారంలోకి వచ్చాకా రూ.17 వేల కోట్ల రుణమాఫీ, 24 గంటల కరెంట్ ఇచ్చారన్నారు... రైతు బంధు పథకం కింద ఎకరానికి రూ.8000 ఇచ్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని తెలిపారు. మరోసారి అధికారంలోకి వస్తే లక్ష రైతు రుణమాఫీతో పాటు రైతుబంధు పథకం మొత్తాన్ని రూ.10 వేలకు పెంచుతామని కేటీఆర్ హామీ ఇచ్చారు.

అలాగే అధికారంలోకి వచ్చిన వెంటనే డిసెంబర్ 11వ తేదీ నుంచి రూ. 2016 పింఛను ఇస్తామని.. పింఛను అందుకునే వయస్సును 60 నుంచి 55కు తగ్గిస్తామని తెలిపారు. వికలాంగులకు రూ.3016 పింఛను అందజేస్తామని హామీ ఇచ్చారు.

నెలకు 3000 చొప్పున నిరుద్యోగ భృతిని దాదాపు 10 లక్షల మందికి అందజేస్తామని కేటీఆర్ ప్రకటించారు. హైదరాబాద్ నుంచి వరంగల్ వరకు పారిశ్రామిక కారిడార్, హైదరాబాద్ నుంచి రాయగిరి వరకు ఎంఎంటీఎస్ రైలును తీసుకొస్తామని అన్నారు. కా

ళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తి చేసి ఆలేరు నియోజకవర్గంలోని 1.40 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని ప్రకటించారు. 70 ఏళ్ల దేశానికి కాంగ్రెస్ పార్టీ చేసేందేమీ లేదని మొండిచెయ్యి ఇచ్చారని ఎద్దేవా చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు యాదగిరిగుట్టను పట్టించుకోలేదని.. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుపతికి ధీటుగా అభివృద్ధి చేశారని కేటీఆర్ గుర్తు చేశారు.

సీఎం రేసులో లేను.. ఎన్నికల్లో పోటీ చేయడం లేదు: జైపాల్ రెడ్డి

రసమయికి చేదు అనుభవం: 4 ఏళ్లలో ఏం చేశావని నిలదీత

నేను గెలిస్తే హరీష్ ఔటే...: జగ్గారెడ్డి

సీట్ల పంచాయతీ: రహస్య ప్రదేశంలో కోదండరామ్ చర్చలు, ఆ తర్వాతే...

రాహుల్ గాంధీతో హరీష్ టచ్ లో ఉన్నారు: వంటేరు సంచలన వ్యాఖ్యలు

''మీ పాలన బాగాలేదు...కానీ మీరు బాగుండాలి మిత్రమా'' -కేసీఆర్ కు టిడిపి నేత లేఖ

కేసీఆర్ ను గద్దెదించాలని వాళ్ళిద్దరి ప్లాన్:బయటపెట్టిన కేటీఆర్

ఆ విషయంలో తండ్రిని మించిన తనయుడు కేటీఆర్:పొన్నం

నిజమా?: మల్కాజిగిరి నుంచి లగడపాటి లడాయి

చేనేత కార్మికులు కాదు చేనేత కళాకారులు:కేటీఆర్

నాకు ఇచ్చినా, అప్పిరెడ్డికి ఇచ్చినా ఓకే...ఎన్నారైకి ఇస్తే చూపిస్తా: శంకరమ్మ ఆగ్రహం

ఈ సర్వే నిజమేనా: ఎన్నికల్లో కేసీఆర్ కు భారీ షాక్?

చంద్రబాబుపై కేటీఆర్ సెటైర్.. ట్వీట్ వైరల్

Follow Us:
Download App:
  • android
  • ios